Mon Dec 23 2024 01:11:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నూనెలో ఉమ్మివేసి పాప్ కార్న్ ను అమ్ముతున్నాడనే ఆరోపణలతో పాప్ కార్న్ విక్రేతను పోలీసులు అరెస్టు చేశారు
పాప్‌కార్న్ విక్రేత తన మూత్రాన్ని ఉపయోగించి ఉప్పు రుచిని జోడించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు
Claim :
పాప్‌కార్న్ విక్రేత తన మూత్రాన్ని ఉపయోగించి ఉప్పు రుచిని జోడించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడుFact :
పాప్‌కార్న్‌ను తయారు చేయడానికి ఉపయోగించే నూనెలో ఉమ్మివేసినట్లు ఆరోపణల ఆధారంగా పాప్‌కార్న్ విక్రేతను అరెస్టు చేశారు.
టీవీ9 లోగో ఉన్న 45 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఊదారంగు చొక్కా ధరించిన ఓ వ్యక్తి కన్నడలో మాట్లాడుతున్నాడు. పోలీసులు పసుపు ద్రవం ఉన్న బాటిల్ ను కూడా వాహనంలో పెట్టడం కనిపిస్తారు. ఆ తర్వాత పోలీసు వ్యాన్‌లో ఆ వ్యక్తిని కూర్చోబెట్టారు.
వినియోగదారులు దీనిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసారు. “ఒక ముస్లిం విక్రేత పాప్ కార్న్ కు ఉప్పు రుచి వచ్చేలా చేయడానికి తన మూత్రాన్ని ఉపయోగించి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రజలు అతని మూత్ర విసర్జనతో చేసిన పాప్‌కార్న్‌ను సంవత్సరాలుగా తింటున్నారు." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలుస్తోంది. మా రీసెర్చ్ లో టీవీ9 కన్నడ యూట్యూబ్ ఛానల్ లో వీడియోను అప్లోడ్ చేసినట్లు గమనించాం. "Lalbagh: ಪಾಪ್ಕಾರ್ನ್ ಮಾರಾಟಗಾರರ ವಿರುದ್ಧ ಸ್ಥಳೀಯರ ಆರೋಪ." అనే టైటిల్ తో ఈ వీడియోను యూపీలో చేశారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లోని లాల్ భాగ్ లో చోటు చేసుకుందని తెలుస్తోంది.
బెంగుళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఈ సంఘటన జరిగిందని సూచించే టెక్స్ట్ వీడియోలో ఉంది. పాప్‌కార్న్‌ను తయారు చేసే ముందు పాప్‌కార్న్ విక్రేత ఆయిల్ బాటిల్లో ఉమ్మివేస్తున్నాడని ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు ఆరోపించారు.
“పాప్‌కార్న్ విక్రేత ఆయిల్ బాటిల్లో ఉమ్మివేస్తున్నాడు” అనే కీవర్డ్‌తో మేము సెర్చ్ చేసినప్పుడు. జూన్ 22, 2022న, న్యూస్ మినిట్ యూట్యూబ్ ఛానెల్లో “Muslim popcorn seller attacked in Bengaluru speaks” అనే శీర్షికతో కథనాన్ని అప్లోడ్ చేసింది.
వీడియో వివరణలో “లాల్బాగ్ బొటానికల్ గార్డెన్‌లోని పాప్‌కార్న్ విక్రేతను జూన్ 11న బెంగళూరులో పాప్‌కార్న్ తయారు చేయడానికి ఉపయోగించిన నూనెలో ఉమ్మి వేసినందుకు అరెస్టు చేశారు. బెయిల్‌పై నవాజ్ పాషా బయటకు వచ్చాడు." అని ఉంది.
మేము జూన్ 13, 2022న “పాప్‌కార్న్ విక్రేతను అరెస్ట్ చేశారు, విడుదల అయ్యాడే” అనే శీర్షికతో ది హిందూ ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము.
ఆ కథనంలో, “శనివారం లాల్బాగ్ గ్లాస్ హౌస్ దగ్గర కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది, ఆయిల్ పాన్‌లో ఉమ్మివేసినట్లు 21 ఏళ్ల పాప్‌కార్న్ విక్రేతపై ఒక సమూహం నిరసన వ్యక్తం చేసింది. నిందితుడు పాన్‌లో నూనె పోసేందుకు పళ్లతో ఆయిల్ ప్యాకెట్‌ను చింపివేస్తున్నాడని, ఆహారంలో ఉమ్మి వేయలేదని విచారణలో తేలింది. అయితే కొందరు అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు." అంటూ ఉంది.
జూన్ 14, 2022 నాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ”“Bengaluru: Popcorn vendor 'spits' into cooking oil, lands in soup." అనే శీర్షికతోనూ.. ది న్యూస్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ “Popcorn vendor caught spitting in oil” అంటూ కథనాలను ప్రచురించారు. "పాప్‌కార్న్ విక్రేత నూనెలో ఉమ్మివేస్తూ పట్టుబడ్డాడు" అంటూ ఈ కథనాల్లో తెలిపారు.
అయితే ఎక్కడా కూడా పాప్‌కార్న్‌పై మూత్రాన్ని ఉపయోగించినట్లు తెలిపే కథనాలు మాకు దొరకలేదు.
అందువల్ల, మా పరిశోధన, వివిధ మీడియాలో ప్రచురించిన కథనాల ఆధారంగా.. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము కనుగొన్నాము. పాప్‌కార్న్ విక్రేత తన మూత్రాన్ని పాప్ కార్న్ లో ఉప్పు రుచిని జోడించడానికి ఉపయోగించలేదు. అతను పాప్‌కార్న్ చేయడానికి ఉపయోగించే నూనెలో ఉమ్మివేసాడని ఆరోపణలు రావడంతో కర్ణాటక పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Claim : పాప్‌కార్న్ విక్రేత తన మూత్రాన్ని ఉపయోగించి ఉప్పు రుచిని జోడించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story