Fri Nov 29 2024 10:23:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బట్టలు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
బట్టలు అమ్ముకోడానికి వచ్చినట్లు నటిస్తూ
Claim :
బట్టలు అమ్ముకోడానికి వచ్చినట్లు నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారుFact :
డేంజర్ గ్యాంగ్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
కొన్ని సార్లు వదంతులు కొందరి పాలిట శాపంగా మారొచ్చు. పిల్లలను ఎత్తుకుని పోయే వాళ్లు వచ్చారంటూ గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన ప్రచారం ఎందరో అమాయకుల ప్రాణాలు తీసింది.
ఇక శీతాకాలం వచ్చిందంటే చాలు పలు రాష్ట్రాల నుండి రగ్గులు, స్వెటర్లు అమ్మేవారు తెలుగు రాష్ట్రాలకు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు దొంగతనాలు చేస్తున్నారంటూ వాట్సాప్ లో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా అలంటి ముఠా వచ్చిందంటూ పోస్టులు పెట్టారు.
"నగరవాసులందరూ జాగ్రత్తగా ఉండాలి
*వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్షీట్లు మరియు ఇతర బట్టలు అమ్ముతున్న ముఠా వచ్చింది, వీరంతా బీదర్ మరియు గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు. ఈ ముఠా సభ్యులు, వెచ్చని దుప్పట్లు లేదా ఇతర బట్టలు అమ్మేవారిగా నటిస్తూ, చౌకైన వస్తువులను విక్రయించే పేరుతో స్థానికంగా, కాలనీలో గృహాలు షాపులు మొదలైనవాటిలో రెక్కి నిర్వహిస్తారు. వారు అవకాశాల కోసం వెతుకుతారు మరియు ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరితో పంచుకోండి.
(పోలీసు పరిపాలన)" అంటూ పోస్టు పెట్టారు.
ఈ ఫోటోలలో కొందరు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి.
"నగరవాసులందరూ జాగ్రత్తగా ఉండాలి
*వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్షీట్లు మరియు ఇతర బట్టలు అమ్ముతున్న ముఠా వచ్చింది, వీరంతా బీదర్ మరియు గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు. ఈ ముఠా సభ్యులు, వెచ్చని దుప్పట్లు లేదా ఇతర బట్టలు అమ్మేవారిగా నటిస్తూ, చౌకైన వస్తువులను విక్రయించే పేరుతో స్థానికంగా, కాలనీలో గృహాలు షాపులు మొదలైనవాటిలో రెక్కి నిర్వహిస్తారు. వారు అవకాశాల కోసం వెతుకుతారు మరియు ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరితో పంచుకోండి.
(పోలీసు పరిపాలన)" అంటూ పోస్టు పెట్టారు.
ఈ ఫోటోలలో కొందరు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వ్యక్తులకు సంబంధించి తాము ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని పోలీసులు తెలిపారు
వైరల్ మెసేజీలో ఉన్న ఫోటోను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో గతంలో కూడా ఇదే వాదనతో వైరల్ అయిందని తేలింది.
పలు భాషలు, పలు ప్రాంతాలకు చెందిన సోషల్ మీడియా యూజర్లు ఈ ఫోటోను షేర్ చేశారు.
ఇతర ప్రాంతాల్లో వీరిని ఇరానీ గ్యాంగ్ మెంబర్లు అంటూ పోస్టులు పెట్టారు.
కాబట్టి, ఈ ఫోటో కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని మేము గుర్తించాం. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కొన్నేళ్ల కిందట పలు మీడియా సంస్థల కథనాలను కనుగొన్నాం.
ఇక 2020 లోనే ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి వదంతులను వ్యాప్తి చేస్తున్నారంటూ లోక్ మత్ న్యూస్ కు చెందిన రిపోర్టు మాకు లభించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్లో కర్ణాటకలోని స్థానిక వార్తా ఛానెల్ల ద్వారా జూలై 2019 న కొన్ని నివేదికలు వచ్చాయని తెలుసుకున్నాం. "ఇరానీ గ్యాంగ్ సభ్యులు" అంటూ మంగళూరులోని బజ్పే పోలీసులు జారీ చేసిన హెచ్చరిక అని ఈ నివేదికలు సూచించాయి. చిక్కమగళూరు పరిసర ప్రాంతాల్లో చురుగ్గా ఉన్న ముఠా, పగటిపూట దుప్పట్లు అమ్మేవారిగా నటిస్తూ రాత్రయితే దోచుకుంటున్నట్లు నివేదికలు వివరించాయి.
"Mangaluru: Police alert public of infamous ‘Irani gang’ of looters" అనే టైటిల్ తో కథనం జులై 29, 2019న కథనాన్ని ప్రచురించారు.
https://www.daijiworld.com/
ప్రముఖ కన్నడ మీడియా సంస్థ ఉదయవాణి కూడా జులై 29, 2019న వైరల్ ఫోటోతో కథనాన్ని ప్రచురించింది.
https://www.udayavani.com/
ఇక ఈ ఫోటో విషయమై హైదరాబాద్ పోలీసులు 2019లోనే ట్విట్టర్ లో స్పందించారని ధృవీకరించాం. జులై 31, 2019లో ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
కాబట్టి, కొన్నేళ్ల కిందటి ఫోటోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఫోటోకు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి, ఒకప్పుడు కర్ణాటక పోలీసులు విడుదల చేసిన కొందరు నేరస్థుల ఫోటోలు పలు రాష్ట్రాలలో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్నేళ్ల కిందట ఢిల్లీలో ఈ గ్యాంగ్ చేస్తున్న ఆగడాలకు జనమంతా భయపడిపోతున్నారంటూ కూడా ప్రచారం జరగ్గా ఇందులో ఎలాంటి నిజం లేదని ఢిల్లీ పోలీసులు సోషల్ మీడియా ఖాతాలలో ఖండించారు. ఈ తప్పుడు కథనాలు పలు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని, అది కూడా కొన్నేళ్లుగా ఇదే ఫోటో వైరల్ అవుతూ ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ అవుతున్న ఫోటో, సోషల్ మీడియా పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధృవీకరించాం.
Claim : బట్టలు అమ్ముకోడానికి వచ్చినట్లు నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story