Fri Nov 22 2024 19:50:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: సుప్రీం కోర్టు ఈవీఎంలను బ్యాన్ చేస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఒకవేళ సుప్రీం కోర్టు నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఆ విషయాన్ని మీడియా
Claim :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించింది.Fact :
ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) వినియోగాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించినట్లు ఎటువంటి నివేదికలు రాలేదు. అలాంటి నిర్ణయం తీసుకుంటే మీడియా సంస్థలు తప్పకుండా పెద్ద ఎత్తున ఆ వార్తను ప్రసారం చేసి ఉండేవి. ఫిబ్రవరి 15, 2024న, PIB (భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) చేసిన సుప్రీంకోర్టు EVMలను నిషేధించిందంటూ వైరల్ అవుతున్న వాదనను తోసిపుచ్చింది.
ఫిబ్రవరి 15, 2024న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని.. ఈ బాండ్ల కోసం IT చట్టంలోనూ, ప్రజాప్రాతినిథ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వివరించారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించినట్లు ధర్మాసనం భావించింది.
ఈ నేపథ్యంలో ఈవీఎంల వినియోగాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, న్యాయవాదుల విజయానికి ప్రతీకగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
https://www.facebook.com/reel/355988033934775
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము గూగుల్ లో "Supreme Court ban on EVM" అని సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMలు) వినియోగాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించినట్లు ఎటువంటి నివేదికలు కనుగొనలేకపోయాం.
ఒకవేళ సుప్రీం కోర్టు నిజంగానే అలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఆ విషయాన్ని మీడియా విస్తృతంగా కవర్ చేసి ఉండేది. విస్తృతంగా సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 15, 2024న భారతదేశంలో EVMలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు చెప్పిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని PIB ఫాక్ట్ చెక్ చేసిన ట్వీట్ ను మేము గుర్తించాం.
అదనంగా, EVMల వినియోగాన్ని సవాలు చేస్తూ వచ్చిన అనేక PILలను భారత సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధృవీకరిస్తూ వివిధ నివేదికలను మేము కనుగొన్నాం. నవంబర్ 2019లో, లోక్సభ ఎన్నికలలో EVMలకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాలని వాదించే పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఈవీఎంలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, ఎన్నికల్లో వాటిని వినియోగించరాదని వాదిస్తూ న్యాయ భూమి అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ఎ. సుబ్బారావు ఈ పిల్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు ఈవీఎంలను నిషేధిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వైరల్ అవుతున్న వీడియో.. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించినది. మేము ఫిబ్రవరి 15, 2024 న పలు YouTube ఛానల్స్ లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోలో.. సుప్రీంకోర్టు న్యాయవాది మెహమూద్ ప్రాచా ఎలక్టోరల్ బాండ్లపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మెహమూద్ ప్రాచా నాయకత్వంలో, కొంతమంది న్యాయవాదులు "EVM హటావో సంయుక్త మోర్చా" పేరుతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మేము కనుగొన్నాము. వారు తమ ఛానెల్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు.
కాబట్టి వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించినట్లు ఎటువంటి ప్రకటన రాలేదు.
Claim : The Supreme Court of India has prohibited the use of electronic voting machines (EVMs)
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook user
Fact Check : False
Next Story