Fri Nov 22 2024 19:43:15 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 'మీషో' ఎలాంటి క్విజ్ కాంటెస్ట్ ను నిర్వహించలేదు.. సర్ ప్రైజ్ గిఫ్ట్ లను ఇవ్వడం లేదు
క్విజ్‌లో పాల్గొనడం ద్వారా మీరు మీషో నుండి సర్ప్రైజ్ గిఫ్ట్‌ని గెలుచుకునే అవకాశం ఉందనే వాదనతో
Claim :
కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా.. మీరు మీషో ద్వారా బహుమతులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందిFact :
మీషో అలాంటి కాంటెస్ట్ ను నిర్వహించలేదు. నకిలీ url చెలామణిలో ఉంది. ఈ లింక్ లపై క్లిక్ చేయడం వలన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది
క్విజ్‌లో పాల్గొనడం ద్వారా మీరు మీషో నుండి సర్ప్రైజ్ గిఫ్ట్‌ని గెలుచుకునే అవకాశం ఉందనే వాదనతో కొన్ని లింక్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. తప్పుడు క్లెయిమ్‌తో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో లక్కీ డ్రా లింక్ ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ప్రశ్నలకు సమాధానం చెబితే మీరు ఊహించని బహుమతిని పొందే అవకాశం ఉంటుందంటూ అందులో ఉంది.
అందులోని ప్రశ్నలు ఎంతో సులువుగా కూడా ఉంటాయి.
మీకు మీషో గురించి తెలుసా? తెలిస్తే అవును/ లేదు అనే ఆప్షన్స్ ను నొక్కండి. అని ఉంటుంది. ఏది క్లిక్ చేసినా.. తర్వాతి పేజీకి వెళుతుంది.
చివరి ప్రశ్న సమయంలో కొన్ని బహుమతులకు సంబంధించిన పెట్టెలు డిజిటల్ గా కనిపిస్తాయి. మీరు వాటిలో దేనినైనా క్లిక్ చేయాలి. మీరు బాక్స్‌ను ఎంచుకున్న తర్వాత ఓ బహుమతి కనిపిస్తుంది. అది స్మార్ట్ ఫోన్ లేదా మరేదైనా కావచ్చు. మీరు బహుమతిని గెలిచేసుకున్నారని.. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే.. ఈ ఈ ప్రమోషన్ గురించి మీరు తప్పనిసరిగా 5 గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు చెప్పాలి.
మీరు మీ వివరాలను అందులో నమోదు చేసుకుంటే 5-7 రోజుల్లో మీ గిఫ్ట్ మీకు అందుతుందని ఆఖరిలో చెబుతారు.
ఈ కాంటెస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము మీషో అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్‌ని తనిఖీ చేసాము. కానీ ఈ ప్రమోషన్‌కు సంబంధించి మాకు ఎలాంటి నోటిఫికేషన్లు కనిపించలేదు.
మేము మొదట్లో మీషో అధికారిక వెబ్సైట్లో “online questionnaire” అని కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అయితే అటువంటి అధికారిక ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్ మీషో అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కనుగొనలేకపోయాం.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ URL లింక్‌లు మీషో అధికారిక వెబ్సైట్ meesho.comతో ప్రారంభం అవ్వవు. బదులుగా, వైరల్ లింక్ r.palacecrouch.topతో ప్రారంభమవుతాయి. దీన్ని బట్టే మీరు అధికారిక లింక్ కాకుండా మరేదో లింక్ ను ఓపెన్ చేశారని అర్థం అవుతుంది.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించిన తర్వాత.. మేము fashionnetwork.comలో అదే గ్రాఫిక్‌లను కలిగి ఉన్న పోస్ట్‌ను కనుగొన్నాము. కానీ గ్రాఫిక్ కంటెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. “80% వరకు తగ్గింపు” అని కనిపించింది.
దీనిపై వివరణ కోసం మా ఫ్యాక్ట్ చెక్ టీమ్.. మీషో సపోర్ట్ టీమ్ ను సంప్రదించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఉత్తమ భద్రతా పద్ధతులను అవలంబిస్తామని మీషో సంస్థ తెలియజేసింది. “ఈ స్కామ్‌లకు మీషోతో ఏ విధంగానూ సంబంధం లేదు. దయచేసి బ్యాంక్ ఖాతా వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దు.. అటువంటి వ్యక్తులు/ఖాతాలకు పేమెంట్లు చేయవద్దు. మీరు మోసానికి గురైనట్లైతే స్థానిక అధికారులకు నివేదించండి. ఈ సమస్యను మాకు తెలియజేసినందుకు మేము మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, ఇలాంటి మోసాల నుండి చాలా మందిని కాపాడుతుంది” అని మాకు వివరణ ఇచ్చింది.
అందువల్ల, మీషో క్విజ్ కాంటెస్ట్ అంటూ సర్క్యులేట్ చేస్తున్న లింక్ నకిలీదని మేము కనుగొన్నాము. మీషో ఎలాంటి ఆన్లైన్ క్విజ్ ను నిర్వహించలేదు.
Claim : By answering questionnaires, you will have a chance to get a surprise gift from Meesho
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story