Sun Dec 22 2024 19:23:54 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్థాన్ని స్వీకరించలేదంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడిలో ఇచ్చిన తీర్థాన్ని
Claim :
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడిలో ఇచ్చిన తీర్థాన్ని పారవేశారుFact :
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైరల్ వీడియోను ఎడిట్ చేశారు.
తిరుపతి దేవస్థానంలోని ప్రసిద్ధ లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించి నెయ్యిని కల్తీ చేశారనే ఆరోపణలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను (పిఐఎల్) సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించిన కేసు జాబితా ప్రకారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. న్యాయవాది సత్యం సింగ్ దాఖలు చేసిన పిటిషన్లో, ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ నేరపూరిత కుట్ర, దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సీబీఐ విచారణ లేదా న్యాయ విచారణను కోరింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యికి సంబంధించి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. లక్షలాది మంది భక్తులకు పంచిన ప్రసాదాల పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందనే ఆరోపణలు వచ్చాయి. ఆదివారం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 470/24గా కేసు నమోదు కావడంతో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ విచారణ ప్రారంభించింది. డీఐజీ గోపీనాథ్ జట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్ రావుతో కూడిన 9 మంది సభ్యుల బృందం తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై ఆరా తీస్తోంది.
ఈ అంశానికి సంబంధించి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో నిజం లేదంటూ వైఎస్ జగన్ ప్రెస్ మీట్లలో వివరించారు. తిరుమలకు వెళ్లాలని వైఎస్ జగన్ అనుకున్నా, అనుకోని కారణాల వలన ఆయన పర్యటన వాయిదా పడింది.
అయితే టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో "తిరుమల లడ్డూ ప్రసాదంగా ఇస్తే, వాసన చూడటం వదిలేయటం. ఇంట్లో గుడి సెట్టింగ్ వేసుకోవటం, అక్కడ తీర్ధం ఇస్తే తాగినట్టు యాక్షన్ చేసి కింద పోసేయటం. ఏ నాడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వక పోవటం.
గత 5 ఏళ్ళ వ్యక్తిగతంగా కూడా స్వామి వారిని అపవిత్రం చేసాడు జగన్ రెడ్డి" అంటూ పోస్టులు పెట్టారు.
ఆ వైరల్ వీడియోలో వైఎస్ జగన్ తీర్ధం తీసుకోకపోవడాన్ని చూడొచ్చు. వెనక్కు విసిరేసినట్లుగా అందులో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీర్ధం తాగిన తర్వాత తల మీద చేతిని అనుకున్నారు.
టీడీపీ అధికారిక పేజీలో పెట్టిన పోస్టు కింద కామెంట్లలో ఫేక్ వీడియో పెట్టారు అంటూ పలువురు విమర్శించడం గమనించాం. ఆ వీడియో నిడివి ఎక్కువగా ఉంది.
Nani Connects అనే ట్విట్టర్ ఖాతాలో ఒరిజినల్, ఫేక్ వీడియోలకు మధ్య ఉన్న తేడాను చూపెడుతూ పెట్టిన కామెంట్ ను మేము గమనించాం. ఆ వీడియోలో వైఎస్ జగన్ తీర్ధం స్వీకరించడాన్ని చూడొచ్చు.
Veena Jain అనే అకౌంట్ నుండి వచ్చిన కామెంట్లో సాక్షి లోగో ఉన్న 24 సెకెండ్ల వీడియోను కూడా మేము గమనించాం. ఆ వీడియోలో కూడా వైఎస్ జగన్ తీర్ధాన్ని తాగడం స్పష్టంగా చూశాం.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా "CM YS Jagan And YS Bharathi Sankranti Festival 2024 Celebrations Highlights @SakshiTVLIVE" అనే టైటిల్ తో Sakshi TV Live యూట్యూబ్ ఛానల్ లో వీడియోను మేము గమనించాం.
ఈ వీడియోలో 2:58 సెకండ్ల వద్ద వైఎస్ జగన్ దంపతులకు తీర్థప్రసాదాలు ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. దంపతులు ఇద్దరూ వాటిని స్వీకరించడాన్ని గుర్తించాం. వైరల్ వీడియోలో తాగడాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాం.
టీడీపీ చేసిన ట్వీట్ కు కౌంటర్ గా వైసీపీ తన అధికారిక ఖాతాలో "శ్రీవారి లడ్డుపై అసత్య ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయావు.. అయినా సిగ్గులేకుండా మళ్లీ ఫేక్ వీడియోతో మొదలెట్టావా? @ysjagan గారు సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను ఎంత భక్తి శ్రద్ధలతో స్వీకరించారో నీ పచ్చ కళ్ల జోడు తీసి చూడు @JaiTDP నీకు అనుకూలంగా వీడియోను ఎడిట్ చేసి ప్రజల చెవిలో మళ్లీ పూలు పెడదామని అనుకుంటున్నావేమో.. జనం ఉమ్మేస్తున్నా.. తుడుచుకుని మళ్లీ ఇలా ఫేక్ ప్రచారం చేస్తావ్.. ఎందుకంటే నీ బతుకే ఓ ఫేక్ కదా టీడీపీ" అంటూ చేసిన పోస్టును మేము గమనించాం. ఒరిజినల్, ఎడిట్ చేసిన వీడియోను వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారని మేము గుర్తించాం. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీర్థాన్ని పారేయలేదు.
Claim : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడిలో ఇచ్చిన తీర్థాన్ని పారవేశారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story