Mon Mar 31 2025 09:31:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడు చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహించడం లేదు
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

Claim :
ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజున చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారుFact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 21న తన కుటుంబంతో కలిసి తిరుమలను సందర్శించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పూజారులతో కలిసి మహాద్వారం వద్ద కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.
తిరుమల ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత, వేద పూజారులు రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. పూజారులు ఆయనకు 'తీర్థ ప్రసాదం' అందజేశారు. దేవాన్ష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబం వెంగమాంబ అన్నదాన కేంద్రాన్ని సందర్శించింది, అక్కడ వారు తిరుమలలో ఒక రోజు భోజన ఖర్చును విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి వ్యక్తిగతంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
ఇక నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును ఏప్రిల్ 20న కావడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటి పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజున చంద్రన్న నాటకోత్సవాలను నిర్వహించబోతున్నట్లుగా వే2 న్యూస్ కు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"సీఎం పుట్టినరోజున 'చంద్రన్న నాటకోత్సవాలు' AP: వచ్చే నెల 20న సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని వారం పాటు 'చంద్రన్న నాటకోత్సవాలు' నిర్వహించనున్నట్లు ఏపీ నాటక అకాడమీ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 20-26 వరకు జరిగే వేడుకల్లో నాటికలు, పౌరాణిక/సాంఘిక నాటకాలు, పద్య నాటకాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది. ఆసక్తిగలవారు వివరాలు, సాధించిన విజయాలు, ప్రదర్శించే నాటక వివరాలను వెల్లడిస్తూ నాటక అకాడమీ చిరునామాకు పంపాలని కోరింది." అంటూ అందులో ఉంది.
వైరల్ అవుతున్న పోస్టును ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఈ పోస్టును రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ వైరల్ పోస్టును ఖండిస్తూ ఓ పోస్టు పెట్టింది.
"ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చేస్తున్నది పూర్తిగా అవాస్తవ ప్రచారం. ఇది ఫేక్ న్యూస్. ఏపీ నాటక అకాడమీ కానీ, ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. ఇటువంటి అవాస్తవాలు ఎవరు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh" అంటూ వివరణ ఇచ్చింది.
అదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ సంస్థ తెలిపింది.
సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు వైరల్ పోస్టులను ప్రభుత్వం ఖండించిందంటూ వివరణ ఇచ్చాయి.
"చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 'చంద్రన్న నాటకోత్సవాలు'.. తీరా ఆరా తీస్తే ట్విస్ట్" అంటూ సమయం మీడియా సంస్థ కథనం మాకు లభించింది.
కాబట్టి, ఏప్రిల్ 20న సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా చంద్రన్న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చేస్తున్నది పూర్తిగా అవాస్తవం.
Claim : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claimed By : Social Media Channels
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story