Mon Mar 31 2025 05:08:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 60 కిలోమీటర్ల వరకు టోల్గేట్ రుసుము చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు
నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే

Claim :
60 కిలోమీటర్ల వరకు టోల్ గేట్ రుసుము చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపిందిFact :
నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే విధంగా వైరల్ వీడియోను ఎడిట్ చేశారు
మొత్తం 26,425 కి.మీ.ల పొడవైన భారత్‌మాల ప్రాజెక్టులను మంజూరు చేయగా వీటిలో 19,826 కి.మీ.ల రోడ్డు ఇప్పటికే నిర్మించామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. భారత్‌మాల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2017లో ఆమోదించింది. భారత్‌మాల పరియోజన దేశంలో లాజిస్టిక్స్ సామర్థ్యం, కనెక్టివిటీని మెరుగుపరచడానికి, గిరిజన, వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించారు. ఈ రహదారులపై ప్రమాదాలను తగ్గించడానికి, సురక్షితమైన రవాణా నెట్‌వర్క్‌లను నిర్ధారించడానికి చేపట్టారు.
హై-స్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల కీలక ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. వివిధ పారిశ్రామిక కేంద్రాలు, NMP నోడ్లు, MMLPలు, ఓడరేవులు, విమానాశ్రయాలకు ఈ కారిడార్ల ద్వారా హై-స్పీడ్ కనెక్టివిటీ అందడం జరుగుతుంది.
ఫిబ్రవరి 2025 నాటికి, 6,669 కి.మీ పొడవు గల హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లను మంజూరు చేశారు. 4,610 కి.మీ.ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని కేంద్రం తెలిపింది.
ఇంతలో నితిన్ గడ్కరీ పార్లమెంట్ లో మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 60 కిలోమీటర్ల వరకు టోల్గేట్ రుసుము చెల్లించొద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటూ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారు.
"60 కిలోమీటర్ల వరకు టోల్గేట్ రుసుము చెల్లించొద్దు - కేంద్ర ప్రభుత్వ ఆదేశం..!!
మీ ఇంటి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ టోల్ గేట్ వద్ద టోల్ గేట్ రుసుము చెల్లించ వద్దు.
మీ ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు ఫ్రీగా టోల్ ప్లాజా దాటోచ్చు.
ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం.. అందరూ తప్పకుండా షేర్ చేయండి." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ లో ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
మేము ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏదైనా చేసిందా అని సంబంధిత వివరాల కోసం వెతికాం. అయితే మాకు అలాంటి ఎలాంటి ప్రకటన కూడా లభించలేదు. ఒకవేళ కేంద్రం నుండి ఇలాంటి ప్రకటన వచ్చి ఉంటే అది తప్పకుండా హెడ్ లైన్స్ లో భాగమై ఉండేది. మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించి ఉండేవి.
ఇక ఇలాంటి వాదనతో గతంలో పలు భాషల్లో పోస్టులు వైరల్ అయ్యాయని మేము గుర్తించాం.
వైరల్ వీడియో పార్లమెంట్ లో జరిగిన సంభాషణ అని తెలుస్తోంది. దీంతో మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. మార్చి 22, 2022న నితిన్ గడ్కరీ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వైరల్ ఫుటేజ్ కు సంబంధించిన పొడవైన వెర్షన్‌ను మేము గమనించాం.
ఈ క్లిప్‌లోని 25 నిమిషాల 14 సెకన్లలో, టోల్ ప్లాజాల చుట్టూ నివసించేవారికి వారి ఆధార్ కార్డుల ఆధారంగా పాస్‌లు జారీ చేయడం గురించి ఎంపీల నుండి సూచన వచ్చిందని నితిన్ గడ్కరీ తెలిపారు.
అయితే ఒకదానికొకటి 60 కిలోమీటర్ల పరిధిలో రెండు టోల్ ప్లాజాలు ఉండకూడదని ఆయన ఉన్నారు. చాలా ప్రాంతాలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందని అన్నారు. 60 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక టోల్ ప్లాజా మాత్రమే ఉంటుందని, రెండవ ప్లాజా మూసివేస్తామని కూడా గడ్కరీ చెప్పారు.
ఈ రెండు ప్రకటనలు వేర్వేరు అని అర్థం అవుతూ ఉంది. వైరల్ పోస్టులను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు టోల్ ప్లాజా నుండి 60 కిలోమీటర్ల పరిధిలో ఉంటే, వారు టోల్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పలేదు.
ఇక రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, టోల్ ప్లాజా నుండి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారు అవసరమైన పత్రాలను చూపించిన తర్వాత టోల్ పన్ను మినహాయింపుకు అర్హులు.
https://morth.nic.in/sites/
గతంలో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
టోల్ ప్లాజా నుండి 60 కిలోమీటర్ల పరిధిలో నివసించే వ్యక్తులు టోల్ పన్ను చెల్లించకుండా మినహాయింపులు లభిస్తాయంటూ, పలువురు సోషల్ మీడియా వినియోగదారులు . ఇది ఎంపీల విభిన్నచేసిన వాదనలో ఎలాంటి నిజం లేదు. కేవలం అలాంటి ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయని నితిన్ గడ్కరీ చెప్పారు.
Claim : నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే విధంగా చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Unknown
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story