Sat Nov 23 2024 01:22:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పిడుగులు పడుతున్నట్లు చూపుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించింది కాదు.. గ్వాటెమాలకు సంబంధించింది
పిడుగులు పడుతున్నట్లు చూపుతున్న వీడియో హిమాచల్ ప్రదేశ్ కు
Claim :
హిమాచల్ ప్రదేశ్‌లోని బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని పిడుగు నేరుగా తాకిందిFact :
గ్వాటెమాలాలో అగ్నిపర్వతంపైన పిడుగు పడింది
శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభమైంది. శివ భక్తులు తమ స్వస్థలాలలో, భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో శివలింగానికి అభిషేకం చేయడానికి నదుల నుండి నీటిని సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ పర్వత శిఖరంపై పిడుగుపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వతం పైభాగంలో బిజిలీ మహాదేవ్ అని పిలువబడే శివుని ఆలయం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం నేరుగా ఆలయంపై పడిందని వినియోగదారులు దానిని షేర్ చేశారు. ఓ పిడుగు ఏకంగా గుడి పైభాగాన్ని తాకిందని కొందరు చెబుతున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు.. "ఈ వీడియో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి వచ్చింది, ఇక్కడ హిందూ దేవుడు బిజిలీ (ఉరుము) మహాదేవ్ ఆలయం ఉంది. పిడుగు నేరుగా ఆలయాన్ని తాకింది" అనే శీర్షికతో వీడియోను షేర్ చేసారు.
ఈ నేపథ్యంలో ఓ పర్వత శిఖరంపై పిడుగుపాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వతం పైభాగంలో బిజిలీ మహాదేవ్ అని పిలువబడే శివుని ఆలయం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం నేరుగా ఆలయంపై పడిందని వినియోగదారులు దానిని షేర్ చేశారు. ఓ పిడుగు ఏకంగా గుడి పైభాగాన్ని తాకిందని కొందరు చెబుతున్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు.. "ఈ వీడియో భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుండి వచ్చింది, ఇక్కడ హిందూ దేవుడు బిజిలీ (ఉరుము) మహాదేవ్ ఆలయం ఉంది. పిడుగు నేరుగా ఆలయాన్ని తాకింది" అనే శీర్షికతో వీడియోను షేర్ చేసారు.
“हिमाचल प्रदेश में एक ऐसा मंदिर भी है, जहां हर 12 साल में वहां बिजली गिरती है। ये मंदिर भगवान शिव को समर्पित है, जहां बिजली गिरने के बाद शिवलिंग चकनाचूर हो जाता है। यही नहीं यहां के पंडित एक विशेष पेस्ट के साथ शिवलिंग को जोड़ते हैं”। అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
“హిమాచల్ ప్రదేశ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగులు పడే దేవాలయం ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. పిడుగు పడిన ప్రతిసారి శివలింగం పగిలిపోతుంది. ఇక్కడి పండితులు శివలింగాన్ని ప్రత్యేకమైన పదార్థంతో జతచేస్తారు." అని ఆ హిందీ పోస్టుల్లో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము గుర్తించాము. వీడియో హిమాచల్ ప్రదేశ్‌కి చెందినది కాదు, ఏ దేవాలయానికి చెందినది కూడా కాదు. ఈ వీడియో గ్వాటెమాలాలో బద్దలవుతున్న అగ్నిపర్వతంపై పిడుగు పడినట్లు చూపిస్తుంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో.. వాతావరణానికి సంబంధించి ప్రజాదరణ పొందిన యాప్ AccuWeather అదే వీడియోని YouTube Shortsలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. వివరణలో.. “ఏప్రిల్ 28, ఆదివారం నాడు గ్వాటెమాలాలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది, ఆంటిగ్వా నగరానికి సమీపంలో ఉన్న వోల్కాన్ డెల్ ఫ్యూగో విస్ఫోటనంతో తుఫాను సంభవించింది. జోహాన్ వోల్టెరింక్ చిత్రీకరించిన ఫుటేజ్ అగ్నిపర్వతంపై పిడుగు పడడం చూపిస్తుంది. దీంతో అగ్నిపర్వతం దట్టమైన పొగ, బూడిదను విడుదల చేసింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలజీ, వాల్కనాలజీ, మెటియోరాలజీ అండ్ హైడ్రాలజీ ఆఫ్ గ్వాటెమాల ప్రకారం.. ఈ అగ్నిపర్వతం దాదాపు 30 కిలోమీటర్ల (18.6 మైళ్ళు) దూరం వరకు బూడిదను వెదజల్లింది.
“Thunderstorm striking an erupting volcano in Guatemala” అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా.. చాలా మీడియా సంస్థలు తమ సోషల్ మీడియా సైట్లలో ఈ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
స్మిత్ సోనియన్మాగ్లో “Volcanic lightning is so common that it’s even earned its own nickname: dirty thunderstorms” అనే శీర్షికతో ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము.
అందువల్ల.. మేము వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాము. హిమాచల్ ప్రదేశ్‌లోని శివుడి దేవాలయంపై పిడుగు పడలేదు. వైరల్ వీడియో గ్వాటెమాలాకు చెందినది.. అక్కడ అగ్నిపర్వతం మీద పిడుగు పడింది.
Claim : హిమాచల్ ప్రదేశ్‌లోని బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని పిడుగు నేరుగా తాకింది
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story