Sun Dec 22 2024 19:00:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బీజేపీ ఐటీ సెల్ సెక్రటరీ రాజేష్ బిజుపై దాడి చేసిన వీడియో ఇటీవలిది కాదు
ఇటీవల బీజేపీ కార్యకర్తను ఆయన ఇంటి ముందే దాడి చేశారు
Claim :
ఇటీవల బీజేపీ కార్యకర్తను ఆయన ఇంటి ముందే దాడి చేశారు. బీజేపీ IT & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజుపై దాడికి తెగబడ్డారుFact :
ఈ వీడియో ఫుటేజ్ ఇటీవలిది కాదు. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వ్యక్తిగత వైరానికి సంబంధించినది
ఓ రెండు నిమిషాల సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విజువల్స్ లో ఆకుపచ్చ టీ-షర్ట్ ధరించిన వ్యక్తిని తెల్ల చొక్కాలు ధరించిన మరో ఇద్దరు కొట్టారు. మరొక వ్యక్తి అక్కడ మౌనంగా ఆ గొడవను చూస్తున్నాడు. చివరికి పోలీసు యూనిఫాం ధరించిన బైకర్ ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, మూడవ వ్యక్తి ఘర్షణలో పాల్గొన్న వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు.
సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను తమ ఖాతాలో షేర్ చేసి.. “ఈరోజు సాయంత్రం బీజేపీ కార్యకర్త ఇంటి ముందు బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి శ్రీ రాజేష్ బిజుపై దారుణమైన దాడి జరిగింది. రాజేష్ చెన్నై తూర్పు నంగనల్లూరులోని శ్రీ చక్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం." అంటూ పోస్టులు పెట్టారు.
https://www.facebook.com/spanlawyers/posts/719863460059662/
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఇటీవలిది కాదు. ఇద్దరు బీజేపీ నేతల మధ్య గొడవకు సంబంధించినది.
ముందుగా, మీరు వీడియోను నిశితంగా గమనిస్తే.. ఎగువన, 31.07.2023ని చూపే డేట్ స్టాంప్ ను చూడొచ్చు. ఈ సంఘటన గత ఏడాది జరిగిందని.. ఇది ఇటీవలిది కాదని రుజువు చేస్తుంది.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము అదే వీడియోని 1 ఆగస్టు 2023న సన్ న్యూస్ ద్వారా “சொந்த கட்சி உறுப்பினரையே தாக்கிய சென்னை கிழக்கு மாவட்ட பாஜக பொதுச்செயலாளர் எஸ்.எஸ்.சுப்பையா மீது வழக்குப்பதிவு!” అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము:
“తన స్వంత పార్టీ సభ్యుడిపైనే దాడి చేశారని.. చెన్నై ఈస్ట్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. సుబ్బయ్యపై కేసు నమోదు చేయబడింది” అని ఉంది.
సొంత పార్టీ సభ్యుడిపై దాడి చేసిన బీజేపీ కార్యవర్గం! అంటూ పలు మీడియా సంస్థలు ఈ వీడియోను వైరల్ చేశాయి.
చెన్నై తూర్పు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.సుబ్బయ్య బహిరంగంగా మద్యపాన రద్దు గురించి మాట్లాడిన తర్వాత, ఒక రెస్టారెంట్లో మద్యం సేవిస్తున్నట్లు కనిపించింది. అది వైరల్‌గా మారింది.
ఈ వీడియోను వైరల్ చేసినందుకు అదే జిల్లాకు చెందిన బీజేపీ ఐటీ విభాగం కార్యదర్శి రాజేష్ బిజు ఇంటిపై ఎస్.సుబ్బయ్య మద్దతుదారులు దాడి చేశారు. రాజేష్ క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సుబ్బయ్యపై పరువు నష్టం, దాడి, బెదిరింపుల కింద పోలీసులు కేసులు పెట్టారు.
తదుపరి పరిశోధనలో.. మేము ఆగస్ట్ 1, 2023న ఈటీవీ కథనాన్ని కనుగొన్నాము. ETV తమిళనాడు అదే వీడియోను “பாஜக பொதுச் செயலாளர் மது அருந்திய வீடியோ விவகாரம்;வெளியிட்ட நபரைத் தாக்கும் சிசிடிவி காட்சிகள்!” హెడ్‌లైన్‌తో వార్తా నివేదికను ప్రచురించింది.
“బీజేపీ జనరల్ సెక్రటరీ మద్యం తాగిన వీడియో వైరల్ గా మారింది. దాన్ని విడుదల చేసిన వ్యక్తిపై దాడి చేసిన సీసీటీవీ ఫుటేజీ !" అని టైటిల్ లో ఉందని మేము కనుగొన్నాం.
“சொந்த கட்சி உறுப்பினரையே தாக்கிய சென்னை கிழக்கு மாவட்ட பாஜக பொதுச்செயலாளர் மீது வழக்குப்பதிவு!” అంటూ తమిళ వార్తాపత్రిక దినకరన్ కథనాన్ని ప్రసారం చేసింది. "తమ స్వంత పార్టీ సభ్యుడిపై దాడి చేసినందుకు చెన్నై తూర్పు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిపై కేసు నమోదు చేశారు" అన్నది దినకరన్ లో కూడా తెలిపారు.
అలాగే, ఏప్రిల్ 15, 2024న.. గ్రేటర్ చెన్నై పోలీసులు వైరల్ వీడియో స్క్రీన్ షాట్లను ఉపయోగించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరించారు. పాత వీడియోలను పంచుకున్నారని మేము కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో “ఈ వీడియో రాజకీయ పార్టీ నంగనల్లూరుకు చెందిన ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత వివాదం కారణంగా జరిగిన గొడవకు సంబంధించినది. ఈ ఘటన 31.07.2023 న జరిగింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ధృవీకరణ లేకుండా సమాచారాన్ని షేర్ చేయవద్దు. ” అని కోరారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పై పరిశోధనలు, వివిధ మీడియా నివేదికల ప్రకారం.. ఇది ఇటీవలి వీడియో కాదని.. ఇద్దరు బీజేపీ నేతల మధ్య వివాదానికి సంబంధించినదని మేము నిర్ధారించాము. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇటీవల బీజేపీ కార్యకర్తను ఆయన ఇంటి ముందే దాడి చేశారు. బీజేపీ IT & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజుపై దాడికి తెగబడ్డారు
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story