నిజ నిర్ధారణ: నారింజ కాయలతో తయారు చేసిన గణపతి ప్రతిమ ఫ్రాన్స్‌లోనిది, హాలండ్ లోనిది కాదు
గణాలకు అధిపతి అయిన గణేశుడిని ప్రార్ధించే రోజు వినాయక చవితి. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. గణేష్ చతుర్థి భారతదేశంతో పాటు కెనడా, మారిషస్, ఊశా మొదలైన దేశాలలో ప్రాముఖ్యంగా జరుపుకుంటారు.
గణాలకు అధిపతి అయిన గణేశుడిని ప్రార్ధించే రోజు వినాయక చవితి. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటి. గణేష్ చతుర్థి భారతదేశంతో పాటు కెనడా, మారిషస్, ఊశా మొదలైన దేశాలలో ప్రాముఖ్యంగా జరుపుకుంటారు.
ఇటీవల, నారింజ కాయలు, నిమ్మకాయలతో తయారు చేసిన భారీ గణేష్ విగ్రహాన్ని సొషల్ వీడియోలో షేర్ చేస్తూ "ప్రపంచంలో హాలండ్ నారింజ రాజధాని గా పేరు పొందింది. వినాయక చతుర్థి పండుగను జరుపుకోవడానికి స్థానికులు తమ పంటలో ఉత్తమ భాగాన్ని ఉపయోగించి గణేష ప్రతిమ ను తయారు చేసారు. దయచేసి వారు చేసే ఈ అపూర్వమైన వేడుకను చూడండి" అంటూ క్లెయిం చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు.
https://www.facebook.com/lata.
ఇదే వీడియోను ఇటీవల బాలీవుడ్ సెలెబ్రిటీ అర్జున్ రాంపాల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారని తెలుగు పోస్ట్ కనుగొంది.
నిజ నిర్ధారణ:
హాలండ్‌లో గణేష్ చతుర్థి వేడుకలను వీడియో చూపిందన్న వాదన అబద్దం. వీడియోలో కనిపిస్తున్న గణేశ విగ్రహాన్ని నిమ్మకాయల పండుగలో () భాగంగా ఫ్రాన్స్‌లోని మెంటన్ నగరం లో రూపొందించారు.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, 18 ఫిబ్రవరి 2018న ఫ్రాన్స్‌లోని మెంటన్ లో తీసిన కొన్ని స్టాక్ చిత్రాలు కనుగొన్నాము.
దీని నుండి ఆధారాలు తీసుకొని, "లెమన్ ఫెస్టివల్ ఇన్ మెంటన్" అనే కీవర్డ్‌లతో శోధించగా, అవే చిత్రాలను పంచుకున్న వివిధ కథనాలు లభించాయి.
'ది వీక్'లోని ఒక కథనం ప్రకారం, ఫెటే-డు-సిట్రాన్ (లెమన్ ఫెస్టివల్) యొక్క 85వ ఎడిషన్ సందర్భంగా దక్షిణ ఫ్రెంచ్‌లోని మెంటన్లో బాలీవుడ్ థీం పండుగను జరుపుకున్నారు.
ఎఫే.కాం, ఫ్రెంచ్ ప్రచురణ, నారింజ నిమ్మకాయలతో చేసిన శిల్పాల చిత్రాలను ప్రచురించింది. ఈ చిత్రాలలో వినాయకుడి ప్రతిమ ను కూడా మనం చూడవచ్చు.
అదే చిత్రం ఫిబ్రవరి 15, 2018న రాయిటర్స్ చిత్రాలలో ప్రచురించారు, "హిందూ దేవుడు గణేశుడిని వర్ణించే శిల్పం. నిమ్మకాయలు, నారింజలతో చేసిన శిల్పం 85వ లెమన్ ఫెస్టివల్ సందర్భంగా ఫ్రాన్స్‌లోని మెన్టన్లో "బాలీవుడ్" థీమ్ తో తయారు చేసిన ప్రతిమలు. ఫిబ్రవరి 15, 2018.
అందువల్ల, ఫిబ్రవరి 2018లో ఫ్రాన్స్‌లోని మెంటన్లో జరుపుకునే లెమన్ ఫెస్టివల్ లో భాగంగా నారింజ, నిమ్మకాయలను ఉపయోగించి రూపొందించిన ఒక శిల్పం హాలండ్‌కు సంబంధించినదిగా తప్పుడు కథనంతో షేర్ అవుతోంది. క్లెయిం అవాస్తవం.