Mon Dec 23 2024 12:06:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించింది వరుణ్ తేజ్ కాదు.. వైష్ణవ్ తేజ్
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది
Claim :
వరుణ్ తేజ్.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడుFact :
శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది వైష్ణవ్ తేజ్.. వరుణ్ తేజ్ కాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మెగా ఫ్యామిలీలోనూ, అభిమానుల్లోనూ ఆనందం ఆకాశాన్ని తాకింది. ఈ సమయంలో మెగా అభిమానులు చిరంజీవి కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
అందులో మెగాకుటుంబం అందరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో చేతుల్లో పసికందును పట్టుకుని ఉండగా.. పక్కనే రేణు దేశాయ్ ను కూడా చూడొచ్చు.
అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ.. కింద వరుసలో తెలుపు రంగు డ్రెస్ ను ధరించిన అబ్బాయిని మార్క్ చేస్తూ.. 'శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నటించింది వరుణ్ తేజ్ అంటూ ఎంత మందికి తెలుసు' అంటూ పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్ లో ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్నది వరుణ్ తేజ్ కాదు.. వైష్ణవ్ తేజ్.
మొదట మేము శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను యూట్యూబ్ లో చూశాం. అందులో వీల్ చైర్ సీన్ ను నిశితంగా పరిశీలించాం. సబ్జెక్ట్.. సబ్జెక్ట్.. అంటూ వీల్ చైర్ లో ఉన్న పిల్లాడిని సినిమాలో చూపిస్తారు. మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలో తెలుపు రంగు డ్రెస్ వేసుకుని ఉన్న అబ్బాయి.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఉన్న అబ్బాయి ఒకరేనని గుర్తించాం.
ఇక సినిమా టైటిల్ కార్డ్స్ లో నటీనటుల పేర్లను గమనించగా.. 'మాస్టర్ వైష్ణవ్' అని ఉండడాన్ని మేము గమనించాం. కాబట్టి.. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది వైష్ణవ్ తేజ్ అని ధృవీకరించాం.
వైరల్ అవుతున్న పోస్టులో ఉన్నది వరుణ్ తేజ్ కాదు.. వైష్ణవ్ తేజ్.
మొదట మేము శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను యూట్యూబ్ లో చూశాం. అందులో వీల్ చైర్ సీన్ ను నిశితంగా పరిశీలించాం. సబ్జెక్ట్.. సబ్జెక్ట్.. అంటూ వీల్ చైర్ లో ఉన్న పిల్లాడిని సినిమాలో చూపిస్తారు. మెగా కుటుంబానికి సంబంధించిన ఫోటోలో తెలుపు రంగు డ్రెస్ వేసుకుని ఉన్న అబ్బాయి.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఉన్న అబ్బాయి ఒకరేనని గుర్తించాం.
ఇక సినిమా టైటిల్ కార్డ్స్ లో నటీనటుల పేర్లను గమనించగా.. 'మాస్టర్ వైష్ణవ్' అని ఉండడాన్ని మేము గమనించాం. కాబట్టి.. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది వైష్ణవ్ తేజ్ అని ధృవీకరించాం.
'Vaishnav In Shankar dada MBBS' అని కీవర్డ్ సెర్చ్ చేయగా.. వైష్ణవ్ తేజ్ తాను శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని చెప్పిన వీడియోను గుర్తించాం.
వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లింక్ మాకు లభించింది.
"Uppena Hero Vaishnav Tej Interview | Krithi Shetty | Shankar Dada MBBS Movie | Pawan Klayan Johnny" అనే టైటిల్ తో సుమన్ టీవీ వరల్డ్ అప్లోడ్ చేసిన వీడియో మాకు దొరికింది.
ఈ వీడియోలో 4:47 నిమిషాల వద్ద శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించింది మీరే కదా అని అడగ్గా.. వైష్ణవ్ తేజ్ అవును నేను నటించానని చెప్పడం మనం గమనించవచ్చు.
'మామ( మెగాస్టార్ చిరంజీవి) చేయమన్నాడు.. చేసేశాను' అంటూ వైష్ణవ్ చెప్పుకొచ్చాడు. అంతకుముందు తాను పవన్ కళ్యాణ్ తో కలిసి 'జానీ' సినిమాలో కూడా నటించానని వైష్ణవ్ తెలిపాడు.
మా మరింత పరిశోధనలో ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగా స్టార్ చిరంజీవి కూడా వైష్ణవ్ ను శంకర్ దాదా సినిమాలో బాల నటుడిగా తీసుకున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వీడియోను 'వనిత టీవీ' లో అప్లోడ్ చేశారు.
'Vaishnav Tej Fantastic Performance in Shankar Dada MBBS Movie : Megastar Chiranjeevi' అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వివరణలు బట్టి.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించింది వైష్ణవ్ తేజ్ అని మేము ధృవీకరించాం.
ఇక ఇదే ఫోటోలో రామ్ చరణ్ తేజ్ పక్కన ఉన్న అబ్బాయి.. వరుణ్ తేజ్ కాగా.. రామ్ చరణ్ ముందు.. కాస్త కింద కూర్చున్నది 'వైష్ణవ్ తేజ్'.
ఇద్దరు మెగా హీరోలకు సంబంధించి అప్పటి ఫోటోలకు, ఇప్పటి ఫోటోలకు మధ్య ఉన్న పోలికలను గమనించవచ్చు.
Varun Tej:
Vaishnav Tej:
వైష్ణవ్ తేజ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించాడంటూ పలు మీడియా కథనాలను కూడా మేము కనుగొన్నాం.
https://telugu.news18.com/
https://tv9telugu.com/
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది వరుణ్ తేజ్ కాదు.. వైష్ణవ్ తేజ్. వైరల్ ఫోటోలో మార్క్ చేసి చూపించిన పిల్లాడు వైష్ణవ్ తేజ్.
Claim : వరుణ్ తేజ్.. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : WhatsApp user
Fact Check : False
Next Story