Fri Nov 22 2024 15:31:36 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ రైతుల నిరసనల్లో పాల్గొనడానికి ట్రాక్టర్‌పై వచ్చారంటూ చూపించే వైరల్ చిత్రం ఇటీవలిది కాదు
రైతుల నిరసనల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని వార్తలు వెలువడ్డాయి. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా కనీస మద్దతు ధర చట్టం తేవాలన్న
Claim :
రాహుల్ గాంధీ రైతుల నిరసనల్లో పాల్గొనడానికి ట్రాక్టర్‌పై వచ్చారుFact :
వైరల్ అవుతున్న చిత్రం రైతుల నిరసనకు సంబంధించినది కాదు. రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చినప్పటి పాత చిత్రం ఇది.
పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం చట్టం చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో భారత రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. 2021లో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత, అన్ని ఉత్పత్తులకు మద్దతు ధరలను నిర్ధారించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ.. తమ పంటలన్నింటికీ ఎంఎస్పి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు 2024లో కూడా భారీ నిరసన చేపట్టారు.
రైతుల నిరసనల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని వార్తలు వెలువడ్డాయి. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా కనీస మద్దతు ధర చట్టం తేవాలన్న డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోవడాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నించారు కూడా..! ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై నిరసనల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"ఢిల్లీలో రైతుల నిరసనలో రాహుల్ గాంధీ చేరారు, జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర రద్దు చేశారు." అంటూ వైరల్ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వివిధ మీడియా నివేదికలను నిశితంగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము.
మీరు ఫోటోగ్రాఫ్‌లను జాగ్రత్తగా గమనిస్తే, రాహుల్‌తో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తులందరూ కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో ఎక్కువగా ఉపయోగించిన మాస్క్ లను పెట్టుకుని ఉన్నారు. కాబట్టి, ఈ ఫోటో ఇటీవల తీసినది కాకపోవచ్చని మేము నిర్ధారించాం.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటోగ్రాఫ్ని రాహుల్ గాంధీ తన అధికారిక Facebook & Twitter ఖాతాలలో 26 జూలై 2021న “अगर खेत बेचने पर मजबूर करोगे, तो ट्रैक्टर संसद में चलेगा- सत्य की फ़सल उगाकर रहेंगे ! कृषि-विरोधी क़ानून वापस लो। #FarmersProtest అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. కాబట్టి ఇది ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
“రైతులను వారి వ్యవసాయ భూములను విక్రయించమని మీరు బలవంతం చేస్తే, వారు ట్రాక్టర్లలో పార్లమెంటుకు రాగలరు. రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోండి." అంటూ రాహుల్ గాంధీ అప్పట్లో చెప్పారు.
అదే శీర్షికతో, మేము ఇంటర్నెట్లో అదే సంవత్సరంలో (2021) పోస్ట్ చేసిన చాలా పోస్ట్‌లను కనుగొన్నాము.
INC ఉత్తరప్రదేశ్‌కు అమేథీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాహుల్ గుప్తా, జూలై 26, 2021న తన X ఖాతాలో మరో యాంగిల్ లో రికార్డు చేసిన అదే వీడియోను जब कृषि सुधार बिलों का विरोध करते हुए टैक्टर चलाकर संसद पहुंचे श्री @RahulGandhi ,
"अगर खेत बेचने पर मजबूर करोगे, तो ट्रैक्टर संसद में चलेगा- सत्य की फ़सल उगाकर रहेंगे! कृषि-विरोधी क़ानून वापस लो - राहुल गांधी जी అనే శీర్షికతో పోస్ట్ చేసారు.
పాల్ఘర్ కిసాన్ కాంగ్రెస్ కూడా ఇదే ఫోటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
మేము ‘Rahul Gandhi on tractor’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు అప్పట్లో ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేశారని మేము గుర్తించాం.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనంలో “Rahul Gandhi drives tractor to Parliament, protests government’s 'black' farm laws” అని ఉంది. రాహుల్ గాంధీ పార్లమెంటుకు ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారని.. ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారని అందులో తెలిపారు.
“ट्रैक्टर चलाकर संसद के गेट पर पहुंचे राहुल गांधी ने की नए कृषि कानूनों को वापस लेने की मांग, हिरासत में लिए गए कई कांग्रेसी नेता అనే టైటిల్ తో దైనిక్ నవ జ్యోతి న్యూస్ పోర్టల్ శీర్షికతో ఒక వార్తా నివేదికను ప్రచురించింది.
పై ఆధారాలు, వివిధ మీడియా నివేదికల ఆధారంగా.. రాహుల్ గాంధీ ట్రాక్టర్ మీద ఉన్న చిత్రం, వీడియోలు 2024లో రైతుల నిరసనలకు సంబంధించినది కాదని మేము కనుగొన్నాము.
Claim : Rahul Gandhi joins Farmers Protest In Delhi, Bharat Jodo Nyay Yatra In Jharkhand Cancelled
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story