ఫ్యాక్ట్ చెక్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ తో భారత్ స్నేహం

Claim :
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారుFact :
వైరల్ ఫోటోను డిజిటల్ గా ఎడిట్ చేశారు
అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ తో భారత్ స్నేహం గురించి స్పందించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తూ ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. శాంతిని పెంపొందించడానికి న్యూఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలను పాకిస్థాన్ పట్టించుకోలేదని, శత్రుత్వం, ద్రోహం పాకిస్థాన్ నుండి ఎదురయ్యాయని అన్నారు. పాకిస్తాన్ భారతదేశంపై పరోక్ష యుద్ధం చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. సామరస్యపూర్వక సహజీవనం వైపు పాకిస్థాన్ అడుగులు వేయలేదని విమర్శించారు. పదే పదే భారతదేశంతో విభేదించాలని నిర్ణయించుకున్నారని పాకిస్తాన్‌తో దెబ్బతిన్న సంబంధాల గురించి మోదీ వ్యాఖ్యానించారు. 2014లో తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, ఇరు దేశాల మధ్య నెలకొన్న గందరగోళ పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను కోరినట్లు ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.