Sun Dec 22 2024 18:25:30 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: షారుఖ్ ఖాన్ అభిమానులు జవాన్ ట్రైలర్ ను చూసి సెలెబ్రేట్ చేసుకున్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదు
వైరల్ వీడియోను ఒరిజినల్ వీడియోను పోల్చి చూశాం. చాలా సారూప్యతలు ఉన్నాయి
Claim :
ఓ క్లబ్ లో షారుఖ్ ఖాన్ అభిమానులు జవాన్ ట్రైలర్ ను చూసి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారుFact :
ఈ వీడియో ఎడిట్ చేసినది. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ట్రైలర్ కు ఒరిజినల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు
బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. మొదటి రోజు నుండే సినిమాకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా సినిమా సత్తా చాటుతూ ఉంది. ఓ క్లబ్ లో పెద్ద స్క్రీన్ వైపు చూస్తూ ఉండగా అందులో షారుఖ్ ఖాన్ జవాన్ ట్రైలర్ రావడం.. అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉండడం వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.
ఒక క్లబ్లో "జవాన్" ట్రైలర్‌ని చూసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్లు కనిపించే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అజూభాయ్ అనే షారుఖ్ ఖాన్ అభిమాని X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ ఫుటేజ్ షేర్ చేశారు, "ఇది కేవలం ట్రైలర్ మాత్రమే; సినిమా ఇంకా రావాల్సి ఉంది. సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయబోతోంది." అంటూ పోస్టు పెట్టారు.
ఒక క్లబ్లో "జవాన్" ట్రైలర్‌ని చూసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నట్లు కనిపించే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అజూభాయ్ అనే షారుఖ్ ఖాన్ అభిమాని X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ ఫుటేజ్ షేర్ చేశారు, "ఇది కేవలం ట్రైలర్ మాత్రమే; సినిమా ఇంకా రావాల్సి ఉంది. సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేయబోతోంది." అంటూ పోస్టు పెట్టారు.
ఇంకో ఎక్స్ వినియోగదారుడు కూడా అదే వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Liberal TV అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో కూడా ఈ వీడియోను చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇదొక ఎడిటెడ్ వీడియో. గతంలో పలు సినిమాలు, స్పోర్ట్స్ వీడియోకు సంబంధించి ఇదే వీడియోను వైరల్ చేశారు.
ఇది ఎడిట్ చేసిన వీడియో.. ఇందులోని వ్యక్తులు జవాన్ ట్రైలర్‌ను సంబరాలు చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ అభిమానులుగా తప్పుగా ప్రచారం చేశారు. వీడియోను నిశితంగా పరిశీలిస్తే, ఓ క్లబ్‌లోని దృశ్యమని.. అందులో ఒక వైపు ఫుట్‌బాల్‌కు సంబంధించిన వీడియోను మనం చూడొచ్చు.
ఇది విదేశాల్లోని ఓ క్లబ్ కు సంబంధించిన దృశ్యమని మేము గుర్తించాము. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసిన తర్వాత, ఈ వీడియోకు సంబంధించిన పలు వెర్షన్లు కనుగొన్నాం.
మా దర్యాప్తులో, ఈ దృశ్యం 2016లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌లోని ఆష్టన్ గేట్ స్టేడియంలో చిత్రీకరించినట్లు కనుగొన్నాం. యూరో 2016 టోర్నమెంట్లో ఇంగ్లాండ్ వేల్స్‌పై గెలిచినప్పుడు జరిగిన సంబరాలకు సంబంధించిన వీడియో ఇది. ఇది హార్ట్ న్యూస్ వెస్ట్ కౌంటీ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.
బ్రిస్టల్ స్పోర్ట్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ కూడా ఈ వీడియోను షేర్ చేసింది. అదే సెలెబ్రేషన్ ను చూపించే 1.53 నిమిషాల వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో 360 డిగ్రీల వీక్షణను ఇస్తుంది. ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో ఆష్టన్ గేట్ స్టేడియం స్పోర్ట్స్ బార్లో చిత్రీకరించారని తెలుస్తోంది.
Bristol247.com ఒరిజినల్ వీడియోను పోస్టు చేయగా.. దాన్ని ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
మరింత సెర్చ్ చేసిన తర్వాత, బ్రిడ్జ్‌స్టోన్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ వెబ్సైట్ వైరల్ వీడియోలోని దృశ్యానికి సరిపోలిన చిత్రాన్ని అప్లోడ్ చేసినట్లు గుర్తించాం.
వైరల్ వీడియోను ఒరిజినల్ వీడియోను పోల్చి చూశాం. రెండిటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఫుట్ బాల్ వీడియోను తీసేసి జవాన్ ట్రైలర్ ను చూపించినట్లుగా ఎడిట్ చేశారు. అలా జవాన్ సినిమా ప్రమోషన్స్ కు వాడుతున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : A video of Shah Rukh Khan fans celebrating the \"Jawan\" trailer at a club
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story