Fri Nov 15 2024 04:36:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీజేపీ అధికారంలోకి రాగానే ఒడిశాలో పాల ప్యాకెట్ల రంగును కాషాయంలోకి మార్చలేదు.
ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టగానే ఓంఫెడ్
Claim :
ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టగానే ఓంఫెడ్(Omfed) పాల ప్యాకేజింగ్ కాషాయ రంగులోకి మార్చారనే ఆరోపణలు వచ్చాయి.Fact :
Omfed సంస్థ తమ ప్యాకేజీ కలర్ ను మార్చలేదు. కొత్త, పరిమిత ఎడిషన్ ని ప్రవేశపెట్టారు.
ఒడిశా ప్రజల కోసం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేసింది. పాఠశాల విద్య, ఆరోగ్య సేవలు, రూ. 5/- మధ్యాహ్న భోజనం (ఆహార్ యోజన), ఆరోగ్య కార్డ్ పథకం లాంటివి తీసుకుని వచ్చింది. సామాన్య ప్రజలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించడం, పలు సౌకర్యాలు కల్పించేందుకు గత ప్రభుత్వం కృషి చేసింది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ, బీజేపీ (భారతీయ జనతా పార్టీ), ఈ పథకాలపై తరచుగా విమర్శలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలలో BJD (బిజు జనతా దళ్)కి ప్రాతినిధ్యం వహించే ఆకుపచ్చ రంగులను ఉపయోగిస్తోందని విమర్శించింది.
ఒడిశాలో ప్రభుత్వ మార్పు తరువాత.. LACCMI (లొకేషన్ యాక్సెసిబుల్ మల్టీ-మోడల్ ఇనిషియేటివ్) బస్సుల రంగు ఆకుపచ్చ నుండి కాషాయ రంగులోకి మార్చారని మీడియాలో కథనాలు వచ్చాయి.
OTV ఛానల్లో “ఒడిశా లోని దెంకనల్ జిల్లాలోని లక్మీ బస్సు సర్వీసుల పేరును 'ముఖ్యమంత్రి బస్ సేవ'గా మార్చారు. వాటి రంగు కాషాయం, తెలుపుగా మార్చారు. రవాణా మంత్రి బిభూతి భూషణ్ జెనా రీబ్రాండింగ్ను ప్రకటించారు, అయితే రంగు మార్పును ఎవరు ఆదేశించారనే దానిపై స్పష్టత లేదు." అని కథనాలు వచ్చాయి.
భారతదేశంలో అమూల్ లాగానే, Omfed (ఒడిశా స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) 1980 నుండి ఒడిశాలో పాలు, పాల ఉత్పత్తుల రంగంలో అత్యంత సుపరిచితమైన బ్రాండ్. విజయ్ కులంగే ఓంఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరిన తర్వాత, కంపెనీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. వివిధ రంగాలలో విజయాలను అందుకుంది. పలు సందర్భాల్లో ప్యాకేజింగ్ విషయంలో Omfed మరింత దృష్టిని ఆకర్షించింది. ఒడిశా సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేసింది.

ఈ బ్యాక్ డ్రాప్ లో ఒడియా టెక్స్ట్ తో "ଓମ୍ଫେଡ଼ କ୍ଷୀର ପ୍ୟାକେଡ ରଙ୍ଗ ବି ବଦଳେଇ ଦେଲେ" అంటూ రెండు పాల ప్యాకెట్లను షేర్ చేస్తున్నారు. "వారు ఓంఫెడ్ పాల ప్యాకేజింగ్ రంగును కూడా మార్చారు" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఓంఫెడ్ తన పాల ప్యాకేజింగ్ రంగును మార్చిందన్న వాదన తప్పు. వైరల్ చిత్రం నిజానికి కొత్త ఉత్పత్తికి సంబంధించినది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులు వాటి అసలు రంగులతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
Omfed వారి అధికారిక X ఖాతాలో పాలకు సంబంధించిన ప్రచారాన్ని షేర్ చేసింది. ఇందులోని ప్రచార పోస్టర్లో పాత ప్యాకేజింగ్ ఉంది.
మా సెర్చ్ ఆపరేషన్ లో.. ఓంఫెడ్ వైరల్ పోస్ట్‌కి ప్రత్యుత్తరం ఇవ్వడాన్ని కూడా మేము కనుగొన్నాము, “ఇది కొన్ని కొత్త పదార్థాలతో కూడిన కొత్త ఉత్పత్తి, దీన్ని త్వరలో ప్రారంభించనున్నారు. మునుపటి ఉత్పత్తులు (ఇప్పటికే ఉన్న రంగులతో) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. OMFED థీమ్ రంగు (నీలం, గులాబీ రంగు) మార్చే అవకాశం లేదు” అంటూ ఇచ్చిన వివరణను మేము గుర్తించాం.
ప్యాకేజింగ్‌ను గమనిస్తే, అది అమ్మకానికి కాదు అని ఉండడం గమనించవచ్చు. ఎక్స్పైరీ డేట్ & తయారీ తేదీ కూడా చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము. Omfed సంస్థ పాల ప్యాకేజింగ్ రంగును మార్చలేదు.
Claim : ఒడిశాలో బీజేపీ అధికారం చేపట్టగానే ఓంఫెడ్(Omfed) పాల ప్యాకేజింగ్ కాషాయ రంగులోకి మార్చారనే ఆరోపణలు వచ్చాయి.
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story