Tue Jan 07 2025 00:35:03 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కర్ణాటక రాష్ట్రంలో 'స్వావలంభి సారథి' పథకానికి సంబంధించి వైరల్ అవుతున్న పోస్టులు అవాస్తవం
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం వారికి సబ్సిడీలో వాహనాలను అందించే పథకాన్ని ప్రకటించిందని
Claim :
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం సబ్సిడీ ఉన్న పథకాన్ని ప్రకటించింది.Fact :
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ, SC, ST వర్గాలకు చెందిన నిరుద్యోగులకు కూడా వాణిజ్య వాహనాలపై సబ్సిడీని అందిస్తోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి కోసం వారికి సబ్సిడీలో వాహనాలను అందించే పథకాన్ని ప్రకటించిందని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు, లగేజీ ట్రాన్స్ పోర్టు వాహనాలు కొనుగోలు చేసేందుకు లబ్ధిదారులకు రూ.3 లక్షల సబ్సిడీని కాంగ్రెస్ అందజేస్తూ ఉందని వైరల్ పోస్ట్ ల ద్వారా చెబుతూ ఉన్నారు.
ఈ పోస్ట్‌లో స్కీమ్‌ను పొందేందుకు అవసరమైన అర్హతలు, పత్రాల గురించిన వివరాలను అందించే పోస్టర్ కూడా వైరల్ అవుతూ ఉంది. మైనారిటీల అభివృద్ధి కోసమే పథకం అని స్పష్టంగా పేర్కొంది.
పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య, మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ పథకం గురించి ట్వీట్ చేశారు. వైరల్ అవుతున్న వాదనలో "Buy a vehicle for Rs 6L, using 50% subsidy, sell it the next day for Rs 5L. Cool profit of Rs 2L. Only available for non-Hindus and does not include poor and deprived Hindu communities".
6 లక్షలకు వాహనాన్ని కొనుక్కోండి.. అది ఎలాగూ 50 శాతం సబ్సీడీలో దొరుకుతుంది. ఆ తర్వాత రోజు 5 లక్షలకు అమ్మేసుకోవచ్చు. సులభంగా 2 లక్షల రూపాయల లాభం. ఇది కేవలం హిందువేతరుల కోసమే.. హిందువులలో పేదలకు వర్తించదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది:
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము కర్ణాటక మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KMDCL) వెబ్సైట్ ను తనిఖీ చేసాము. స్వావలంబి సారథి పేరుతో పథకం వివరాలను గుర్తించాం. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
కర్ణాటక ప్రభుత్వం ప్రకారం, మైనారిటీలలో ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ జైన్, సిక్కు, పార్సీ మత వర్గాలు ఉన్నాయి.
KMDCL నోటిఫికేషన్ ప్రకారం, పథకం జాతీయ, షెడ్యూల్డ్ బ్యాంకుల సహకారంతో అమలు చేస్తున్నారు. ప్యాసింజర్ ఆటోరిక్షా, గూడ్స్ వెహికల్, ట్యాక్సీ కోసం బ్యాంకులు రుణాలు మంజూరు చేసిన లబ్ధిదారులకు వాహనం విలువలో 50 శాతం రాయితీ లేదా గరిష్టంగా రూ.3 లక్షల సబ్సిడీని అందజేస్తారు.
ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు వంటి మైనారిటీ కమ్యూనిటీలు మాత్రమే ఈ పథకాన్ని పొందవచ్చని KMDCL నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది.
Tv9Kannada.com స్వావలంబి సారథి గురించి వార్తలను కవర్ చేసింది. SC, ST వర్గాలకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Indiaherald.com కర్ణాటక రాష్ట్ర బడ్జెట్‌పై ఒక నివేదికను అందించింది. SC, ST కమ్యూనిటీ కోసం కూడా స్వావలంబి సారథి పథకాన్ని తీసుకుని వచ్చారని తెలిపింది.
cnbctv18.com కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్వావలంబి సారథి కింద కేవలం ముస్లింలకు మాత్రమే సబ్సీడీ ఇవ్వడం లేదు. ఇతర మైనారిటీలకు, ఎస్సీ- ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు వాణిజ్య వాహనాలపై సబ్సిడీని అందిస్తోంది.
Claim : Congress-led Karnataka government has announced a subsidy scheme for the uplift of Muslims exclusively
Claimed By : X users
Claim Reviewed By : TeluguPost Network
Claim Source : X
Fact Check : False
Next Story