Sat Nov 23 2024 04:28:52 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: డ్రమ్స్ వాయిస్తూ ఉంటే ఏనుగు డ్యాన్స్ చేస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
ఏనుగులు దక్షిణ భారత హిందూ పండుగలలోనూ, పలు కార్యక్రమాలలోనూ అంతర్భాగంగా ఉన్నాయి
Claim :
డ్రమ్స్ వాయిస్తూ ఉంటే.. ఆ శబ్దానికి ఏనుగు డ్యాన్స్ చేస్తూ ఉందిFact :
అది కేవలం ఏనుగు కాస్ట్యూమ్ మాత్రం. అందులో మనుషులు ఉంటారు.
ఏనుగులు దక్షిణ భారత హిందూ పండుగలలోనూ, పలు కార్యక్రమాలలోనూ అంతర్భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా కేరళలో ఆలయాలకు సంబంధించిన కార్యక్రమాలలోనూ, ఇతర శుభకార్యాలలోనూ ఏనుగులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కేరళలో కొన్ని శతాబ్దాలుగా ఏనుగులు ఎన్నో కార్యక్రమాల్లో భాగమై ఉన్నాయి. ఏనుగులతో ఊరేగింపులు అక్కడ సర్వ సాధారణం. అయితే ఈ ఆచారాలు గత కొన్నేళ్లుగా కనుమరుగవుతూ ఉన్నాయని చెబుతున్నారు.
ఓ కార్యక్రమంలో ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు వివిధ క్యాప్షన్లతో వీడియోను షేర్ చేస్తున్నారు.
కేవలం సోషల్ మీడియా వినియోగదారులే కాదు.. అనేక వార్తా ఛానెల్‌లు కూడా ఇదే వీడియోను తమ వెబ్సైట్లలో ప్రచురించాయి. అది నిజమైన ఏనుగు కాదని నివేదికలు ఏవీ పేర్కొనలేదు.
Hindi News 24 : जब बजने लगा डोल खुद नहीं रोक पाए हाथी राजा, लगाए जबरदस्त ठुमके, देखें
TV 9 Hindi : Elephant Dance Video Goes Viral on Social Media
ఫ్యాక్ట్ చెకింగ్:
గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇదే వీడియోనే వేరే యాంగిల్ లో రికార్డు చేసిన వీడియోను మేము గుర్తించాం. ఫేస్ బుక్ లో మలయాళం ట్యాగ్ లైన్
“ ഇത്രയും ധൈര്യമുള്ള പാപ്പാനെ നിങ്ങൾ ജീവിതത്തിൽ കണ്ടിട്ടുണ്ടാവില്ല. ഞാൻ ഗ്യാരണ്ടി “ ఉపయోగించి వీడియోను పోస్టు చేశారు.
“మీ జీవితంలో ఇలాంటి వాటిని మీరు చూసి ఉండరు. నేను హామీ ఇస్తున్నాను " అని అందులో ఉంది.
వీడియోను నిశితంగా పరిశీలించగా.. ఏనుగు కాళ్లు చాలా అసహజంగా కనిపిస్తున్నాయి. ముందు, వెనుక కాళ్లు రెండూ డ్రమ్ బీట్లకు సరిగ్గా డ్యాన్స్ చేస్తున్నప్పటికీ.. ముందు, వెనుక కాళ్లు రెండూ సరిగ్గా కదలడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది.
ఏనుగు నిజమైనది కాదని, ఏనుగు డ్యాన్స్ చేసేలా.. లోపల మానవులు ఉన్నారనే వాస్తవాన్ని మేము గమనించాం. కాబట్టి ఏనుగు బొమ్మ నృత్య ప్రదర్శన చేసేలా కొంతమంది వ్యక్తులు పాల్గొంటున్నారని ఖచ్చితంగా చెప్పగలం. మేము "Elevenz" అని ఉన్న బ్యానర్‌ను కూడా కనుగొన్నాము. మేము దీని గురించి Googleలో సెర్చ్ చేయగా.. anil.arts ని ట్యాగ్ చేశారని మేము గుర్తించాం. వీడియోను అప్లోడ్ చేసిన Instagram ఖాతాను మేము గుర్తించాం. అందులో మేము ఈ ఏనుగు దుస్తులకు సంబంధించిన అనేక చిత్రాలను కనుగొన్నాము. నటుడు జయరామ్, రమేష్ పిశ్రోడి కూడా ఓ రియాల్టీ షోలో ప్రదర్శించారు.
న్యూస్ యాప్ 'ఇన్‌షార్ట్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఏనుగులు నకిలీవని.. అయితే నిజమైన ఏనుగు డ్యాన్స్ చేస్తున్నాయని భారత్ కు చెందిన న్యూస్ ఛానల్స్ తప్పుగా నివేదించాయని అందులో ఉంది.
మనుషులు ధరించే గున్న ఏనుగు కాస్ట్యూమ్ అని యూటర్న్ ఇంగ్లీష్ తెలిపింది.
ముగింపు: వివిధ మూలాలు, మీడియా నివేదికల నుండి మేము ఫ్యాక్ట్ చెక్ చేశాం. డ్యాన్స్ చేస్తున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది నిజమైన ఏనుగు కాదు. ఆ కాస్ట్యూమ్ లోపల మనుషులు పడతారు.. వారే డ్రమ్బీట్కు నృత్యం చేశారని మేము కనుగొన్నాము.
Claim : Elephant dancing for drum beats during a procession
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story