Tue Nov 05 2024 10:39:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నారా లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడగలేదు
Film director RGV’s imposter Twitter account trolls TDP leader Nara Lokesh
సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో సెలబ్రిటీల ఫేక్ అకౌంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఎన్నో వివాదాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎన్నో మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఖాతాలు నెటిజన్లను ప్రభావితం చేయడానికి, పోస్ట్ చేసిన అభిప్రాయాలు సెలబ్రిటీలవని నమ్మేలా ఉన్నాయి.తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన ట్వీట్ ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోటో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్రోల్ చేశారు. మొదట చూసిన నెటిజన్లు నారా లోకేష్ ను వర్మ టార్గెట్ చేశారేమోనని భావించారు.“గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు. నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించాను. ఈ రోజు ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఇది.” అని నారా లోకేష్ ట్వీట్ చేయగా.. "నువ్వు ఎందుకు పాదయాత్ర చేస్తున్నదీ చెప్పు.. మీ పాదయాత్ర వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం" అని ఆర్జీవీ అకౌంట్ ను పోలి ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి స్పందన వచ్చింది.గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసేవి కబ్జాలు,ఇసుక దందాలు,సెటిల్మెంట్లు.నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించాను.ఈ రోజు ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఇది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ పోస్టు ఉన్న అకౌంట్ రామ్ గోపాల్ వర్మ ఒరిజినల్ అకౌంట్ కాదు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలా కొందరు మేనేజ్ చేస్తున్నారు.మేము ట్విట్టర్ ఖాతాను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ట్విట్టర్ ఖాతా - @RGV101010 నకిలీదని మేము కనుగొన్నాము. చిత్రం, హ్యాండిల్ పేరు రామ్ గోపాల్ వర్మ ఖాతాని పోలి ఉన్నప్పటికీ, ఖాతాను ఫిబ్రవరి 2023లో సృష్టించారు. కేవలం 307 మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మను అనుకరిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ ఇది.
ఏదైనా సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతా నకిలీదో కాదో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ముందుగా ఫాలోవర్ల సంఖ్య, ఖాతాను సృష్టించిన తేదీని పరిశీలించండి. ఇతరులను నిరంతరం ట్రోల్ చేసే, ఫోటోలు మాత్రమే ట్వీట్ చేసే ఖాతా నకిలీ అకౌంట్లు కావచ్చు. ఖాతా ప్రామాణికతను ధృవీకరించడానికి Twitter లో అనేక మార్గాలు ఉన్నాయి. అనుమానిత ఖాతాలు చేసే ట్వీట్లు, వాటికి వచ్చే రీట్వీట్ లను కూడా గుర్తించవచ్చు.భారతీయ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒరిజినల్ ఖాతా @rgvzoomin. వర్మ ఖాతా మే 2009 నుండి యాక్టివ్ గా ఉంది. 5.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నారు. 12500 కంటే ఎక్కువ ట్వీట్లు చేసారు.రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకుతున్నప్పుడు, మేము అతనిని అనుకరిస్తున్న అనేక ట్విట్టర్ ఖాతాలను గుర్తించాం. @RGV101010 ఖాతా కూడా వర్మ ఒరిజినల్ అకౌంట్ ను ఫాలో అవుతోంది.
@RGV101010 అనే ట్విట్టర్ ఖాతా నకిలీది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అనుకరిస్తూ.. పలువురు టీడీపీ నేతలను ఈ అకౌంట్ ద్వారా ట్రోల్ చేస్తున్నారు.
Claim : Ram gopal varma trolling TDP leaders
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story