Mon Dec 23 2024 02:55:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం ఎదురైందన్న మీడియా వాదనలో ఎలాంటి నిజం లేదు.
నటి సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం..
Claim :
నటి సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం.. ఆమె డ్రెస్ పై జ్యూస్ పడేసిన ఎయిర్ హోస్ట్రెస్Fact :
వైరల్ అయిన మీడియా కథనాల్లో ఎలాంటి నిజం లేదు. అది ఒక యాడ్ కు సంబంధించిన షూట్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది అంటూ కొద్దిరోజుల కిందట కొన్ని సోషల్ మీడియా పోస్టులు.. మీడియా కథనాలు వైరల్ అయ్యాయి.
సారా అలీ ఖాన్ కోపంగా చూస్తూ ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఎయిర్ హోస్ట్రెస్ తో ఆమె గొడవ పడింది అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుండగా ఆమె డ్రెస్ పై పొరపాటున జ్యూస్ పడిందని సోషల్ మీడియాలో తెలిపారు. కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా ఇదే వాదనతో వార్తలను ప్రచురించాయి.
సారా అలీ ఖాన్ డ్రెస్ మీద జ్యూస్ వేయడంతో కోపంగా లేచి వెళ్లిపోయిందంటూ వీడియోలను యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు.
సారా అలీ ఖాన్ కోపంగా చూస్తూ ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఎయిర్ హోస్ట్రెస్ తో ఆమె గొడవ పడింది అంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుండగా ఆమె డ్రెస్ పై పొరపాటున జ్యూస్ పడిందని సోషల్ మీడియాలో తెలిపారు. కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా ఇదే వాదనతో వార్తలను ప్రచురించాయి.
సారా అలీ ఖాన్ డ్రెస్ మీద జ్యూస్ వేయడంతో కోపంగా లేచి వెళ్లిపోయిందంటూ వీడియోలను యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇదంతా ఒక యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన షూటింగ్ అని తేలిపోయింది. సారా అలీ ఖాన్ 'shopsy' అనే యాడ్ కు సంబంధించిన షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ ను నిజంగానే జరిగిన ఘటనకు సంబంధించినవని భావించి పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
వైరల్ అయిన సారా అలీ ఖాన్ ఫోటోల కింద పలువురు నెటిజన్లు ఇది యాడ్ షూటింగ్ కు సంబంధించినది అయి ఉండొచ్చంటూ కామెంట్లు చేశారు. మేము 'సారా అలీ ఖాన్ న్యూ యాడ్' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. shopsy అనే ఆన్ లైన్ డ్రెస్ ప్లాట్ ఫామ్ పోస్టర్లలో సారా అలీ ఖాన్ వైరల్ ఫోటోలలోని డ్రెస్ నే వేసుకుని కనిపించిందని మేము గుర్తించాం.
Viral Photo
Ad Photo
ఇక మేము shopsy సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేయగా.. అందులో సారా అలీ ఖాన్ కు సంబంధించిన యాడ్ ను గుర్తించాం.
ఈ యాడ్ లో సారా అలీ ఖాన్ విమానంలో కూర్చొని ఉంటుంది. ఇంతలో లగేజ్ ను ఎయిర్ హోస్టెస్ సర్దుతూ ఉండగా.. ఒక వస్తువు జారి, సారా కూర్చున్న సీట్ పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ వెళ్లి సారా బట్టల మీద పడుతుంది. సారా అలీ ఖాన్ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుందని.. ఆమె బట్టలు పాడవ్వడంతో ఆ డబ్బులు తాము కట్టలేమని ఎయిర్ హోస్టెస్, పైలట్ కూడా చెప్పడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే సారా ఇవన్నీ బ్రాండెడ్ ఏమీ కాదని.. చాలా తక్కువ ధరకే shopsy యాప్ లో కొన్నానని చెబుతుంది.
దీన్ని బట్టి.. వైరల్ అయిన పోస్టులు యాడ్ షూటింగ్ కు సంబంధించినవని ఓ క్లారిటీ వస్తోంది.
ఇదే వీడియోను సారా కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిందని మేము గుర్తించాం.
కాబట్టి, సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం ఎదురైందన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.. ఆమె యాడ్ షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ ను తప్పుడు వాదనతో షేర్ చేశారు.
Claim : నటి సారా అలీ ఖాన్ కు విమానంలో చేదు అనుభవం.. ఆమె డ్రెస్ పై జ్యూస్ పడేసిన ఎయిర్ హోస్ట్రెస్
Claimed By : social media users, Media
Claim Reviewed By : Telugupost
Claim Source : social media, Media Channels
Fact Check : False
Next Story