Sun Dec 22 2024 22:25:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ ఎంఐఎం కు మద్దతుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆడియోను ఎడిట్ చేశారు.
బీజేపీ నేత, ప్రధాని నరేంద్ర మోదీ ఏఐఎంఐఎం కు మద్దతిస్తున్నారనే వాదనతో
Claim :
హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏఐఎంఐఎం పార్టీకి మద్దతు ప్రకటించారుFact :
ఒరిజినల్ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బీజేపీకి ఓటు వేయమని కోరారు
బీజేపీ నేత, ప్రధాని నరేంద్ర మోదీ ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్)కు మద్దతిస్తున్నారనే వాదనతో 26 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తెలంగాణ కాంగ్రెస్ నక్కో.. బీఆర్ఎస్.. నక్కో, బీజేపీ.. నక్కో, ఎంఐఎం కో ఇచ్ వోట్ దేంగే అంటోంది’ అని మోదీ చెప్పడం ఆ వీడియోలో ఉంది. చివరిలో “MIM కో హి జితాయేంగే బహుత్ బహుత్ ధన్యాబాద్” అంటూ చెప్పడం మనం వినొచ్చు. కాబట్టి, ప్రధాని నరేంద్ర మోదీ ఎంఐఎంకు మద్దతు తెలిపారు.. ఎంఐఎంకే ఓటు వేసి గెలిపించాలని అంటున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.
మోదీ ఏఐఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు. ఏ పార్టీకి వేయకండి.. ఎంఐఎంకి మాత్రమే ఓటు వేయండని చెబుతున్నారని ఆ వీడియోలను పోస్టు చేస్తున్న వ్యక్తులు తెలిపారు.
వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వీడియోను షేర్ చేస్తూ “మోడీ హైదరాబాద్లో AIMIMకి మద్దతు ఇచ్చారు" అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒరిజినల్ వీడియోలో బీజేపీకి మద్దతుగా నరేంద్ర మోదీ మాట్లాడారు.
మేము హైదరాబాద్లో ప్రధాని మోదీ బహిరంగ సభ గురించి తెలుసుకోడానికి సెర్చ్ చేయగా.. మాకు నరేంద్ర మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం వీడియో కనిపించింది.
మేము క్లిప్ ఒరిజినల్ వెర్షన్ ను 3.26 టైమ్ స్టాంప్ వద్ద కనుగొన్నాము. మోదీ తన ప్రసంగంలో “కాంగ్రెస్ నక్కో, బీఆర్ఎస్ నక్కో, ఎంఐఎం నక్కో, బీజేపీ కో ఇచ్ ఓట్ దేంగే” అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్ కు కాదు.. బీఆర్ఎస్ కు కాదు.. ఎంఐఎంకు కాదు.. కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేస్తారని మోదీ చెప్పారు.
మా పరిశోధన సమయంలో.. మేము www.narendramodi.inలో అప్లోడ్ చేసిన మొత్తం ప్రసంగాన్ని టెక్స్ట్ ఫార్మాట్లో కనుగొన్నాము.
మే 10, 2024న స్టేట్స్ మెన్ మీడియా సంస్థ అందుకు సంబంధించిన కథనాన్ని ప్రచురించినట్లు కూడా మేము కనుగొన్నాము, “కాంగ్రెస్ అభివృద్ధికి వ్యతిరేకమని తెలంగాణలో PM నరేంద్ర మోదీ చెప్పారు” అనే ఒక కథనాన్ని ప్రచురించింది.
తప్పుడు సమాచారం వ్యాపించేలా వీడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అసలు వీడియోలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి ఓటు వేయమని ప్రజలను కోరారు.
Claim : హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏఐఎంఐఎం పార్టీకి మద్దతు ప్రకటించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story