Sun Dec 22 2024 18:27:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: డిబేట్ లో పాల్గొన్న వ్యక్తులు కొట్టుకుంటున్న ఘటన మణిపూర్ లో చోటు చేసుకున్నది కాదు.. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది.
వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా..
Claim :
మణిపూర్లో లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ అధికార ప్రతినిధులు కొట్టుకున్నారుFact :
వైరల్ వీడియో 2016 నాటిది. ఆఫ్ఘనిస్తాన్ టీవీ ఛానెల్లో డిబేట్ సందర్భంగా ప్యానెలిస్ట్ల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఇది.
ఓ టీవీ ఛానల్ లో మణిపూర్కు సంబంధించిన చర్చా కార్యక్రమం నిర్వహించగా.. కాంగ్రెస్, బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార ప్రతినిధుల మధ్య గొడవ జరిగింది. అది ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్ళింది. బూతులు తిట్టుకుంటూ ఏకంగా పిడిగుద్దులు విసురుకున్నారు.
ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీల్లో రెండు దశల్లో మణిపూర్ లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము ఫిబ్రవరి 21, 2019న TV9 Bharatvarsh ద్వారా అప్లోడ్ చేసిన YouTube వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో "కాబుల్ TV గెస్ట్ ఫైటింగ్" పేరుతో అప్లోడ్ చేశారు.
మేము ఫిబ్రవరి 19, 2019 నాటి పాకిస్తాన్ కు చెందిన మీడియా సంస్థ ది న్యూస్ ఇంటర్నేషనల్ నుండి ఒక నివేదికను కనుగొన్నాము. ఒక TV టాక్ షోలో పాల్గొన్న ప్యానలిస్టులు గొడవకు దిగారని.. ఆఫ్ఘనిస్తాన్లో ప్రత్యక్ష ప్రసారంలో చర్చ హింసాత్మకంగా మారిందని నివేదించారు. ఈ వీడియోకు.. మణిపూర్కు ఎలాంటి సంబంధం లేదని ఈ సాక్ష్యాలు నిర్ధారిస్తున్నాయి.
జూన్ 2016లో ఆఫ్ఘన్ వార్తా ఛానల్, 1 TV కాబూల్లో చర్చ సందర్భంగా ఈ గొడవ జరిగిందని తేలింది. ఇది కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ కాదని తెలుస్తోంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మణిపూర్లో లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్యానెల్ చర్చ సందర్భంగా ఈ గొడవ జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్ టీవీ ఛానెల్లో డిబేట్ సందర్భంగా జరిగిన పోరాటాన్ని చూపించే వీడియోను కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గొడవ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
Claim : మణిపూర్లో లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ అధికార ప్రతినిధులు కొట్టుకున్నారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story