Sun Dec 22 2024 19:25:42 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అంబటి రాంబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారు.
ఒరిజినల్ వీడియోలో 49:30 నుండి 50:26 మధ్య ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
Claim :
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసిన మోసగాడు అని విమర్శించారు.Fact :
వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. 2024 మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. 14 ఏళ్లుగా మాట నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిన మోసగాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అంటూ విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు వ్యూహాలు రచిస్తూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బహిరంగ సభలో విమర్శించినట్లుగా అనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ‘జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేసిన మోసగాడు’ అని మంత్రి అంబటి వ్యాఖ్యలు చేసినట్లు మేము గుర్తించాం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
2011 మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు సభ్యుడిగా మారారు. ఆ తర్వాత పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. అంబటి రాంబాబు 2022లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల సౌకర్యాలు, నీటి సరఫరా, వ్యవసాయోత్పత్తిని మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలు, ప్రాజెక్టులలో అంబటి రాంబాబు పాలుపంచుకున్నారు. ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిని బహిరంగ సభలో విమర్శించి ఉండి ఉంటే అది తప్పకుండా తెలుగు మీడియా సంస్థలు నివేదించి ఉండేవి. అయితే అలాంటిదేమీ జరగలేదని మేము వెతికాం.
మేము వీడియో స్క్రీన్షాట్లకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. అదే దృశ్యాలతో కూడిన పూర్తి నిడివి ఉన్న వీడియోను మార్చి 10, 2024న సాక్షి టీవీ లైవ్ ద్వారా యూట్యూబ్ ఛానెల్లో కనుగొన్నాము. వీడియో టైటిల్లో “AP CM YS Jagan Public Meeting at Medarametla | Siddham Sabha | Bapatla District." అని ఉంది.
ఒరిజినల్ వీడియోలో 49:30 నుండి 50:26 మధ్య ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బహిరంగ సభలో మాట్లాడుతూ "జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి రావాలనుకుంటున్నారా? లేదా? 14 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు." అని అన్నారు. అంబటి రాంబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని మోసగాడు అని విమర్శించడాన్ని సూచిస్తుంది. అందుకే అంబటి రాంబాబు ప్రసంగం ఎడిట్ చేశారని మేము గుర్తించాం.
సాక్షి పబ్లికేషన్లోని ఫుటేజీనే కలిగి ఉన్న ap7am.com ద్వారా అప్లోడ్ చేసిన మరొక వీడియోను కూడా మేము చూశాము. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడుపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మనం వినవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. జలవనరుల శాఖ మంత్రి వ్యాఖ్యలు టీడీపీ నేత చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేసినవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
Claim : Andhra Pradesh Irrigation Minister Ambati Rambabu criticises Chief Minister Y.S. Jaganmohan Reddy as a fraud who cheated people, while speaking at a public meeting
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook User
Fact Check : False
Next Story