Fri Nov 22 2024 13:39:24 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మార్చి 12న లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందంటూ వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజీలో ఎలాంటి నిజం లేదు.
మేము గూగుల్ లో లోక్‌సభ ఎన్నికల తేదీలకు సంబంధించిన కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము
Claim :
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అంటూ వాట్సాప్ మెసేజీ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతూ ఉంది, ఇది ఎన్నికల సంఘం జారీ చేసిందనే వాదనతో వైరల్ అవుతూ ఉంది.Fact :
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. అధికారిక తేదీలు ఇంకా ప్రకటించలేదు. వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న షెడ్యూల్ నకిలీది.
భారత ఎన్నికల సంఘం మార్చి నెలలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు అధికారులను సిద్ధం చేయడానికి.. వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అంచనా వేయడానికి ఎన్నికల కమీషన్ పలు రాష్ట్రాలను సందర్శిస్తోంది. ప్యానెల్ పని పూర్తయిన తర్వాత, తేదీలను ప్రకటిస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు అంటూ వాట్సాప్ సందేశం విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
మేము గూగుల్ లో లోక్‌సభ ఎన్నికల తేదీలకు సంబంధించిన కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. కానీ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మీడియాలో అధికారిక నోటిఫికేషన్ కు సంబంధించిన ఎటువంటి వార్తలు కూడా కనుగొనలేదు. ఒకవేళ ఎన్నికల సంఘం ప్రకటన చేసి ఉండి ఉంటే మీడియా సంస్థలు తప్పకుండా అందుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసి ఉండేవారు.
మార్చి 9 నుంచి మార్చి 13 మధ్య ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని గతంలో కొన్ని మీడియా సంస్థలు కథనాలను ప్రచారం చేశాయి.
మేము భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసాము.. కానీ తేదీలకు సంబంధించి ఎటువంటి పత్రికా ప్రకటన లేదా సర్క్యులర్ మాకు కనిపించలేదు. వైరల్ స్క్రీన్‌షాట్ నకిలీ షెడ్యూల్ అని తెలుసుకున్నాం.
భారత ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విటర్)లో ఈ వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా తెలుసుకున్నాం. మోసపూరిత సందేశాలను నమ్మకండని.. ఇంకా 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదని స్పష్టంగా పేర్కొంది.
ECI తప్పుడు సమాచారం గురించి వివరించింది. LokSabhaElections2024 షెడ్యూల్‌కు సంబంధించిన తప్పుడు సందేశం వాట్సాప్‌లో ప్రసారం చేస్తున్నారని.. అదొక ఫేక్ న్యూస్ అని వివరించారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా తేదీలను ప్రకటించలేదని.. ఎన్నికల షెడ్యూల్‌ను ఎలెక్షన్ కమిషన్ విలేకరుల సమావేశంలో తెలియజేస్తుందని వివరించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అధికారిక తేదీలు ఇంకా విడుదల కాలేదు. వాట్సాప్‌లో ప్రచారంలో ఉన్న షెడ్యూల్ నకిలీది.
Claim : A WhatsApp screenshot containing a list of significant dates of the upcoming Lok Sabha elections 2024 is in wide circulation, with a claim that it was issued by the Election Commission
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : WhatsApp user
Fact Check : False
Next Story