ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తి ఈవీఎంల మీద ఇంకు చల్లుతున్న వీడియో ఇటీవలి ఎన్నికల పోలింగ్ కు సంబంధించినది కాదు
కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పారదర్శకతపై ప్రశ్నలు వేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల
Claim :
నాగ్‌పూర్ కు చెందిన వ్యక్తి ఈవీఎంపై ఇంక్ విసిరాడు, ఈవీఎం వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడుFact :
వైరల్ వీడియో లోని వ్యక్తి సునీల్ ఖంబే, బీఎస్పీ కార్యకర్త. 2019లో మహారాష్ట్రలోని థానే జిల్లాలో పోలింగ్ బూత్‌లో ఈవీఎంపై ఇంక్ విసిరారు.
ఎన్నికల సమయంలో ఓట్లను నమోదు చేయడానికి EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) ఉపయోగిస్తూ ఉన్నారు. ఓట్ల తారుమారు లేదా మానవ తప్పిదాలను తగ్గించేందుకు మాత్రమే కాకుండా.. వేగంగా, ఖచ్చితమైన ఓట్ల లెక్కింపును నిర్ధారించడం ఈవీఎంలను తీసుకుని రావడం వెనుక ఉన్న లక్ష్యం. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పారదర్శకతపై ప్రశ్నలు వేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల వినియోగం కావాలని పలువురు నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల వినియోగాన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల, పొడవాటి జుట్టుతో తెల్లటి చొక్కా ధరించిన వ్యక్తి పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మెషీన్లపై సిరా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంటనే అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇది 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనగా భావించి.. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులను పెడుతున్నారు.