Mon Dec 23 2024 14:29:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నిరసనకారులు స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తున్న వీడియో బంగ్లాదేశ్ కి సంబంధించినది కాదు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారులు
Claim :
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారులు స్నానం చేస్తున్నారుFact :
ఈ వీడియో వాస్తవానికి 2022లో ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకలో జరిగినది
బంగ్లాదేశ్‌లో ఆగస్టు 2, 2024న ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా.. పోలీసులతో సహా కనీసం 300 మంది మరణించారు. బుధవారం ఉదయం ఢాకా నుంచి న్యూఢిల్లీకి ఆరుగురు చిన్నారులు సహా 205 మందిని ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
బంగ్లాదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి 20 మంది అవామీ లీగ్ నేతల మృతదేహాలు, వారి కుటుంబ సభ్యులతో సహా లభ్యమయ్యాయి. సత్ఖిరా హింసాకాండలో కనీసం 10 మంది చనిపోయారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఈ హింస జరిగింది. ఆ తర్వాత పలువురు అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, వ్యాపార సంస్థలు ధ్వంసం చేసి దోచుకున్నారు. నటుడు శాంతో ఖాన్, అతని తండ్రి, చాంద్‌పూర్ సదర్ ఉపజిల్లాకు చెందిన లక్ష్మీపూర్ మోడల్ యూనియన్ పరిషత్ ఛైర్మన్, సినీ నిర్మాత-దర్శకుడు సెలీమ్ ఖాన్ కూడా హత్యకు గురయ్యారు.
ఈ పరిస్థితిలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అశాంతి నేపథ్యంలో శాంతిని కాపాడాలని రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని బెంగాల్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని, ఇది రెండు దేశాల మధ్య వ్యవహారమని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
హింసాత్మక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టిన కొన్ని గంటల తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. షేక్ హసీనా రాజీనామా తరువాత, వేలాది మంది ప్రదర్శనకారులు ఆమె అధికారిక నివాసం, ఆమె పార్టీ మరియు కుటుంబానికి సంబంధించిన ఇతర భవనాలపై దాడి చేసి, ధ్వంసం చేసి, దోచుకున్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షేక్ హసీనా నివాసం నుండి ప్రజలు చీరలు, డస్ట్బిన్లు, చేపలు, వస్త్రాలను కూడా దోచుకున్నారని వివిధ పోస్ట్‌లు చూపిస్తున్నాయి.

ఒక పోస్ట్‌లో, నిరసనకారులు షేక్ హసీనా బెడ్రూమ్లోకి వెళ్లడం.. ఆమె డైనింగ్ టేబుల్‌పై బిర్యానీ తినడం చూడొచ్చు.
ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్‌లో పెద్ద ఎత్తున జనం ఈత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వినియోగదారులు బంగ్లాదేశ్ నిరసనలకు సంబంధించిన వీడియోను "షేక్ హసీనా స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారులు ఆనందిస్తున్నారు" అనే టైటిల్ తో పంచుకుంటున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ వీడియో బంగ్లాదేశ్ కు సంబంధించింది కాదు.. 2022 లో శ్రీలంక సంక్షోభానికి సంబంధించింది. శ్రీలంక సంక్షోభం అనే ఇంగ్లీష్ టెక్స్ట్ ను వైరల్ వీడియో మీద ఓవర్ప్లే చేస్తున్నారని మేము కనుగొన్నాము.
మేము Srilanka Crisis అని సెర్చ్ చేసినప్పుడు, జూలై 9, 2022న BBC వీడియోతో కూడిన కథనాన్ని ప్రచురించిందని గుర్తించాం.
BBC తన కథనంలో “ఈ ఫుటేజీలో నిరసనకారులు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కొలనులో ఈత కొట్టారని చూపిస్తుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై నెలల తరబడి నిరసనలు వెల్లువెత్తడంతో ఆయన రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేస్తున్నారు." అని తెలిపింది.
'అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కొలనులో ఈత కొడుతున్న ప్రదర్శనకారులు' అని మేము సెర్చ్ చేసినప్పుడు.. జూలై 9, 2022న, ది ఇండిపెండెంట్ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్లో “Sri Lankan protesters swim in president’s pool after storming official residence”. అనే శీర్షికతో వీడియోను అప్లోడ్ చేసారు.
వీడియో వివరణలో “శ్రీలంక వాణిజ్య రాజధాని కొలంబోలో వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఈ ఉదయం అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు. 22 మిలియన్ల జనాభా కలిగిన ద్వీపం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య కొరతతో బాధపడుతోంది. ఇది ఇంధనం, ఆహారం, ఔషధాల దిగుమతులను పరిమితం చేసింది. దేశాన్ని ఏడు దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది." అని చెప్పడం చూడొచ్చు.
"ఆర్థిక సంక్షోభంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసంలోకి చొరబడిన నిరసనకారులు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారు. వంటగదిలో వంటలు చేస్తూ కనిపించారు" అనే శీర్షికతో NDTV ఒక కథనాన్ని ప్రచురించింది.
స్కై న్యూస్ ప్రకారం "శ్రీలంకలో నిరసనకారులు అధ్యక్షుడి ఇంటిలోకి చొరబడి స్విమ్మింగ్ పూల్‌ను ఉపయోగించారు"
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లో ఇటీవలి హింసకు సంబంధించినది కాదు. ఈ వీడియో 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభ సమయానికి సంబంధించింది.
Claim : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని స్విమ్మింగ్ పూల్‌లో నిరసనకారులు స్నానం చేస్తున్నారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story