Tue Dec 03 2024 17:41:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓ వ్యక్తిని కాపాడిన వీడియో బెంగళూరుకు చెందినది కాదు. నోయిడాలో చోటు చేసుకున్న ఘటన.
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి
Claim :
బెంగళూరు నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడారుFact :
ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న వ్యక్తికి అపార్ట్మెంట్ వాసులు కాపాడారు.
కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఎంతో స్ట్రెస్ తో కూడుకున్నవి ఉంటాయి. ఉద్యోగాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మీరు ఎక్కువ గంటలు పని చేస్తున్నారా? డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో ఎక్కడ లేని టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారా? ఇవన్నీ ఉద్యోగాల్లో కామన్ అయిపోయాయి.
సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నిర్దిష్ట ప్రాజెక్ట్‌లో ఎక్కువ గంటలు పని చేస్తూ ఉండడంతో నిద్రలేకపోవడం లాంటి సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మీరు మీ పనిని ప్రేమించకుంటే తప్పనిసరిగా ఒత్తిడి మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో అప్డేట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరైన అవగాహన లేకపోవడం, మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఉద్యోగం విషయంలో ఎక్కడ లేని డౌట్స్ వస్తూ ఉండడంతో లైఫ్ లో ఏమి జరగబోతుందో అనే భయం వెంటాడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు లక్షల జీతం తీసుకునే వ్యక్తులు కూడా ఒక్కసారిగా ఉద్యోగాలను వదిలిపెట్టడం, లేదా ఇక చాలురా బాబూ ఈ ఉద్యోగాలు, ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని అనుకునే వాళ్లను మన చుట్టూ గమనిస్తూ ఉంటాం.
కొందరు ఈ ఉద్యోగాల వల్ల మానసికంగా కూడా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్లు తీసుకునే నిర్ణయాలు అందరినీ కలచి వేస్తూ ఉంటాయి.
అయితే బెంగళూరు నగరంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జాబ్ చేయడం నచ్చక ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడనే వాదనతో పోస్టులను వాట్సాప్ లో వైరల్ చేస్తున్నారు.
"సాఫ్ట్ వేర్ జాబ్ చేయలేకపోతున్నా అంటూ బెంగళూరులో అపార్ట్మెంట్ నుండి దూకేయడానికి ప్రయత్నించిన engineer.
ఎలా కాపాడారో చూడండి!" అంటూ వాట్సాప్ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి భారీ అపార్ట్మెంట్ నుండి దూకేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా, వెనక నుండి వెళ్లిన కొందరు అతడిని దూకనివ్వకుండా పట్టుకుని వెనక్కు లాగేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోలోని ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకోలేదు. ఇది నోయిడాలో చోటు చేసుకున్న ఘటన.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్ లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మాకు పలు నేషనల్ మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేసిన వీడియోలు, తమ వెబ్ సైట్లలో ప్రచురించిన కథనాలను మేము కనుగొన్నాం.
'Video: Man Tries To Jump From Noida High-Rise, Residents Pull Him To Safety' అంటూ ఎన్డీటీవీ ప్రచురించిన కథనాన్ని మేము చూశాం.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నుంచి వేలాడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని కథనం చెబుతోంది. ఆ వ్యక్తి సూపర్‌టెక్ కేప్‌టౌన్‌లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడని ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించగా అతడిని అపార్ట్మెంట్ వాసులు కాపాడారని కథనం తెలిపింది. నివేదికల ప్రకారం ఆ వ్యక్తి మెంటల్ గా అంత స్టేబుల్ గా లేడని తెలుస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ కథనం కూడా ఈ ఘటన జరిగిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అని తెలిపింది.
నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి తన కుటుంబం నుండి వేరుగా నివసిస్తున్నాడని ఈ సంఘటన జరిగే వరకు అతని ఆచూకీ గురించి కుటుంబ సభ్యులకు తెలియదని తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారిని రక్షించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అతను దీర్ఘకాలిక మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ఘటన నోయిడా సెక్టార్ 74లోని సూపర్‌టెక్ కేప్‌టౌన్‌లో జరిగింది. మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వ్యక్తిని అదే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వ్యక్తులు కాపాడారని మీడియా నివేదికలు తెలిపాయి.
ఈ వార్తా నివేదికల్లోని విజువల్స్, వైరల్ వాట్సప్ వీడియోలోని విజువల్స్ ఒకటే అని ధృవీకరించాం. ఈ ఘటన బెంగళూరులో జరిగింది కాదు. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటు చేసుకుంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
Claim : బెంగళూరు నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story