ఫ్యాక్ట్ చెక్: శ్రీకృష్ణుడి గుండె అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అదొక ఆర్ట్ వర్క్
అది రష్యా ఆర్టిస్ట్ సృష్టించిన ఆర్ట్ వర్క్

Claim :
వైరల్ ఫోటోలో ఉన్నది శ్రీకృష్ణుడి గుండెFact :
అది రష్యా ఆర్టిస్ట్ సృష్టించిన ఆర్ట్ వర్క్
భారతదేశంలోనే కాదు ఎన్నో ప్రపంచ దేశాలలో శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) ఎన్నో దేశాల్లో శ్రీకృష్ణుడికి ఆలయాలు నిర్మించి పెద్ద ఎత్తున పూజలు, భజనలు చేస్తుంటారు. మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖార్ఘర్ ప్రాంతంలో నూతన ఇస్కాన్ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ దేవాలయాన్ని ఇస్కాన్ కృషితో నిర్మించారు. ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగమైనందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇస్కాన్ కృషితో ఈ గొప్ప జ్ఞానభూమి మీద భక్తిప్రపత్తులతో శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ దివ్య ప్రతిష్ఠాపనలో తన వంతు పాత్ర పోషించి, ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానని మోదీ అన్నారు.
"శ్రీకృష్ణ భగవానుడి గుండె ఎప్పుడైనా చూశారా?
శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన శరీరం మొత్తం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ ఆయన గుండె మాత్రం జీవించి ఉన్న మనిషి లాగా కొట్టుకుంటూ ఉంది. శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ సురక్షితంగా ఉంది. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు!"
ఇదే తరహాలో పలు భాషల్లో ఈ పోస్టులు గతంలో కూడా వైరల్ అయ్యాయి. పూరీ లోని శ్రీకృష్ణుడి గుండె ఇదని చెబుతూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. అదొక ఆర్ట్ వర్క్.
వైరల్ ఫోటోను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఫోటోలో కనిపించే చెక్కతో చేసిన గుండె 2001లో రష్యన్ కళాకారుడి సృష్టి అని గుర్తించాం.
మార్చి 29, 2013న రష్యన్ అవుట్లెట్ బ్యూరో 24/7 లో 2013 పారిస్ ఆర్ట్ ఫెయిర్‌లో రష్యన్ సృష్టిని కథనంలో చూశాం. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది. "Обзор Buro 24/7: Русское искусство на Paris Art Fair" అనే టైటిల్ తో కథనాన్ని ప్రసారం చేశారు.
https://www.buro247.ru/
డిమిత్రి సైకలోవ్ సృష్టించిన ఆర్ట్ వర్క్ అంటూ ఆ కథనంలో చూశాం.
రష్యాకు చెందిన కళాకారుడు డిమిత్రి సైకలోవ్ కలపతో తయారు చేసిన గుండెను పారిస్‌లోని గ్యాలరీ రాబౌవాన్ మౌషన్ ప్రదర్శించినట్లు ఆ కథనంలో ఉంది. ప్యారిస్ ఆర్ట్ ఫెయిర్ లో ఈ కళాఖండం ఎంతో ఆకట్టుకుంది. రష్యన్ తీర్చిదిద్దిన ఈ బొమ్మలో కళ దాగుందని పలువురు ప్రశంసించారు. పారిస్ ఆర్ట్ ఫెయిర్‌లో దాదాపు 90 మంది రష్యన్ కళాకారులు తమ ఆర్ట్ ను ప్రదర్శించారు. డిమిత్రి సైకలోవ్ కలపతో తయారు చేసిన గుండె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
https://www.buro247.ru/images/
ఫ్రాన్స్ కు చెందిన ఆర్ట్ మ్యాగజైన్ 'ఆర్ట్స్ హెబ్డో మీడియాస్' కూడా వుడెన్ హార్ట్ కు చెందిన ఫోటోను ప్రచురించింది. దానిని సైకలోవ్ సృష్టించిన శిల్పంగా తెలిపింది. ఆ కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
https://www.artshebdomedias.
మేము దిమిత్రీ సైకలోవ్ అధికారిక వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేసి చూశాం. అందులో వుడ్ ఆర్ట్ కు సంబంధించిన కేటగిరీలో గుండె బొమ్మను చూశాం.
శ్రీకృష్ణ భగవానుడి గుండె అంటూ గతంలో ఇదే తరహాలో ప్రచారం జరగగా దీనిని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండిస్తూ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో అత్యంత ప్రసిద్ధమైన పూరీ జగన్నాథ ఆలయం ఉంది. పూరీ జగన్నాథ రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుండి వస్తుంటారు. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. అయితే ఈ తరహా చెక్కతో చేసిన గుండె బొమ్మను ఎక్కడా కూడా ప్రదర్శించలేదని మేము గుర్తించాం.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.