Mon Dec 23 2024 18:44:31 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను విడుదల చేయలేదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రంతో
Claim :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రంతో నోట్లను విడుదల చేసిందిFact :
దొంగ నోట్ల ముఠాను పట్టుకున్నప్పుడు నకిలీ నోట్లను అధికారులు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ స్థానంలో అనుపమ్ ఖేర్ ఫోటోతో నోట్లను ముద్రించలేదు.
దేశం గర్వించదగ్గ నటుల్లో అనుపమ్ ఖేర్ కూడా ఒకరు. ఆయన భాషలతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. 69 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఆదివారం నాడు కూడా నటించే అవకాశాన్ని వదులుకోవడం లేదు. అనుపమ్ ఖేర్ ఆదివారం కూడా తాను షూట్‌కి సిద్ధమవుతున్నానని అభిమానులతో పంచుకున్నారు. సెప్టెంబర్ 29, 2024న ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఆదివారం నాడు పని చేయడంపై తన అభిప్రాయాలను తెలిపారు. లైవ్ సెషన్లో "మీ అందరికీ ఆదివారం సెలవు అయితే, ఆదివారం నాడు నేను పని చేస్తున్నాను. కాబట్టి నేను పని చేస్తున్నప్పుడు, నన్ను అనుమతించండి. భగవంతుడు నీకు పని ఇచ్చినప్పుడు ప్రతిరోజు చేయమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. నా వృత్తిలో మేము ఏ రోజునైనా పని చేయవచ్చు. ఏ వృత్తిలోనైనా పని ఉన్నప్పుడు ఆ పనిని పూర్తీ చేయాలన్నదే నా ఉద్దేశ్యం." అని చెప్పుకొచ్చారు. అనుపమ్ ఖేర్ తన కొత్త చిత్రం 'ది సిగ్నేచర్' గురించి కూడా అభిమానులతో మాట్లాడారు.
ఇక లైలా మజ్ను, రాక్‌స్టార్, రెహనా హై తెరే దిల్ మే, వీర్-జారా, తుంబాద్ వంటి చిత్రాల రీ-రిలీజ్ తర్వాత, 2006లో దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన హాస్య చిత్రం ఖోస్లా కా ఘోస్లా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది. ఖోస్లా కా ఘోస్లా సినిమాలో అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, పర్విన్ దబాస్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, తారా శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక అనుపమ్ ఖేర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఆయన ఫోటోను 500 రూపాయల నోట్లపై ముద్రించారు అంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇక లైలా మజ్ను, రాక్‌స్టార్, రెహనా హై తెరే దిల్ మే, వీర్-జారా, తుంబాద్ వంటి చిత్రాల రీ-రిలీజ్ తర్వాత, 2006లో దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించిన హాస్య చిత్రం ఖోస్లా కా ఘోస్లా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది. ఖోస్లా కా ఘోస్లా సినిమాలో అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, పర్విన్ దబాస్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, తారా శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక అనుపమ్ ఖేర్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ఆయన ఫోటోను 500 రూపాయల నోట్లపై ముద్రించారు అంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి.
"బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేరు మీద నోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా గాంధీ స్థానంలో అనుపమ్ ఖేర్ ఫోటోతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను విడుదల చేసింది." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
అనుపమ్ ఖేర్ బొమ్మతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను ప్రవేశపెట్టిందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ లో సెర్చ్ చేశాం. అయితే ఈ నోట్లను ప్రింట్ చేసింది ప్రభుత్వం కాదని, ఫేక్ నోట్లను ముద్రించే గ్యాంగ్ అని గుర్తించాం.
"Fake currency notes with Anupam Kher's picture instead of Mahatma Gandhi worth Rs 1.60 crore siezed in Gujarat" అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని మేము కనుగొన్నాం.
అనుపమ్ ఖేర్‌కు మహాత్మా గాంధీ మధ్య ఉన్న పోలికలను కొందరు కేటుగాళ్లు ఉపయోగించుకున్నారని మీడియా సంస్థలు తెలిపాయి. కొన్ని నకిలీ నోట్లపై గాంధీ స్థానంలో అనుపమ్ ఖేర్ ముఖాన్ని పెట్టారు. గుజరాత్లో అనుపమ్ ఖేర్ చిత్రం ఉన్న రూ.1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఆపరేషన్‌లో సూరత్‌లో నకిలీ కరెన్సీ తయారీ యూనిట్‌ను ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి సెప్టెంబర్ 22 న నలుగురిని అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీస్ కమిషనర్ రాజ్‌దీప్ నుకుమ్ మాట్లాడారు. అనుపమ్ ఖేర్ ఫోటో ఉన్న ఈ నకిలీ నోట్లపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కి బదులుగా 'రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కూడా ఉందని తెలిపారు.
ఇక వైరల్ ఫోటోకు సంబంధించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. www.deccanherald.com లో ఇదే ఫోటోను ఉపయోగించి ఈ వార్తా కథనాన్ని ప్రచురించారు.
టీవీ9 గుజరాతీ నివేదిక ప్రకారం గుజరాత్లో మహాత్మా గాంధీకి బదులుగా అనుపమ్ ఖేర్ చిత్రం ఉన్న 1.60 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను అహ్మదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డెక్కన్ హెరాల్డ్ నివేదించింది.
టీవీ9 గుజరాత్ కు సంబంధించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాం. వైరల్ ఇమేజ్ తో సరిపోయేలా మార్క్ చేసిన నోట్లకు సంబంధించిన విజువల్స్ అందులో ఉన్నాయి.
వైరల్, అసలైన వార్తా కథనానికి సంబంధించిన పోలికలను కూడా మీరు చూడొచ్చు.
పలు మీడియా సంస్థలు కూడా ఫేక్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వాటిపై అనుపమ్ ఖేర్ చిత్రం ఉందని నివేదించాయి.
గాంధీ స్థానంలో అనుపమ్ ఖేర్ ఫోటో ఉన్నారనే వైరల్ వీడియోపై అనుపమ్ ఖేర్ కూడా స్పందించారు. "लो जी कर लो बात!
पाँच सौ के नोट पर गांधी जी की फ़ोटो की जगह मेरी फ़ोटो???? कुछ भी हो सकता है!" అంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని అనుపమ్ ఖేర్ వివరించారు.
మేము మరింత క్లారిటీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, సోషల్ మీడియా సైట్లను కూడా పరిశీలించాం. అందులో ఎక్కడా కూడా గాంధీ కాకుండా ఇతర వ్యక్తుల చిత్రాలతో నోట్లు విడుదల చేసినట్లు ఎలాంటి ప్రకటనలు లేవు.
https://rbi.org.in/Scripts/BS_
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రంతో నోట్లను విడుదల చేయలేదు.
Claim : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రంతో నోట్లను విడుదల చేసింది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story