Sun Dec 22 2024 21:36:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: తిరుమల అన్నదానంలో నాణ్యత లోపించిందంటూ వైరల్ అవుతున్న విజువల్స్ ఇటీవలివి కావు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
Claim :
టీటీడీ ప్రభుత్వ హయాంలో తిరుమల అన్నదానంలో నాణ్యత లోపించిందంటూ భక్తులు ఇటీవల నిరసన తెలిపారు.Fact :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో గతేడాది డిసెంబర్ నుండి ఆన్ లైన్ లో ఉంది.
తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందన్న వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమలలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతపై విమర్శలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సేకరించిన నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ ఉన్నట్లు ల్యాబ్ నివేదికపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
రోజుకు వేలాది మంది భక్తులు వచ్చే శ్రీవేంకటేశ్వర ఆలయంలో శ్రీవారి లడ్డూల రుచిని నిర్ణయించడంలో నెయ్యి నాణ్యత ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆలయ నిర్వహణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ప్రతి ఆరు నెలలకోసారి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచి ప్రతి సంవత్సరం 5 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తుంది.
తిరుమల లడ్డూ వివాదంపై దానిని తయారు చేసిన కంపెనీ యాజమాన్యం స్పందించింది. తాము ఎలాంటి కల్తీ నెయ్యిలో చేయలేదని తెలిపింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ ఈ వివరణ ఇచ్చింది. తాము జులై నెలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పదహారు టన్నుల నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది. నెయ్యి సరఫరాపై తమను తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ కోరిందని, తాము ఎలాంటి కల్తీ చేయలేదని చెప్పింది. టీటీడీకి తమ వివరణను పంపామని కూడా ఏఆర్ కంపెనీ తెలిపింది. తాము స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశామంటూ ఏఆర్ కంపెనీ వివరణ ఇచ్చింది.
ఇక తిరుమలకు వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం కాంప్లెక్స్ లో భక్తులకు భోజనం లభిస్తూ ఉంటుంది. 1983 ఏప్రిల్ 6వ తేదీన తిరుమలలో నిత్యాన్నదాన పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. రోజుకు కొన్ని వేల మందికి అన్నప్రసాదాలు అందజేస్తున్నారు.
అయితే తిరుమల అన్నప్రసాదాలకు సంబంధించి నాణ్యత లోపించిందంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో ఓ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
కూటమి ప్రభుత్వం హయాంలో నాణ్యత లేని భోజనాన్ని తిరుమలలో పెడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను వైరల్ చేస్తున్నారు.

"నాణ్యత లేని భోజనాలు పెడుతున్నారు అంట తెలుగుదేశం ప్రభుత్వం
#thirupathi #tirupati #thirumala #tirumala #ttd #andhrapradesh" అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు.
వైరల్ వీడియో కింద కామెంట్లను గమనించగా, ఇది ఇటీవలి వీడియో కాదంటూ పలువురు వినియోగదారులు కామెంట్లు చేయడం మేము గమనించాం.
దాన్ని క్యూగా తీసుకుని వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మా పరిశోధనలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే వీడియో ఆన్ లైన్ లో ఉందని గమనించాం.
Masterkey Tv Telugu అనే యూట్యూబ్ ఛానల్ లో 5 డిసెంబర్, 2023లో " ఇలాంటి అన్నం పెడతారా..! టీటీడీ పై భక్తులఆగ్రహం |#ttd#thirumala #cmjagan #viralshorts #trendingshorts" అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
"ఇలాంటి అన్నం పెడతారా ..! టీటీడీ పై భక్తుల ఆగ్రహం | TTD | Anna Prasadam | ABN Telugu" అంటూ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ABN ఆంధ్రజ్యోతి 5 డిసెంబర్ 2023న ఈ వీడియోను అప్లోడ్ చేసింది. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో ఈ ఘటన చోటు చేసుకుందని మీడియా సంస్థ నివేదించింది.
పలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఇదే వీడియోను గతేడాది డిసెంబర్ నెలలో అప్లోడ్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న విజువల్స్ ప్రజలను తప్పుదావ పట్టిస్తూ ఉన్నాయి. ఈ వీడియో 2023, డిసెంబర్ నుండి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
Claim : టీటీడీ ప్రభుత్వ హయాంలో తిరుమల అన్నదానంలో నాణ్యత లోపించిందంటూ భక్తులు ఇటీవల నిరసన తెలిపారు.
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : Misleading
Next Story