Fri Nov 22 2024 13:57:56 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భూకంపం కారణంగా జరిగిన విధ్వంసానికి సంబంధించిన క్లిప్‌లను చూపించే వీడియోలు తైవాన్‌లో ఇటీవలి ఘటనలకు సంబంధించినవి కావు.
ఏప్రిల్ 3వ తేదీన జపాన్ పొరుగు దేశమైన తైవాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది
Claim :
భారీ భూకంపం కారణంగా తైవాన్ లో విధ్వంసం చోటు చేసుకుందిFact :
వైరల్ వీడియోలు ఇటీవలివి కావు.. అనేక పాత వీడియోలను మరోసారి వైరల్ చేస్తున్నారు.
ఏప్రిల్ 3వ తేదీన జపాన్ పొరుగు దేశమైన తైవాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో జపాన్, ఫిలిప్పీన్స్‌లకు సునామీ హెచ్చరికలు కూడా పంపినట్లు మీడియా నివేదిక పేర్కొంది. తైవాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపానికి సంబంధించిన ఇటీవలి ఫుటేజీలను చూపుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఒక వీడియోలో.. రాకాసి అలల కారణంగా పడవలు కొట్టుకుని వస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. మరొక క్లిప్‌లో, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నప్పుడు రైలు షేక్ అవుతూ ఉండడం గమనించవచ్చు. మరొకదానిలో.. ఒక భవనం కూలిపోతున్నట్లు మనం గుర్తించవచ్చు.
మొదటి క్లిప్ - “BREAKING NEWS from #Taiwan It's shocking incident, happened in Taiwan ! See the Skyscraper condition and Heavy Earthquake! May Allah Protect their Life's #Japan #earthquake #Tsunami అంటూ వీడియోలను షేర్ చేశారు. బలమైన కెరటాల కారణంగా పడవలు వరద నీటిలో నుండి వీధుల్లోకి వచ్చేసాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు నిజంగా జరిగిన ఘటనలు అంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు.
క్లిప్ 2 & 3:
“BREAKING NEWS from #Taiwan It's a shocking incident, happened in Taiwan! See the Skyscraper condition and Heavy Earthquake! May Allah protect their Life's #Japan #earthquake #Tsunami”. అంటూ మరిన్ని వీడియోలను షేర్ చేశారు. అందులో భవనాలు భూకంపం దెబ్బకు కదులుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము కనుగొన్నాము. సోషల్ మీడియాలో షేర్ చేసిన పై వీడియోలన్నీ ఇటీవల తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించినవి కావు.
క్లిప్ 1
బలమైన అలలు పడవలను, వాహనాలను తోసి వేస్తున్న వీడియో ఇటీవలిది కాదు. మొదటి వీడియోను Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చేయగా.. ఇటీవలి భూకంపానికి ముందే ఈ వీడియో ఇంటర్నెట్లో ఉన్నట్లు మేము కనుగొన్నాము.
ఒక YouTube వినియోగదారు Mi espico ఏడేళ్ల క్రితం ఇదే వీడియోను పోస్ట్ చేశారు.
మెషిన్ ఐ.. అనే డిజిటల్ క్రియేటర్ అదే వీడియోను గత ఏడాది ఏప్రిల్ లో పోస్ట్ చేసి.. ఇది 2011లో వచ్చిన జపాన్ సునామీకి సంబంధించిన విజువల్స్ అని తెలిపారు. “ప్రియమైన స్నేహితులారా, మీరు ఇప్పుడు చూస్తున్నది స్పెషల్ ఎఫెక్స్ట్ కు సంబంధించిన వీడియో కాదు, 2011లో జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం కారణంగా సంభవించిన సునామీ” అనే వివరణతో పోస్ట్ చేశారు.
ఈ వివరణ కారణంగా వైరల్ వీడియో ఇటీవలిది కాదని.. అంతేకాకుండా 2011 సునామీకి సంబంధించినదని తెలుస్తోంది.
క్లిప్ 2
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఉమాశంకర్ సింగ్ అనే జర్నలిస్ట్ అదే వీడియోను సెప్టెంబర్ 18, 2022న పోస్టు చేశారు. తన X ఖాతాలో “ताज़ा रिपोर्ट के मुताबिक़ ताइवान में आए भूकंप की तीव्रता 7.2 है। देखिए स्टेशन पर खड़ी ट्रेन भूकंप के दौरान कैसे हिचकोले लेने लगी” అనే టైటిల్ తో షేర్ చేశారు.
“తాజా నివేదికల ప్రకారం, తైవాన్‌లో భూకంప తీవ్రత 7.2. భూకంపం సమయంలో స్టేషన్లో పట్టాలపై రైలు ఎలా వణికిపోయిందో చూడండి” అంటూ పోస్టు పెట్టారు.
“Taiwan Earthquake Causes Trains to Tremble like Toys" అనే టైటిల్ తో సెప్టెంబర్ 18, 2022న, NDTV ఒక కథనాన్ని ప్రచురించింది.
“ ताइवान में भूकंप से खिलौने की तरह हिली ट्रेन, चौंकाने वाला Video वायरल” అంటూ సెప్టెంబర్ 19, 2022న ABP న్యూస్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది
ఈ వార్తా కథనాల కారణంగా 2022లో తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించిన క్లిప్ అని రుజువు చేస్తుంది.
క్లిప్ 3
Google రివర్స్ ఇమేజ్ సమయంలో, రాయిటర్స్ సంస్థ ఆ భవనం కూలిపోతున్న వీడియోను ఫిబ్రవరి 6, 2023న అప్లోడ్ చేసిందని మేము కనుగొన్నాము. “టర్కీలోని శాన్లియుర్ఫా ప్రావిన్స్‌లో సెంట్రల్ టర్కీ, సిరియా నార్త్‌వెస్ట్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తర్వాత ఒక భవనం కూలిపోయినట్లు వీడియోలో ఉంది." అని కథనంలో ఉంది.
మేము సెంట్రల్ టర్కీలో భూకంపాల కోసం శోధించాము. CBS న్యూస్ అదే వీడియోను ఫిబ్రవరి 7, 2023న పోస్ట్ చేసిందని మేము కనుగొన్నాము. “భూకంపం సంభవించినప్పుడు టర్కీలో భవనం కూలిపోయింది” అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు.
సెంట్రల్ టర్కీలో భూకంపం సంభవించినప్పటి వీడియో క్లిప్‌లు ఇవని తెలుస్తోంది.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. వీడియోలు పాతవి.. తైవాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేనివి.
Claim : భారీ భూకంపం కారణంగా తైవాన్ లో విధ్వంసం చోటు చేసుకుంది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story