Tue Nov 05 2024 16:37:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైరల్ చిత్రం బంగ్లాదేశ్‌లో ఇటీవలి హింసకు సంబంధించినది కాదు
రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన
Claim :
ఇటీవల జరిగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని నిరసనకారులు కూల్చివేశారుFact :
ఇది ఢాకా యూనివర్సిటీలో జరిగిన ఘటన.. హింసకు ముందు చోటు చేసుకుంది
బంగ్లాదేశ్ లో హింసాకాండ తీవ్రతరం అవ్వగా.. విద్యార్థుల తిరుగుబాటు మధ్య పాక్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుండి పారిపోయారు. నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆగస్టు 8న మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
షేక్ హసీనా ఈ ఉదంతాల తర్వాత చేసిన తొలి ప్రకటనలో.. జులైలో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని జరుపుకోవాలని షేక్ హసీనా ప్రకటించారు. బంగాబంధు భాబన్‌లో పూల మాలలు వేసి చనిపోయిన వారి ఆత్మలందరి మోక్షం కోసం ప్రార్థించండని హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇక పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాల కారణంగా భారత్ హై అలర్ట్‌లో ఉంది.
BSF అధికారి మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్ లో సరిహద్దు వద్ద గుమిగూడారు, కానీ సరిహద్దు పూర్తిగా మూసివేయడంతో ఎవరూ భారతదేశంలోకి ప్రవేశించలేకపోయారు. తరువాత వారిని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) తిరిగి తీసుకువెళ్లింది." అని తెలిపారు.
15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని షేక్ హసీనా తీవ్ర నిరసనల మధ్య రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉద్యోగాల కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసన ప్రదర్శన.. ఆమెకు, ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ తిరుగుబాటుగా మారింది. గత కొన్ని వారాల్లో, 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మరొక సమస్యాత్మకమైన పరిణామంలో.. ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత మైనారిటీ వర్గాలకు చెందిన అనేక గృహాలు, వ్యాపారాలను ధ్వంసం చేశారు.. ఆ తర్వాత వందలాది మంది బంగ్లాదేశ్ హిందువులు భారతదేశానికి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఈ నేపథ్యంలో ఓ విగ్రహానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రాసిన నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిమను రాడికల్స్ లక్ష్యంగా చేసుకోవడంతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది" అనే శీర్షికతో వినియోగదారులు ఓ చిత్రాన్ని పంచుకున్నారు.

అదే చిత్రాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా, మరొక వినియోగదారు కూడా ఈ ఘటన బంగ్లాదేశ్ లో జరిగిందని తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ ఫోటో బంగ్లాదేశ్‌లో ఇటీవలి హింసకు సంబంధించినది కాదు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 18, 2023న, Prothom ALo యూట్యూబ్ ఛానెల్ లో ఒక షార్ట్‌ను అప్లోడ్ చేసింది. వీడియోలో, అదే వైరల్ చిత్రం ప్లే చేశారని మేము కనుగొన్నాము. వీడియోలో "ఢాకా యూనివర్సిటీకి రవీంద్రనాథ్ ఠాగూర్ శిల్పం తిరిగి చేరుకుంది" అని ప్రస్తావించారు.
మేము ఫిబ్రవరి 18, 2023న ఈ వీడియోను అప్లోడ్ చేశారని కనుగొన్నాము, ఛానెల్ 24 వీడియోను అప్లోడ్ చేసింది!
ఇటీవల బంగ్లాదేశ్ హింసకు ముందు నుండే వైరల్ చిత్రం ఇంటర్నెట్లో ఉందని ఇది రుజువు చేస్తుంది.
మేము "ఢాకా విశ్వవిద్యాలయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ శిల్పం" అనే కీవర్డ్‌ని శోధించినప్పుడు.. ఫిబ్రవరి 19, 2023న ది ప్రింట్లో ప్రచురించిన వివరణాత్మక కథనాన్ని మేము కనుగొన్నాము.
“ఫిబ్రవరి 14, 2023న, ఢాకా యూనివర్శిటీ ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ విద్యార్థులు సెన్సార్షిప్, బంగ్లాదేశ్‌లో వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేసేందుకు ప్రతీకాత్మక నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ శిల్పాన్ని స్థాపించారు. ఈ చర్య ఆదర్శ్ పబ్లికేషన్స్‌కు స్టాల్‌ను నిరాకరించాలనే ఎకుషే బుక్ ఫెయిర్ నిర్ణయానికి ప్రతిస్పందనగా ఉంచారు. ఉపాధ్యాయ-విద్యార్థి కేంద్రం (TSC) వెలుపల విగ్రహాన్ని.. థర్మాకోల్, వెదురు, పాత పుస్తకాల నుండి పేజీలతో తయారు చేశారు. 19.5 అడుగుల పొడవు ఉంది" అని తెలిపారు.
అయితే.. ఫిబ్రవరి 16, 2023న విగ్రహాన్ని తొలగించారు. దీనికి ప్రతిస్పందనగా, విద్యార్థులు అదే స్థలంలో "రవీంద్రనాథ్ అదృశ్యమయ్యారు!" అని రాసి ఉన్న బ్యానర్‌ను వేలాడదీశారు. తరువాత.. వైరల్ ఫోటోలో చూసినట్లుగా, విగ్రహం ధ్వంసం చేశారనే వాదనతో తెగిపడిన తలను గుర్తించారు.
పూణే మిర్రర్ "ఢాకాలో ఠాగూర్ విగ్రహం కనిపించకుండా పోయింది" అని తెలిపారు.
న్యూస్ 18 ప్రకారం “ఢాకా యూనివర్శిటీ క్యాంపస్ నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం తప్పిపోయింది, విరిగిన తల 2 కిమీ దూరంలో కనిపించింది” అని కథనం ప్రచురించారు.
అందువల్ల, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ ఫోటో 2023లో ఢాకా యూనివర్శిటీలో జరిగిన సంఘటనకు సంబంధించినది. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసతో ఎలాంటి సంబంధం లేదు.
Claim : ఇటీవల జరిగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని నిరసనకారులు కూల్చివేశారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story