Thu Nov 21 2024 13:03:23 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: శంషాబాద్ లోని హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో మతపరమైన కోణం లేదు.
ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు
Claim :
ఇతర మతానికి చెందిన వారు శంషాబాద్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారుFact :
ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు
శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ కాలనీలోని ఆలయంలో జరిగిన విధ్వంసానికి నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ హిందూ సంస్థలు నవంబర్ 6న బంద్‌కు పిలుపునిచ్చాయి. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అనంతరం నగరంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని, అసలు నిందితులను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
ఘటన జరిగిన రోజు దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు నవగ్రహాలు ధ్వంసమైన విషయాన్ని చెప్పడంతో అది వెలుగులోకి వచ్చిందని ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. నవగ్రహాలలోని తొమ్మిది విగ్రహాలలో ఐదు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మిగిలిన నాలుగు విగ్రహాలు పగలకపోయినప్పటికీ పాడైపోయాయని ఆలయానికి వచ్చిన స్థానికులు మీడియాకు తెలిపారు. ఉదయం 6 గంటలకు, అర్చకుడు గర్భగుడి వద్ద ఉన్న హనుమాన్ విగ్రహం శుద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఒక భక్తుడు అతని వద్దకు వచ్చి ప్రధాన ఆలయ నిర్మాణం వెలుపల ఉన్న నవగ్రహాలకు జరిగిన నష్టం గురించి అప్రమత్తం చేశాడు.
అయితే ఈ విగ్రహాల ధ్వంసం వెనుక ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ విగ్రహాల ధ్వంసం వెనుక మతపరమైన కోణం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేయగా.. "Hyderabad Hanuman Temple Vandalism: 50-Year-Old UP Man Arrested After Idols of Navagraha Damaged in Shamshabad (Watch Video)" అనే టైటిల్ తో https://www.latestly.com లో కథనాన్ని చూశాం.
ఈ విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల హిందూ వ్యక్తిని RGIA పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కథనంలో ఉంది. అనుమానితుడు ఉత్తరప్రదేశ్‌లోని సిర్పురా జిల్లాలోని డాన్సింగ్ పూర్ గ్రామానికి చెందిన శ్రీపుత్రి లాల్ గణపతి సింగ్ కుమారుడు కోర్పాల్గా గుర్తించారు. విధ్వంసం వెనుక గల కారణాలపై ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి హిందువేనని పోలీసులు ధృవీకరించారు.
మాకు ట్విట్టర్ లో జర్నలిస్టు Mubashir.Khurram చేసిన ట్వీట్ కూడా కనిపించింది. హిందూ వ్యక్తిని నిందితుడని పోలీసులు తెలిపారంటూ వివరించారు.
మా పరిశోధనలో https://www.thehindu.com లో కథనాన్ని మేము చూశాం.
నవంబర్ 5, 2024న శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయం వద్ద విగ్రహాలను ధ్వంసం చేయడంతో 56 ఏళ్ల వ్యక్తిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనుమానితుడిని కోర్పాల్గా గుర్తించామని శంషాబాద్ ఏసీపీ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఆ వ్యక్తి మానసిక వికలాంగుడిగా ఉన్నాడని, అతని గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని పోలీసులు వివరించారని కథనాలను చూశాం.
ఇక మేము శంషాబాద్ పోలీసులను ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించగా.. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని వివరించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇతర మతానికి చెందిన వారు శంషాబాద్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost
Claim Source : Social Media
Fact Check : False
Next Story