Fri Nov 22 2024 14:22:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఈ ఏడాది భారత్ లో తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనాలని ప్రధాని మోదీ లెటర్ ను విడుదల చేయలేదు
ఈ ఏడాది దీపావళికి 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని భారతీయులను కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వైరల్ సందేశం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అధికారిక లేఖ లాగా ఇది కనిపిస్తూ ఉంది.
ఈ ఏడాది దీపావళికి 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని భారతీయులను కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన వైరల్ సందేశం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అధికారిక లేఖ లాగా ఇది కనిపిస్తూ ఉంది. భారతదేశ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పినట్లుగా.. అందులో ప్రధానమంత్రి సంతకం కూడా ఉంది.
"నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, మీరందరూ ఈసారి చాలా చేయాలి, రాబోయే దీపావళి పండుగ రోజున, మీ ఇళ్లలో స్వీట్లతో తేలికపాటి అలంకరణ చేయండి, వీటన్నింటిలో భారతదేశంలో తయారు చేయిన పదార్ధాలను మాత్రమే ఉపయోగించండి. ఈ ప్రధాన్ సేవక్ మాటలను మీరు తప్పకుండా వింటారని నేను ఆశిస్తున్నాను, మీరు చిన్న చిన్న అడుగులు వేసి నన్ను ఆదరిస్తే, మన భారతదేశం ప్రపంచంలో ముందు వరుసలో మొదటి స్థానంలో నిలబడగలదని నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను నీకు నమస్కరిస్తున్నాను, ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ " అని అందులో ఉంది.
ఈ పోస్టు ను సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో విపరీతంగా షేర్ చేస్తూ వస్తున్నారు.
ఇక 2019లో కూడా ఇలాంటి ఫోటో ఒకటి హిందీలో వైరల్ అయింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
భారత ప్రధాని ప్రజలను ఉద్దేశించి లేఖను విడుదల చేశారనే వాదన అవాస్తవం. ఈ లేఖను ప్రధానమంత్రి లేదా ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేయలేదు. మేము కీవర్డ్స్ ను ఉపయోగించి సంబంధిత చిత్రాల కోసం సెర్చ్ చేసినపుడు.. ఈ చిత్రం 2016 నుండి ఇంటర్నెట్లో వైరల్ అవుతోందని మేము గుర్తించాము.
ఆ సమయంలోనే ఈ వైరల్ అవుతున్న పత్రం.. ప్రామాణికమైనది కాదని పేర్కొంటూ PMO నుండి ఒక వివరణ కూడా వచ్చింది.
PMO ట్వీట్ లో "ప్రధానమంత్రి సంతకంతో కూడిన కొన్ని లెటర్లు, అభ్యర్థనలు సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. అలాంటి పత్రాలు ప్రామాణికమైనవి కావు." ("Few appeals with PM's 'signature' are circulated on social media. Such documents are not authentic.") అని ఉంది.
ప్రధాని మోదీ తన సంతకంతో రాసిన కొన్ని లేఖలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.. ఇలాంటి లేఖలను కాస్త ఎడిటింగ్ చేసి.. టాపిక్ ను మార్చి రూపొందించవచ్చు.
మేము ఆన్లైన్లో కనుగొన్న లేఖతో వైరల్ చిత్రం పోలి ఉండడాన్ని గుర్తించాము.
హిందీలో ఉన్న క్లెయిమ్ను 2016 నుండి అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజం కావని చెబుతూ కథనాలను ప్రచురించాయి.
ఈ దీపావళికి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే వినియోగించాలని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖలో ఎటువంటి నిజం లేదని గుర్తించాం.
Claim : Modi urges Indians to use Made in India products on Diwali
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Facebook
Fact Check : False
Next Story