Sun Dec 15 2024 12:44:36 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సోనియా గాంధీ-రాజీవ్ గాంధీకి సంబంధించిన ఫోటోను తప్పుడు వాదనతో వైరల్ చేస్తున్నారు
సోనియా-రాజీవ్ గాంధీ ముస్లిం సంప్రదాయంలో
Claim :
సోనియా-రాజీవ్ గాంధీ ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్నారుFact :
ఓ ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్ లో భాగంగా సోనియా-రాజీవ్ ఈ వేషధారణలో కనిపించారు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిసెంబర్ 9న తన 78వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియా గాంధీ ఆరోగ్య కారణాల వల్ల గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమె రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా కూడా బాధ్యతలు తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడి ప్రజలతో విడదీయరాని బంధం ఉందన్నారు. సోనియూ గాంధీ కేవలం రాజకీయ నాయకురాలు కాదు.. ఆమె ఎందరికో ఆశాకిరణం అని రేవంత్ రెడ్డి కొనియాడారు.
అయితే సోనియా గాంధీ-రాజీవ్ గాంధీ ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాజీవ్ ఖాన్ పక్కన సోనియా గాంధీ ఉందంటూ పోస్టులు పెట్టారు.
"నిజం ఎంత దాచినా అది బయటకు వస్తుంది. ఇది రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నిజమైన ఫోటో. ఈ నకిలీ గాంధీ కుటుంబం నిజానికి మహమ్మద్ ఘాజీ కుటుంబం. ఈ ఫోటోను 10 మందికి పంపండి, దేశానికి అవగాహన కల్పించి, భారత్‌ను పాకిస్తానగా మార్చకుండా కాపాడండి." అంటూ ఓ ఫోటోను వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు.
వైరల్ ఫొటోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో గతంలో కూడా వైరల్ అయిందని గుర్తించాం. 2020 సంవత్సరంలో కూడా ఇదే వాదనతో ఫోటోను వైరల్ చేశారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ముస్లింలు అంటూ ప్రచారం చేశారు. రాజీవ్ ఖాన్ వెడ్స్ సోనియా బేగం అంటూ గతంలో ప్రచారం చేసినా.. వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో గతంలో కూడా వైరల్ అయిందని గుర్తించాం. 2020 సంవత్సరంలో కూడా ఇదే వాదనతో ఫోటోను వైరల్ చేశారు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ముస్లింలు అంటూ ప్రచారం చేశారు. రాజీవ్ ఖాన్ వెడ్స్ సోనియా బేగం అంటూ గతంలో ప్రచారం చేసినా.. వాటిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ఇండియన్ కల్చర్ అధికారిక వెబ్సైట్లో ఇదే చిత్రాన్ని అప్లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. ఇది రాజీవ్ గాంధీ-సోనియా గాంధీ పెళ్లి తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ సందర్భంగా తీసినదని అందులో పేర్కొన్నారు. ఇండియన్ కల్చర్ వెబ్ సైట్ లో ఇదే వేషధారణలో రాజీవ్, సోనియా ఉన్న ఫోటో మాకు కనిపించింది. ఈ ఫొటోకు సంబంధించిన లింక్ మాకు లభించింది. ఈ ఫంక్షన్ కు హాజరైన పలువురు కూడా విచిత్రమైన గెటప్ లలో కనిపించారు.
మేము ఈ వెబ్ సైట్ లో ఉన్న చిత్రాన్ని వైరల్ చిత్రంతో పోల్చాము. అనేక సారూప్యతలను కనుగొన్నాము. అందులో ఉన్న వ్యక్తులే ఇతర ఫోటోలలో చూడొచ్చు.
రాజీవ్ , సోనియా గాంధీ ఒకే విధమైన దుస్తులు ధరించి చూడవచ్చు. వైరల్ ఇమేజ్‌లో ఉన్న వారందరినీ ఇండియా కల్చర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన చిత్రంలో కూడా చూడవచ్చు.
రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మేము చూశాం. వీరు ఎక్కడా ముస్లిం సంప్రదాయంలో పెళ్లి చేసుకోలేదని ధృవీకరించాం.
పలు సందర్భాల్లో సోనియా గాంధీ తమ పెళ్లి గురించి ప్రస్తావించారు. సోనియా గాంధీ వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలో 1964లో సోనియా గాంధీ ఇంగ్లీష్ చదవడానికి ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌కి వెళ్లారు అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీని కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 1968, హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.
నెహ్రూ కుటుంబం ముస్లింలు అంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఆయన కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన వారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : సోనియా-రాజీవ్ గాంధీ ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Unknown
Claim Source : Social Media
Fact Check : False
Next Story