Mon Dec 23 2024 11:59:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: CBSE టెక్స్ట్ బుక్స్ లో డేటింగ్ గురించి పాఠ్యాంశాలు ఉన్నాయంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
డేటింగ్, రిలేషన్ షిప్స్ గురించి ప్రస్తుత సమాజంలో మాట్లాడుకోవడం చాలా అరుదైన విషయం
Claim :
CBSE తొమ్మిదో తరగతి పాఠ్యాంశాల్లో రిలేషన్ షిప్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు.Fact :
CBSE ఏ పుస్తకాలను ప్రచురించదు.. ఏ ప్రైవేట్ ప్రచురణకర్తల పుస్తకాలను సిఫారసు చేయదు. వైరల్ అవుతున్న పోస్టు 'A Guide to Self Awareness and Empowerment' అనే పుస్తకం నుండి వచ్చింది. ఈ పుస్తకాన్ని గగన్ దీప్ కౌర్ రచించగా.. జి రామ్ బుక్స్ (పి) లిమిటెడ్ ప్రచురించింది.
డేటింగ్, రిలేషన్ షిప్స్ గురించి ప్రస్తుత సమాజంలో మాట్లాడుకోవడం చాలా అరుదైన విషయం. అసలు తల్లిదండ్రులు, పిల్లలు కలిసి అలాంటి విషయాలను మాట్లాడుకోవడం జరగదు.. ఇక పాఠశాలల్లో ఉపాధ్యాయులు దాదాపుగా పిల్లలతో చర్చించరు. సెక్సువల్ ఎడ్యుకేషన్ విషయం గురించి కూడా చాలా పాఠశాలల్లో కనీసం బోధించరు.
భారతదేశంలో డేటింగ్, రిలేషన్షిప్ వంటి విషయాల గురించి చర్చించడంపై అనధికార నిషేధం సాగుతూ ఉంది. ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు, తోబుట్టువులతో కూడా పంచుకోడానికి వెనుకాడుతూ ఉంటారు. ఇలాంటి విషయాలపై ఏవైనా సూచనలు, చిట్కాల కోసం, టీనేజర్లు సన్నిహిత స్నేహితులతో చర్చించుకుంటారు లేదా ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య.. ఓ టెక్స్ట్ బుక్ పేజీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) టెక్స్ట్ బుక్ లో రిలేషన్ షిప్స్ గురించి అధ్యాయాలను ప్రవేశపెట్టారని ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థుల కోసం ఈ ఛాప్టర్లను తీసుకుని వచ్చారని.. అందులో డేటింగ్ గురించి డీటైల్ గా చెప్పారని తెలుస్తోంది. హెల్తీ రిలేషన్ షిప్స్ అనేవి ఎలా ఉంటాయో అందులో వివరించారు.
పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ లో ఇలాంటి పాఠ్యాంశాలు ఉంచారంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య.. ఓ టెక్స్ట్ బుక్ పేజీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE ) టెక్స్ట్ బుక్ లో రిలేషన్ షిప్స్ గురించి అధ్యాయాలను ప్రవేశపెట్టారని ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థుల కోసం ఈ ఛాప్టర్లను తీసుకుని వచ్చారని.. అందులో డేటింగ్ గురించి డీటైల్ గా చెప్పారని తెలుస్తోంది. హెల్తీ రిలేషన్ షిప్స్ అనేవి ఎలా ఉంటాయో అందులో వివరించారు.
పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ లో ఇలాంటి పాఠ్యాంశాలు ఉంచారంటూ ప్రచారం చేస్తున్నారు.
మరికొందరు ఇది చాలా మంచి పని అని.. పిల్లలు తెలుసుకుంటారంటూ వివరిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వినియోగదారులు సానుకూలంగా స్పందిస్తూ అదే చిత్రాన్ని పంచుకున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వివిధ సోషల్ మీడియా సైట్స్ లో అప్లోడ్ చేసిన పోస్ట్‌ను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. అలాగే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డేటింగ్, రిలేషన్ షిప్స్ కు గురించి IX తరగతి పాఠ్యపుస్తకంలో ఉందని చూపించిన వైరల్ పోస్ట్‌కు సంబంధించి ఒక వివరణను జారీ చేసింది. CBSE తన అధికారిక X (అధికారికంగా ట్విట్టర్) ఖాతాలో పుస్తకాలను CBSE ప్రచురించదని తెలిపింది.
రిపోర్టుల ప్రకారం డేటింగ్, రిలేషన్ షిప్స్ పై అభ్యంతరకరమైన విషయాలను కలిగి ఉన్న టెక్స్ట్ బుక్ ను CBSE ప్రచురణగా ప్రచారం చేస్తున్నారని.. అందులో ఎలాంటి నిజం లేదని వివరించారు. ఈ విషయాన్ని తమకు తప్పుగా ఆపాదిస్తూ ఉన్నారని.. ఇది పూర్తిగా నిరాధారమైన వాదనలంటూ కొట్టి పారేశారు.
మేము " డేటింగ్ & రిలేషన్షిప్స్" అనే కీ వర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. @nhgps_in పోస్ట్ చేసిన ఒక ట్వీట్‌ని కనుగొన్నాము, అందులో వినియోగదారులు G. Ram Books (P) LTD కు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసారు.
G Ram Books (P) Ltd సోషల్ మీడియా అకౌంట్స్ ను వెతకగా.. అందులో తాము పబ్లిష్ చేసిన పుస్తకానికి సంబంధించినదేనని సంస్థ ఒప్పుకుంది. డేటింగ్ & రిలేషన్‌షిప్‌లపై మా అధ్యాయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని.. సానుకూల స్పందన వచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం, ఆలోచనాత్మకంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం కోసం విప్లవాత్మకమైన కంటెంట్‌ను రూపొందించడం ఇలాగే కొనసాగించాలని మేము ఆశిస్తున్నామని వివరణాత్మకంగా పోస్టుల్లో తెలియజేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక కథనం కూడా CBSE పాఠ్యపుస్తకానికి సంబంధించినది కాదని తెలిపింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న చిత్రం CBSE పాఠ్యపుస్తకం లోని చాప్టర్ కాదు. CBSE పుస్తకాలను ప్రచురించడం లేదు.
ముగింపు: పైన ఇచ్చిన వివరణ, వివిధ మీడియా నివేదికల ఆధారంగా.. డేటింగ్, రిలేషన్ షిప్ లపై CBSE పాఠ్యపుస్తకంలో చాఫ్టర్ లేదని స్పష్టమవుతుంది. ఇది CBSEకి తప్పుగా ఆపాదించారు.
Claim : CBSE introduced chapters on relationship in its Class 9 curriculum
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story