Mon Dec 23 2024 14:19:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్‌పై లైంగిక ఆరోపణలపై CIA విచారణ చేస్తోందని ఇన్ఫోగ్రాఫిక్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు
పుతియా తలైమురా అనే తమిళ మీడియా ఛానెల్ షేర్ చేసినట్లుగా ఇన్ఫోగ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
Claim :
లైంగిక ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో సిఐఎ తమిళనాడు సిఎం ఎం.కె.స్టాలిన్‌ను విచారిస్తున్నట్లు పుతియా తలైమురా సంస్థ పేర్కొందిFact :
సిఎం ఎం.కె.స్టాలిన్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించి సిఐఎ దర్యాప్తు చేస్తోందనే వార్తలు నకిలీవి
పుతియా తలైమురా అనే తమిళ మీడియా ఛానెల్ షేర్ చేసినట్లుగా ఇన్ఫోగ్రాఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఇన్ఫోగ్రాఫిక్ లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చిత్రం ఉంది.
స్టాలిన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) దర్యాప్తు చేస్తోందని ఆ పోస్టులో ఉంది. “1970 లలో వికీలీక్స్ లో వివిధ మహిళలతో లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు వచ్చాయి, అయితే దానిపై ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదు! ప్రస్తుతం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ కోణంలో దర్యాప్తు చేయాలని యోచిస్తోంది." అని పోస్టులో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ముఖ్యంగా, ఎంకే స్టాలిన్‌పై దాఖలైన లైంగిక దుష్ప్రవర్తన ఫిర్యాదుపై CIA దర్యాప్తు చేస్తోంది అనే ప్రచారంపై ఎలాంటి అధికారిక నివేదిక లేదు.
ఈ వార్తలను ఏ మీడియా సంస్థ లేదా అధికార ప్రతినిధి ధృవీకరించలేదు.
పుతియా తలైమురా మీడియా సంస్థకు సంబంధించిన ప్లాట్‌ఫారమ్‌లలో దేనిలోనూ మేము ఈ గ్రాఫిక్ కార్డ్‌ని కనుగొనలేకపోయాము. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా వెబ్సైట్లలో అలాంటి సమాచారం ఏదీ లేదు. వైరల్ ఇన్ఫోగ్రాఫిక్లో ఉపయోగించిన ఫాంట్ శైలి, పుతియా తలైమురా ప్రచురించే అధికారిక ఇన్ఫోగ్రాఫిక్స్‌లో ఉపయోగించిన శైలితో సరిపోలడం లేదని కూడా మేము గమనించాము.
దీంతో ఆ వైరల్ పోస్ట్ ఫేక్ అయి ఉండవచ్చని మేము భావిస్తున్నాం.
సదరు మీడియా సంస్థ కూడా ఆ ఇన్ఫోగ్రాఫిక్ను ప్రచురించలేదని స్పష్టం చేసింది. ఎంకే స్టాలిన్ గురించి సదరు మీడియా సంస్థ ఆపాదించినట్లుగా.. పుతియా తలైమురా అధికారిక ధృవీకరణలో ఎటువంటి నిజం లేదని మేము కనుగొన్నాము. ఇది ఫేక్ న్యూస్ అని చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Claim : Puthiya Thalaimura states CM M.K.Stalin is being investigated by CIA for a sexual misconduct complaint
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story