Fri Nov 15 2024 20:40:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రఫుల్ దేశాయ్ ఫేక్ సర్టిఫికెట్ తో ఐఏఎస్ సాధించాడంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ పరీక్షలో రిజర్వేషన్ పొందేందుకు
Claim :
ప్రఫుల్ దేశాయ్ ఫేక్ సర్టిఫికెట్ తో ఐఏఎస్ సాధించారు.Fact :
2018, 19 సంవత్సరాల్లో ప్రఫుల్ దేశాయ్ అంగవైకల్యం కలిగి ఉన్నారని ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ అధికారికంగా గుర్తించింది. ఆయనకు 45 శాతం అంగవైకల్యం ఉంది. కొన్ని శారీరక కార్యకలాపాల్లో పాల్గొనగలరు. వైరల్ ఫోటోలలో ఉన్నవి శిక్షణకు సంబంధించినవని ప్రఫుల్ దేశాయ్ వివరించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీస్ పరీక్షలో రిజర్వేషన్ పొందేందుకు నకిలీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించారనే ఆరోపణలను తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రఫుల్ దేశాయ్ ఖండించారు. ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ (OH) కోటాను దుర్వినియోగం చేశారని ప్రఫుల్ దేశాయ్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన వైకల్యం తాను సాధించాలనుకున్న వాటిని అడ్డుకోవని.. తాను పాల్గొన్న ఈవెంట్లు తన శిక్షణలో భాగమని చెప్పారు. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు సంబంధించిన ఓ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతూ ఉండగా.. ఇప్పుడు దేశాయ్‌పై ఆరోపణలు వచ్చాయి.
దేశాయ్ గుర్రపు స్వారీ, రాఫ్టింగ్, సైక్లింగ్‌తో సహా పలు సాహస క్రీడలలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవ్వడంతో దేశాయ్ కూడా పూజా ఖేద్కర్ తరహాలోనే ఉద్యోగాన్ని పొందారంటూ వివాదం మొదలైంది. ఈ కార్యకలాపాలు వైకల్యం తీవ్రతకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు విమర్శించారు. వైకల్యం ఉందని చెబుతూ ఉద్యోగాన్ని పొందారంటూ విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు ప్రఫుల్ పటేల్ ఇన్స్టాగ్రామ్ వీడియో స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు.. ఆయన గుర్రపు స్వారీ, రివర్ రాఫ్టింగ్, సైక్లింగ్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు “UPSC లో మోసానికి సంబంధించిన మరో కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైనది” అనే శీర్షికతో చిత్రాలను పంచుకున్నారు. ప్రఫుల్ దేశాయ్, IAS అధికారి 2019 బ్యాచ్ - AIR 532 EWS & ఆర్థోపెడికల్ వికలాంగుల విభాగంలో ఉద్యోగాన్ని సంపాదించారంటూ పలువురు పోస్టులు పెట్టారు.
1. 30కిమీ సైక్లింగ్ చేస్తూ కనిపించారు 2. 25 కిలోమీటర్ల ట్రెక్కింగ్ 3. రిషికేశ్‌లో రివర్ రాఫ్టింగ్ 4. హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్న ఫోటోలను నెటిజన్లు పోస్టు చేసారు.
వినియోగదారులు “అన్నింటినీ చేయగలుగుతూ ఉన్నారు, అంత ఫిట్‌గా ఎలా ఉన్నారు. ఎలాంటి అద్భుతం జరిగిందో మీ జీవితంలో దయచేసి చెప్పండి సార్. మీ ఫిట్నెస్ మంత్రాన్ని మాతో పంచుకోండి” అంటూ అందులో పోస్టులు పెట్టారు. అంగవైకల్యం ఉంటే అవన్నీ ఎలా చేయగలుగుతారంటూ నెటిజన్లు సైతం సందేహం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో అంగవైకల్యం కోటాను ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.
ప్రఫుల్ దేశాయ్ గురించి మరొక వినియోగదారుడు.. IAS అధికారి ప్రఫుల్ దేశాయ్ కు సంబంధించి ఒక పోస్ట్‌ను భాగస్వామ్యం చేసారు. 'IAS ఉద్యోగం పొందడానికి ఫేక్ సర్టిఫికెట్లను ఉపయోగించారు. రివర్ రాఫ్టింగ్, గుర్రపు స్వారీ, మౌంటెన్ బైకింగ్ లాంటివి చేస్తున్నారు." అంటూ చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. IAS అధికారి ప్రఫుల్ దేశాయ్ “2018, 2019 లో ఢిల్లీ AIIMS తనను బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి అని ధృవీకరించింది” అంటూ తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో, ప్రఫుల్ దేశాయ్ తన X ఖాతాలో తన వైకల్యానికి సంబంధించిన వివరణను పంచుకున్నట్లు మేము కనుగొన్నాము. “తన బెంచ్‌మార్క్ వైకల్యం సర్టిఫికేట్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్న వారికి, తప్పుడు సమాచారాన్ని పంచుకునే వారందరికీ అంటూ ఓ వివరణ ఇచ్చారు" ప్రఫుల్ దేశాయ్.
“సమర్థవంతమైన అధికారులు జారీ చేసిన బెంచ్‌మార్క్ వైకల్యం సర్టిఫికేట్‌తో నేను Upsc పరీక్షకు దరఖాస్తు చేసాను. Upsc పరీక్ష 2018 సమయంలో, చాలా కృషి, అంకితభావంతో నేను Upsc భవన్లో వ్యక్తిత్వ పరీక్ష/ఇంటర్వ్యూకి హాజరయ్యాను. మరుసటి రోజు ప్రక్రియలో భాగంగా నేను ఢిల్లీలోని AIIMSలోని మెడికల్ బోర్డు ముందు వైద్య పరీక్షలకు హాజరయ్యాను. సమగ్ర విచారణ తర్వాత, ఢిల్లీలోని AIIMSలోని మెడికల్ బోర్డ్, నేను బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిని అని ధృవీకరించింది. కానీ నేను 2018లో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను.
"నా Upsc పరీక్ష 2019 సమయంలో, నేను మళ్లీ పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూకు హాజరయ్యాను. నేను మెడికల్ బోర్డ్ AIIMS ఢిల్లీ ముందు హాజరయ్యాను. మళ్లీ, క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత, ఢిల్లీలోని AIIMSలోని మెడికల్ బోర్డు నేను బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిని అని ధృవీకరించింది. అదే నివేదికను DoPT, UPSCతో పంచుకున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వ్యక్తులకు శిక్ష పడాలి. నేను సైక్లింగ్, ట్రెక్కింగ్, ఇతర కార్యకలాపాలను చేసిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి, నేను చేసిన పనులన్నీ నా స్నేహితుల సహాయంతో చేసినవే. ఇవన్నీ మా శిక్షణా కార్యక్రమంలో భాగంగా తీసుకున్నవి.
నా శారీరక పరిమితులను పెంచి, ఇతరులలా సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం తప్పా? నకిలీ సమాచారాన్ని షేర్ చేస్తున్న నెటిజన్లందరికీ నా అభ్యర్థన ఏమిటంటే, పూర్తి సమాచారం తెలుసుకోకుండా మీరు ఓ ముగింపుకు రావద్దు. నేను ఏదైనా మెడికల్ బోర్డు పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను." అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు ప్రఫుల్ దేశాయ్.
“30 కిమీ సైక్లింగ్, గుర్రపు స్వారీ: ఇప్పుడు, యుపిఎస్సి కోసం డిసేబిలిటీ కోటా ఫోర్జరీపై మరో ఐఎఎస్ అధికారి" అంటూ టైమ్స్ నౌ ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. టైమ్స్ నౌ లో దేశాయ్ ఇచ్చిన సమాధానాన్ని కూడా ప్రస్తావించారు "తాను అధికారులు ఇచ్చిన బెంచ్‌మార్క్ వైకల్యం సర్టిఫికేట్‌తో UPSC పరీక్షకు దరఖాస్తు చేసాను. UPSC పరీక్ష 2018 సమయంలో.. చాలా కష్టపడి అంకితభావంతో పని చేశారు. Upsc భవన్లో పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. తప్పుడు ససర్టిఫికెట్లతో ప్రయోజనం పొందే వ్యక్తులకు శిక్ష తప్పకుండా పడాలని నేను అంగీకరిస్తున్నాను, అయితే అదే సమయంలో మనం నిజమైన వ్యక్తుల పట్ల సున్నితంగా వ్యవహరించాలి." అంటూ ప్రఫుల్ స్పందించారు.
ది వీక్‌లో కూడా ఒక కథనం ప్రచురించారు. “సమర్థవంతమైన అధికార యంత్రాంగం జారీ చేసిన బెంచ్‌మార్క్ వైకల్యం సర్టిఫికేట్‌తో తాను UPSCకి దరఖాస్తు చేసుకున్నట్లు దేశాయ్ బదులిచ్చారు. అతను ఎయిమ్స్ వైద్య బృందం ముందు హాజరయ్యాడని, అతను వికలాంగుడిగా ధృవీకరించారని దేశాయ్ తెలిపారు" అంటూ కథనంలో ఉంది.
సైక్లింగ్, రాఫ్టింగ్ చేస్తున్న చిత్రాలు దేశాయ్ శిక్షణా కార్యక్రమానికి సంబంధించినవి. "వైకల్యం ఉన్నంత మాత్రాన శారీరకంగా ఛాలెంజ్డ్ వ్యక్తిగా ఉండటం తప్పా అని ప్రఫూల్ దేశాయ్ ప్రశ్నించారు. ఇతరుల వలె సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించానన్నారు. తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్న నెటిజన్ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఆరోపణలే నిజమైనట్లు ప్రచారం చేయవద్దని ఏ మెడికల్ బోర్డు పరీక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
న్యూస్ 18 “సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం తప్పా? తెలంగాణ ఐఏఎస్ అధికారి వికలాంగ కోటా ఫోర్జరీ క్లెయిమ్‌లను ఖండించారు” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.
IAS అధికారి ప్రఫుల్ దేశాయ్ 2018, 2019లో కూడా AIIMS ఢిల్లీ బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిగా సర్టిఫికేట్ ఇచ్చిందని వివరించారు. “వైకల్యం ఉన్నప్పటికీ, కొన్ని పనుల్లో భాగమవ్వగలను. వైరల్ ఫోటోలు నా శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి." అని తెలిపారు.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము.
Claim : ప్రఫుల్ దేశాయ్ ఫేక్ సర్టిఫికెట్ తో ఐఏఎస్ సాధించారు.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story