Sat Nov 23 2024 05:40:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు కాదని విదేశీ డీఎన్ఏ నిపుణులు చెప్పలేదు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు కాదని డీఎన్ఏ నిపుణులు చెప్పారంటూ ఓ వార్తాపత్రికకు సంబంధించిన క్లిప్పింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు కాదని డీఎన్ఏ నిపుణులు చెప్పారంటూ ఓ వార్తాపత్రికకు సంబంధించిన క్లిప్పింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో “అమెరికాకు చెందిన DNA నిపుణుడు డాక్టర్ మార్టిన్ సిజో విలేకరుల సమావేశంలో షాకింగ్ వార్తను బయటపెట్టారు. తన దగ్గర రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీల డీఎన్ఏ ఉందని.. అయితే ఆ రెండూ సరిపోలడం లేదని డాక్టర్ మార్టిన్ చెప్పారు. రాజీవ్ గాంధీకి కొడుకు లేడని నిరూపించే అన్ని రుజువులు తన దగ్గర ఉన్నాయని.. వాటిని భారత్ కు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ మార్టిన్ చెప్పారు." అని ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము ఈ డీఎన్ఏ నిపుణుల ప్రకటనకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ చేసాము. కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు కాదనే వాదనకు మద్దతు ఇచ్చే వార్తా నివేదిక ఏదీ కనుగొనలేకపోయాం. అటువంటి సమాచారం ఉండి ఉంటే.. వెంటనే మీడియా ద్వారా బయటకు వచ్చేది. ఈ వైరల్ వాదనకు సంబంధించి ఎటువంటి వార్తా నివేదికలు రాకపోవడంతో వైరల్ అవుతున్న పోస్టులు నకిలీ అని స్పష్టం అవుతోంది."Dr Martin Soji" అనే డీఎన్ఏ నిపుణుడికి సంబంధించిన సమాచారం కోసం కూడా వెతికాం. అయితే అతడికి సంబంధించి ఎటువంటి సమాచారం మాకు లభించలేదు.
అంతేకాకుండా.. సామాజిక మాధ్యమాల్లో ఈ వాదన కనిపించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా కొన్ని మీడియా సంస్థలు ఈ వాదనతో పోస్టులు పెట్టాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేవని ఆ వాదనను కొట్టివేశాయి. అవి తప్పుడు కథనాలని స్పష్టం చేశాయి.
2019లో ప్రధాని మోదీపై కూడా ఇలాంటి పోస్టు వైరల్ అయింది. అత్యాచారం కేసులో దోషి అయిన ఆశారాం బాపు కుమారుడు నరేంద్ర మోదీ అని పేర్కొంటూ ఇదే విధమైన మరో వాదన వైరల్‌గా మారింది. ఇదే విధమైన వార్తాపత్రిక క్లిప్పింగ్ టెంప్లేట్ ను ఉపయోగించారు. రెండు చిత్రాల మధ్య పోలిక స్పష్టంగా తెలుస్తోంది.
వ్యక్తులు, పార్టీల పేర్లు మాత్రమే మార్చారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్ ఫార్మాట్ అలాగే ఉంటుంది. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్పింగ్ ని గతంలో రూపొందించినట్లే రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అది నిజమైన కథనం కాదని మనం తెలుసుకోవచ్చు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు కాదని అమెరికాకు చెందిన ఏ డీఎన్ఏ నిపుణుడు కూడా చెప్పలేదు. వైరల్ పోస్టు ద్వారా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు. కల్పిత వార్తలతో కూడిన క్లిప్పింగ్‌లను షేర్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Claim : American DNA expert says Congress leader Rahul Gandhi is not the son of former PM Rajiv Gandhi
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story