Mon Dec 23 2024 15:27:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి సెలెక్ట్ అవ్వలేదు. అదొక సినిమాలోని సన్నివేశం.
వైరల్ అవుతున్న వీడియో సినిమాలోని సన్నివేశం
Claim :
వైరల్ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి సెలెక్ట్ ఐయ్యిందిFact :
సినిమాలోని సన్నివేశాన్ని నిజంగా జరిగిన ఘటనగా ప్రచారం చేస్తున్నారు
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అందరిలోనూ తాము ప్రత్యేకం అని చాటుకోడానికి పరితపించే చాలా మంది ఈ రికార్డుల పుస్తకంలో ఎప్పటికైనా చోటు దక్కించుకోవాలని భావిస్తూ ఉంటారు. ఆ రికార్డులను కొల్లగొట్టాలని నిత్యం పరితపించే వారు కొందరైతే. వారు చేసిన అద్భుతాన్ని చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ముందుకు వస్తూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్, 2024లో ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఫలవంతమైన చలనచిత్ర నటుడుగా చిరంజీవిని గుర్తించి అవార్డును ప్రదానం చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ జారీ చేసిన సర్టిఫికేట్ తెలిపింది.
"మెగా స్టార్ చిరంజీవి 45 సంవత్సరాల వ్యవధిలో తన 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 1978లో మెగా స్టార్ రంగప్రవేశం చేసిన రోజు కూడా సెప్టెంబర్ 22నే కావడంతో ఆరోజున ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. చిరంజీవితో వేదిక పంచుకున్న బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, తాను చిరంజీవిగారికి వీరాభిమానిని అన్నారు. నేను ఆయన్ను అన్నయ్యలా భావిస్తాను.. చిరంజీవిగారికి ఈ అరుదైన గౌరవం దక్కినందుకు చాలా సంతోషించాను, అది తెలిసి చాలా థ్రిల్ అయ్యానని ఆమిర్ ఖాన్ తెలిపారు.
ఇంతలో ఓ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ శివంగి, ఎలుగుబంటిని వేటాడుతూ ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఆ శివంగి నుండి తప్పించుకోడానికి ఎలుగుబంటి చేసే పనులు, శివంగికి ఆ ఎలుగుబంటి దొరుకుతుందా? లేదా? అనే సీట్ ఎడ్జ్ సన్నివేశం మనకు అందులో కనిపిస్తుంది.
"ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి సెలెక్ట్ ఐయ్యింది .లైఫ్ అండ్ డెత్ వాచ్ థిస్
అద్భుతదృశ్యం" అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
యూట్యూబ్ లో కూడా పలు ఛానల్స్ లో ఈ వీడియోను అప్లోడ్ చేసి.. "ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి సెలెక్ట్ ఐయ్యింది .లైఫ్ అండ్ డెత్ వాచ్ థిస్" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో ఒక సినిమాలోని క్లిప్పింగ్ మాత్రమే.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. L'Ours (1988) The Cougar Scene (HQ) అనే టైటిల్ తో emileskomakare అనే యూట్యూబ్ ఛానల్ లో 10 ఏప్రిల్ 2010న అప్లోడ్ చేశారు.
వైరల్ పోస్టుల్లోని వీడియో, ఈ యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసిన వీడియో, రెండూ ఒకటేనని నిర్ధారించాం.
ఈ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియో టైటిల్ L'Ours (1988) ను క్యూగా తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేశాం.
ఈ సినిమా 1988లో వచ్చిందని వికీపీడియా, ఐఎండీబీ డేటా ద్వారా తెలుసుకున్నాం. ఈ సినిమా పేరు 'ది బేర్' అని కథనాలను చూశాం.
ది బేర్ జీన్-జాక్వెస్ అన్నాడ్ దర్శకత్వం వహించిన 1988 ఫ్రెంచ్ సినిమా. ట్రైస్టార్ పిక్చర్స్ ఈ సినిమాను విడుదల చేసింది. అమెరికన్ రచయిత జేమ్స్ ఆలివర్ కర్వుడ్ రాసిన ది గ్రిజ్లీ కింగ్ (1916) నవల ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే గెరార్డ్ బ్రాచ్ రాశారు. బ్రిటీష్ ఈ చిత్రం గ్రిజ్లీ అనే అనాథ ఎలుగుబంటి పిల్ల కథను చెబుతుంది. ఎన్నో కష్టాలకు ఓర్చి ఆ ఎలుగుబంటి చేసిన సాహసాలను ఈ సినిమాలో తెరకెక్కించారు.
ఈ సినిమాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. పలు అవార్డులు రావడమే కాకుండా ఈ సినిమా పలు నామినేషన్లు కూడా దక్కించుకుంది.
అయితే ఎక్కడా కూడా ఈ సినిమా కానీ, ఈ సినిమాలోని సన్నివేశం కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందన్న సమాచారం మాకు లభించలేదు. అకాడమీ అవార్డు, బాఫ్టా, ఇతర అవార్డులలో వివిధ విభాగాల క్రింద ‘ది బేర్’ నామినేట్ అయింది. ఈ సినిమా 1990 జెనెసిస్ అవార్డ్స్లో ఉత్తమ చలన చిత్రంగా కూడా గెలుపొందింది. అంతేకానీ మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుందనే వివరాలు లభించలేదు.
ఇక ఈ సినిమా రన్ టైమ్ కూడా 94 నిమిషాలు మాత్రమే! అలా చూసినా కూడా ఈ సినిమా ఎలాంటి రికార్డు స్థాయిలో నిడివి ఉన్న సినిమా కాదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి సెలెక్ట్ ఐయ్యింది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story