Thu Nov 07 2024 10:46:19 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ‘రాహుల్ గాంధీ గో బ్యాక్’ నినాదాలకు సంబంధించిన వీడియో ఇటీవలిది కాదు.. మణిపూర్ పర్యటనకు సంబంధించినది కాదు
వైరల్ క్లిప్ అస్సాంకు సంబంధించినది. 2024లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రికార్డ్ చేశారు
Claim :
ఇటీవల మణిపూర్ పర్యటనలో అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారుFact :
వైరల్ క్లిప్ అస్సాంకు సంబంధించినది. 2024లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రికార్డ్ చేశారు
జూలై 8, 2024న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన ప్రజలను, సహాయ శిబిరాల్లో ఉన్న ప్రజలను రాహుల్ గాంధీ కలుసుకున్నారు. శిబిరం వెలుపల స్థానిక నాయకులు, కార్మికులు, వాలంటీర్లతో ఆయన మాట్లాడారు. ఈ పర్యటన మణిపూర్ లో అల్లర్ల తర్వాత ఆయన చేసిన మూడో పర్యటనగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల తర్వాత ఇది మొదటిది, అంతేకాకుండా మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ రెండు లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకుంది.
రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 2 నిమిషాల 19 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాహుల్ గాంధీ ఇటీవల మణిపూర్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో వాస్తవానికి అస్సాంకు చెందినది, 2024లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రికార్డ్ చేశారని ధృవీకరించాం.
ఈ వీడియో జనవరి 2024 నాటిది.. అస్సాంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియో ఇది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్లో.. జనవరి 21, 2024న IBC 24 ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము, “Bharat Jodo Nyay yatra: लोगों ने लगाए ‘राहुल गांधी गो बैक’ के नारे, असम में अब इस जगह हुआ भारत जोड़ो न्याय यात्रा का विरोध,” అనే హెడ్ లైన్ తో కథనాన్ని ప్రచురించారు. "అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన" అని టైటిల్ తెలియజేస్తుంది.
జనవరి 22, 2024న, O TV న్యూస్ ఇంగ్లీష్ తమ యూట్యూబ్ ఛానెల్లో "అన్యాయ యాత్ర' నినాదాలతో, అస్సాంలోని నాగాన్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన" అనే శీర్షికతో అదే వీడియోను అప్లోడ్ చేసింది.
“Bharat Jodo Nyay Yatra in Assam'' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి మేము గూగుల్ సెర్చ్ చేయగా.. డెక్కన్ హెరాల్డ్ లో జనవరి 22, 2024న అప్లోడ్ చేసిన వివరణాత్మక కథనాన్ని మేము కనుగొన్నాము. అందులో “ రాహుల్ గాంధీ, మరికొందరు నాయకులు రుపోహిలో రాత్రి బస చేయడానికి అంబగన్లోని రెస్టారెంట్లో ఆగిపోయినప్పుడు ఈ సంఘటన జరిగింది" అని తెలిపారు.
ఆ జనం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమగురి కాంగ్రెస్ ఎమ్మెల్యే రకీబుల్ హుస్సేన్ను ఉద్దేశించి 'అన్యయ్ యాత్ర', 'రకీబుల్ గో బ్యాక్' వంటి సందేశాలతో కూడిన ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. రాహుల్ గాంధీ, ఇతర నాయకులను భద్రతా సిబ్బంది హోటల్ నుండి బయటకు పంపించారు. ర్యాలీ నుండి తిరిగి వస్తున్న పార్టీ కార్యకర్తల వాహనాలపై దాడి చేసిన మరొక సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, విద్యార్థి విభాగానికి చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు, అస్సాం కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి రతుల్ కలితా తన సోషల్ మీడియాలో “రాహుల్ గాంధీ జీ జూలై 8న మణిపూర్లో 'గో బ్యాక్' నినాదాలను ఎదుర్కోలేదు." అంటూ చెప్పుకొచ్చారు.
PTI న్యూస్ “Crowd raises slogans against Rahul Gandhi outside eatery in Assam's Nagaon” అంటూ కథనాన్ని ప్రచురించింది. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అందులో ఉంది.
NDTV కూడా “Crowd Raises Slogans Against Rahul Gandhi Outside Eatery In Assam” అనే వాదనతో నిరసనలు చేశారంటూ కథనాలను ప్రచురించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటీవలి మణిపూర్ పర్యటనతో ఈ వీడియోలకు సంబంధం లేదు. ఈ వీడియో జనవరి 2024లో అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రికార్డ్ అయినది.
Claim : ఇటీవల మణిపూర్ పర్యటనలో అక్కడి ప్రజలు రాహుల్ గాంధీ 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story