Mon Dec 23 2024 01:38:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రికెటర్ మహ్మద్ షమీని పెళ్లి చేసుకోలేదు
సానియా-షమీ వివాహం చేసుకోలేదు
Claim :
భారత క్రికెటర్ మహ్మద్ షమీని సానియా మీర్జా పెళ్లాడిందిFact :
సానియా-షమీ వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వైరల్ చిత్రాన్ని ఎడిట్ చేశారు
గత ఏడాది భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోయింది. ముఖ్యంగా సానియా మీర్జా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచుగా వార్తల్లో నిలిచింది. తన భార్య హసిన్ జహాన్‌తో విడిపోయిన భారత క్రికెటర్ మహమ్మద్ షమీని ఆమె పెళ్లాడబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
పెళ్ళికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి చేసుకున్నట్లు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫోటోను ఎడిట్ చేశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. ఇండియా టుడే వెబ్సైట్లో సానియా మీర్జా వెడ్డింగ్ ఆల్బమ్‌ని మేము కనుగొన్నాము. అసలు ఫోటో 2010లో క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా పెళ్లికి సంబంధించినది. అయితే, మాలిక్ స్థానంలో షమీ ఉన్నట్లుగా ఎడిట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేము "షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా వివాహం" అనే కీవర్డ్‌ని ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. మాకు NDTV ప్రచురించిన కథనం కనిపించింది. ఆ కథనంలో సానియా మీర్జా తండ్రి, ఇమ్రాన్ మీర్జా, "సానియా పెళ్ళికి సంబంధించి ఎటువంటి నిజం లేదు. ఇదంతా అబద్ధం. చెత్త వార్తలు. సానియా షమీని అసలు కలవలేదు" అని వివరణ ఇచ్చారు.
తదుపరి విచారణలో, మేము జూన్ 21, 2024న హిందూస్తాన్ టైమ్స్ కథనాన్ని చూశాం. "ఈ ఏడాది జూన్ 12న ఫేస్బుక్లో షేర్ చేసిన కల్పిత చిత్రం నుండి ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. వాస్తవానికి ఏప్రిల్ 2010లో సానియా, షోయబ్‌ల వివాహానికి సంబంధించిన ఫోటోను ఎడిట్ చేశారు. సానియా తన పెళ్లి దుస్తులలో ఉండగా.. షమీ ముఖాన్ని షోయబ్ ముఖంపై డిజిటల్‌గా ఉంచారు."
మేము సానియా మీర్జా సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేయగా.. ఈ పుకార్లకు సంబంధించిన పోస్ట్‌లు ఏవీ కనుగొనలేకపోయాం. ఆమె ఇటీవలి పోస్ట్‌లో హజ్ యాత్రకు సంబంధించిన పోస్ట్ ను పెట్టింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా సానియా హజ్ యాత్రపై ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. సానియా మీర్జా, సనా ఖాన్ హజ్‌కు వారి కుటుంబాలతో కలిసి వెళ్లారని అందులో తెలిపారు. ఈ కథనంలో, TOI సానియా సోదరి అనమ్, తండ్రి ఇమ్రాన్‌తో కలిసి సానియా మీర్జా ఫోటోలను కూడా ప్రచురించింది.
పాపులర్ డిజిటల్ పబ్లిషర్ RVCJ మీడియా కూడా ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని తమ సోషల్ మీడియాలో పోస్టును పెట్టింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం. ఇక వైరల్ చిత్రం కల్పితం. భారత క్రికెటర్ మహమ్మద్ షమీ, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లి చేసుకోలేదు.
Claim : భారత క్రికెటర్ మహ్మద్ షమీని సానియా మీర్జా పెళ్లాడింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story