Sun Dec 22 2024 13:40:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భారత ప్రధాని మోదీని ప్రశంసించలేదు
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారంటూ ఓ పోస్ట్ మరోసారి వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ 2018 నుండి వైరల్గా ఉంది. అనేక ఫ్యాక్ట్ చెక్ టీమ్స్.. ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాయి.
Claim :
భారత ప్రధాని నరేంద్ర మోదీపై భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రశంసలు కురిపించారుFact :
అదొక నకిలీ ప్రకటన. చాలా రోజులుగా చెలామణిలో ఉంది, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రధాని మోదీ గురించి అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారంటూ ఓ పోస్ట్ మరోసారి వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ 2018 నుండి వైరల్గా ఉంది. అనేక ఫ్యాక్ట్ చెక్ టీమ్స్.. ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తెలిపాయి. అయినప్పటికీ, దీన్ని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వైరల్ చేస్తూనే ఉన్నారు.
'Former President of the country, Mrs Pratibha Patil has given a big statement regarding PM Modi. Pratibha Patil has said that even though I am from the Congress Party, today as a social worker of India, I want to tell the Indian people that Narendra Modi is the only person who can make India a good nation. Because they have the ability to make decisions that can provide new direction to the citizens of India. Modi ji has given a new direction to the country of India, I have also served as a President for the country. But I have never seen a leader like PM Modi.*’ అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు.
భారత మాజీ రాష్ట్రపతి.. ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారని ఆ పోస్ట్ పేర్కొంది. ఆ పోస్ట్లో ‘దేశ మాజీ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రధాని మోదీకి సంబంధించి ఓ ప్రకటన చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలైనప్పటికీ, ఈ రోజు భారతదేశ సామాజిక కార్యకర్తగా, భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అని భారతీయ ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని ప్రతిభా పాటిల్ అన్నారు. ఎందుకంటే భారతదేశ పౌరులను దిశానిర్దేశం చేయగల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకు ఉంది. మోదీజీ భారత దేశానికి సరికొత్తగా దిశానిర్దేశం చేశారు, నేను దేశానికి రాష్ట్రపతిగా కూడా పనిచేశాను. కానీ ప్రధాని మోదీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు.*’ అని ఆమె చెప్పినట్లు ఆ సోషల్ మీడియా పోస్టుల్లో ఉన్నాయి.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.
‘Former President Pratibha Patil praises Modi’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఎలాంటి వార్తా కథనాలు కనిపించలేదు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిభా పాటిల్ చేసి ఉండి ఉంటే తప్పకుండా మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
మేము ఈ అంశంపై అనేక ఫ్యాక్ట్ చెక్ పోస్టులను కూడా కనుగొన్నాము.
ఈ అంశానికి సంబంధించి ఏవైనా పత్రికా ప్రకటనలు, ఆమె ప్రసంగాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మేము PresidentofIndia.gov.in వెబ్సైట్లో కూడా సెర్చ్ చేశాం.
ఈ పోస్ట్ 2018 నుండి వైరల్ అవుతూ వస్తోంది. మేము గతంలో అప్లోడ్ చేసిన పలు ఫ్యాక్ట్ చెక్ సైట్లను తనిఖీ చేసినప్పుడు, 'ది క్వింట్' వెబ్సైట్ స్పష్టత కోసం మాజీ రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించినట్లు మేము కనుగొన్నాము. ఈ వాదన పూర్తిగా అబద్ధమని అధికారులు తెలిపారు. వైరల్ అయింది ఫేక్ న్యూస్ అని కూడా వివరణ వచ్చింది.
భారత మాజీ రాష్ట్రపతి భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగిడారని చెబుతున్న పోస్టులలో ఎటువంటి నిజం లేదు. ఆమె అలాంటి ప్రకటనేమీ చేయలేదు.
Claim : Former President of India Pratibha Patil praised Indian PM Narendra Modi
Claimed By : Social media user
Claim Reviewed By : Telugupost Factcheck
Claim Source : Social media
Fact Check : False
Next Story