Mon Mar 31 2025 22:08:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఈజిప్టులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాన్ని కుంభమేళాకు ఆపాదిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు
ప్రయాగ్ రాజ్ లో అగ్నిప్రమాదం

Claim :
08-02-2025న ప్రయాగ్ రాజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందిFact :
వైరల్ విజువల్స్ ఈజిప్టుకు సంబంధించింది
ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 52 కోట్ల మందికి పైగా దర్శించుకున్నారు. కుంభమేళాను పొడిగించాలని డిమాండ్స్ వస్తున్నా ప్రభుత్వం మాత్రం పొడిగిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారీ రద్దీ కారణంగా మహా కుంభమేళా పొడిగింపు గురించి సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకార్లను ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర మందార్ నిర్ద్వంద్వంగా ఖండించారు. కుంభమేళాను ముహూర్తాల ఆధారంగా నిర్ణయిస్తారని, ఇందులో మార్పు ఉండదని స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మహా కుంభ్ ఫిబ్రవరి 26న ముగుస్తుందని రవీంద్ర మందార్ తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల ప్రకారం, భక్తులందరికీ ప్రయాణ సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను అధికారులు చూసుకుంటూ ఉన్నారన్నారు. మేళా తేదీలను పొడిగించడానికి ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం నుండి ఎటువంటి ప్రతిపాదన లేదు. యాత్రికులు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ఆయన అన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రాకపోకలు, సాధారణ ప్రజల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ట్రాఫిక్ నిర్వహణపై కూడా పరిపాలన యంత్రాంగం దృష్టి సారించిందని రవీంద్ర మందార్ చెప్పారు.
ఇంతలో దట్టంగా పొగలు అలుముకున్న ప్రాంతం నుండి ప్రజలు పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో కార్లు తగలబడి పోతూ ఉండడం చూడొచ్చు.
వైరల్ వీడియో మీద "08/02/2025
महाकुंभ मेले में आज फिर से लगी आग लगभग 40.50 से भी ज्यादा गा जलकर राख और लगभग 15 20 लोग जल गए" అని ఉంది. ఫిబ్రవరి 8న జరిగిన అగ్నిప్రమాదంలో 40 నుండి 50 వాహనాలు కాలిపోయాయని, పలువురు ప్రజలు మరణించారని పోస్టుల్లో తెలిపారు.
ఇంతలో దట్టంగా పొగలు అలుముకున్న ప్రాంతం నుండి ప్రజలు పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో కార్లు తగలబడి పోతూ ఉండడం చూడొచ్చు.
వైరల్ వీడియో మీద "08/02/2025
महाकुंभ मेले में आज फिर से लगी आग लगभग 40.50 से भी ज्यादा गा जलकर राख और लगभग 15 20 लोग जल गए" అని ఉంది. ఫిబ్రవరి 8న జరిగిన అగ్నిప్రమాదంలో 40 నుండి 50 వాహనాలు కాలిపోయాయని, పలువురు ప్రజలు మరణించారని పోస్టుల్లో తెలిపారు.
మరి కొన్ని పోస్టుల్లో ఫిబ్రవరి 9న ఈ ప్రమాదం జరిగిందంటూ పోస్టులు పెట్టారు. "బ్రేకింగ్! మహాకుంభ్ బస్టాండ్ వద్ద మరో భారీ అగ్నిప్రమాదం. ఈసారి ఏదో తీవ్రంగా తప్పు జరిగింది!! దేవుని ఆగ్రహానికి భయపడండి."
https://www.facebook.com/reel/
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో ఈజిప్టు దేశానికి సంబంధించింది.
కుంభమేళాలో అగ్నిప్రమాదాలు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నాయి. అయితే వైరల్ వీడియోలో చూపించినంత భారీ అగ్నిప్రమాదాలు జరగలేదు. మహా కుంభమేళా ప్రారంభమైన 7వ రోజున మొదటి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సంఘటన సెక్టార్ 19 లో జరిగింది. చాలా టెంట్లు కాలిపోయాయి. అలాగే చాలా సిలిండర్లు కూడా పేలిపోయాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 9న, సెక్టార్ 9లో నివసిస్తున్న కల్పవాసీల గుడారంలో సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఫిబ్రవరి 13న రెండు వేర్వేరు ప్రదేశాలలో మంటలు చెలరేగాయి. ఫిబ్రవరి 17న కూడా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 8లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
వైరల్ వీడియో లోని విజువల్స్ ను స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లో సెర్చ్ చేశాం. 16 జూలై 2020 నాటి ది టెలిగ్రాఫ్ న్యూస్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో మాకు కనిపించింది. నివేదిక ప్రకారం ఈజిప్ట్‌లోని కైరో శివారులో ముడి చమురు పైప్‌లైన్ పగిలిపోవడం వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగిందని నివేదికలు తెలిపాయి.
దీన్ని క్యూగా తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఇదే విషయాన్ని తమ కథనాల్లో తెలిపాయి. పైప్ లైన్ పగిలిపోవడం వాళ్ళ ఈ ప్రమాదం చోటు చేసుకుందని నివేదించాయి.
జులై 15, 2020లో ఈ వీడియోను NBC న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ప్రయాణిస్తున్న వాహనం నుండి వచ్చిన స్పార్క్ కైరో సమీపంలోని ఎడారిలో రహదారి పక్కన నుండి వేసిన ముడి చమురు పైప్‌లైన్ పేలడానికి కారణం అయిందని ఈజిప్ట్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక ఈ క్లిప్ ను 14 జూలై 2020న ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. క్యాప్షన్ ద్వారా "ఈజిప్ట్: కైరో - ఇస్మాయిలియా హైవేపై భారీ అగ్నిప్రమాదం" జరిగిందని వివరించారు. కైరోలోని ఇస్మాలియా ఎడారి రోడ్డులోని పెట్రోలియం మెటీరియల్ పైప్‌లైన్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది, దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి, ఈ ప్రమాదంలో 12 మంది వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇతర యాంగిల్స్ లో వీడియోను రికార్డు చేశారు కూడా. పలు కార్లు తగలబడ్డాయని నివేదికలు మాకు లభించాయి.
వైరల్ పోస్టులను పలు పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయి. ఈ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈజిప్టులో చోటు చేసుకున్న ప్రమాదాన్ని కుంభమేళాలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : 08-02-2025న ప్రయాగ్ రాజ్ లో భారీ అగ్నిప్రమాదం
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story