Tue Nov 05 2024 07:56:29 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: షారుఖ్ ఖాన్ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వైరల్ అవుతున్న పోస్ట్ లో ఎలాంటి నిజం లేదు
వైరల్ అవుతున్న ఫోటో 2017 నుండి సోషల్ మీడియాలో వైరల్
Claim :
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ విమాన ప్రమాదంలో మరణించారుFact :
వైరల్ అవుతున్న ఫోటో 2017 నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది
భారతదేశంలో స్టార్డమ్ ఉన్న నటుల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. దేశ విదేశాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ షారుఖ్ ఖాన్ సొంతం. నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు. ఆయన అభిమానులు ఎంతో ఘనంగా పుట్టినరోజును జరుపుకోనున్నారు. షారుఖ్ ఖాన్ తన పుట్టినరోజు నాడు ముంబై లోని తన నివాసం మన్నత్ ముందు నిలబడి అభిమానులకు అభివాదం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ ను చూడడం కోసం మన్నత్ ముందుకు చేరుకున్నారు.
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు వేడుకల కోసం సన్నాహకంగా లైట్లతో మన్నత్ ను అందంగా అలంకరించారు. షారూఖ్ ఖాన్ దుబాయ్‌లో ముందుగానే తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దుస్తుల బ్రాండ్‌కు మద్దతుగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆర్యన్ బ్రాండ్ లాంచ్‌పై దృష్టి కేంద్రీకరించగా, అది కాస్తా షారుఖ్‌కి ప్రీ బర్త్‌డే బాష్‌గా మారింది. ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలలో తన అత్త సవితా చిబ్బర్, కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తూ కనిపించారు.
ఇంతలో ఎక్స్ లో నవంబర్ 1న REST IN PEACE SUARUKH KHAN అంటూ ట్రెండ్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే షారుఖ్ ఖాన్ విమాన ప్రమాదంలో చనిపోయారంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ న్యూస్ వెబ్ సైట్ కథనంలా అనిపించే ఓ పోస్టర్ లో షారుఖ్ ఖాన్ ఫోటో ఉంది. షారుఖ్ ఖాన్ తో కలిసి ఓ ఏడుగురు చనిపోయారంటూ ఆ స్క్రీన్ షాట్ లో ఉంది.
"Rest in peace @iamsrk
REST IN PEACE SUARUKH KHAN" అంటూ ఈ కథనాన్ని షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ మరణించలేదు. బ్రతికే ఉన్నారు.
షారుఖ్ ఖాన్ చనిపోయారా అని తెలుసుకోడానికి మేము మీడియా కథనాల గురించి వెతికాం. షారుఖ్ ఖాన్ కు ఏమీ అవ్వలేదు. ఆయన నవంబర్ 2న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారనే మీడియా కథనాలు చూశాం. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ అభిమానులు మన్నత్ వద్ద తాము షారుఖ్ ఖాన్ ను చూశాం అంటూ పలు పోస్టులు పెట్టారని ధృవీకరించాం. షారుఖ్ ఖాన్ కూడా తన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ మరణించలేదు. బ్రతికే ఉన్నారు.
షారుఖ్ ఖాన్ చనిపోయారా అని తెలుసుకోడానికి మేము మీడియా కథనాల గురించి వెతికాం. షారుఖ్ ఖాన్ కు ఏమీ అవ్వలేదు. ఆయన నవంబర్ 2న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారనే మీడియా కథనాలు చూశాం. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ అభిమానులు మన్నత్ వద్ద తాము షారుఖ్ ఖాన్ ను చూశాం అంటూ పలు పోస్టులు పెట్టారని ధృవీకరించాం. షారుఖ్ ఖాన్ కూడా తన సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు.
వైరల్ ఫోటోను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017 నుండి ఈ న్యూస్ ఆర్టికల్ స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉందని తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ పారిస్‌కు వెళుతుండగా మరో ఏడుగురితో కలిసి విమాన ప్రమాదంలో మరణించినట్లు యూరోపియన్ న్యూస్ వెబ్సైట్ బ్రేకింగ్ న్యూస్ ను ప్రచురించడంతో ఈ వదంతులు ప్రారంభమయ్యాయి.
'You've Got To Check Out What Shah Rukh Khan Has To Say About His Death Rumours' అంటూ జూన్ 3, 2017న mensxp.comలో ప్రచురితమైన కథనాన్ని మేము చూశాం. షారుఖ్ ఖాన్ చనిపోలేదని అందులో తెలిపారు.
https://www.mensxp.com/
అంతేకాకుండా ఈ కథనంలో షారుఖ్ ఖాన్ తన మీద వస్తున్న రూమర్స్ పై స్పందించారని కథనంలో చూశాం. "TGIF! Survived the week inspite of a plane crash, fatal accident on sets & yet another title of Imtiaz Ali film!," అంటూ షారుఖ్ ఖాన్ ఎక్స్ (అప్పట్లో ట్విట్టర్)లో పోస్టులు పెట్టారు.
షారుఖ్ ఖాన్ చనిపోయారంటూ ఓ కథనం ఇంటర్నెట్ ను షేక్ చేసిందంటూ ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ ఇదే వైరల్ ఫోటోను పెట్టి మే 31, 2017న కథనాన్ని ప్రచురించింది.
https://www.ibtimes.co.in/
ఈ ప్రమాదంపై ఫ్రెంచ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసి దర్యాప్తు ప్రారంభించిందని కూడా నివేదిక పేర్కొంది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్, ఇండియా షారూఖ్ ప్రొడక్షన్ హౌస్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కు కాల్ చేసింది. అలాంటి ప్రమాదం జరగలేదని వారు ధృవీకరించారు. షారుఖ్ ఖాన్ క్షేమంగా ఉన్నారని అప్పట్లో ధృవీకరించారు.
కాబట్టి, వైరల్ ఇమేజ్ ఆన్ లైన్ లో 2017 నుండి వైరల్ అవుతూనే ఉంది. షారుఖ్ ఖాన్ చనిపోయారంటూ ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. షారుఖ్ ఖాన్ క్షేమంగా ఉన్నారు.
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ విమాన ప్రమాదంలో మరణించారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social media
Fact Check : False
Next Story