ఫ్యాక్ట్ చెక్: హిందూ సంప్రదాయం ప్రకారం, యువతి తండ్రిని పెళ్లి చేసుకోలేదు. అదొక ప్రాంక్ వీడియో.
దాదాపు అన్ని ప్రధాన మతాలలో, తండ్రి, కుమార్తెల మధ్య వివాహం ఖచ్చితంగా నిషేధం. నైతికంగా తప్పుగా పరిగణిస్తారు. హిందూ వివాహ
Claim :
భారతదేశంలో హిందూ ఆచారాల ప్రకారం ఒక కుమార్తె తన తండ్రిని వివాహం చేసుకుందిFact :
ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియో, వినోదం కోసం రూపొందించారు
దాదాపు అన్ని ప్రధాన మతాలలో, తండ్రి, కుమార్తెల మధ్య వివాహం ఖచ్చితంగా నిషేధం. నైతికంగా తప్పుగా పరిగణిస్తారు. హిందూ వివాహ చట్టాల ప్రకారం, ఒక కుమార్తె తన సొంత తండ్రి లేదా తాతని వివాహం చేసుకోదు. అదేవిధంగా, తల్లి తన కొడుకు లేదా మనవడిని వివాహం చేసుకోదు. ఇలాంటి బంధాలు హిందూ సంప్రదాయంలో లేవు.
పెళ్లంటే నూరేళ్లు, తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి.
అయితే, ఓ యువతి ఓ వ్యక్తిని తన తండ్రిగా పరిచయం చేస్తూ.. అతడిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో, మహిళ తన వయస్సు 24 సంవత్సరాలు, తన తండ్రి వయసు 50 సంవత్సరాలని, తన తండ్రిని వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఈ పని చేసినందుకు ఆ వీడియోలోని వ్యక్తులు ఎలాంటి బాధను కూడా వ్యక్తం చేయరు. తాము చేసింది తప్పు కాదంటూ ఆ ఇద్దరు చెప్పడం మనం వినొచ్చు. “मुसलमानों को बदनाम करने वालो जरा ये बताओ कि इसी को नियोग प्रथा कहा गया है क्या” అనే టైటిల్ తో సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.
కొన్ని న్యూస్ వెబ్ సైట్లు కూడా ఈ కధనాన్ని నిజం అంటూ వర్ణిస్తూ ప్రచురించాయి. ఈ వీడియో ఎలా సోషల్ మీడియా లో ప్రచారం లో ఉందో, దానికి ఇతర యూజర్లు ఎలా స్పందించారో కూడా కొన్ని వెబ్సైట్లు ప్రచురించాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ యూట్యూబ్ ఛానెల్లో, వివిధ నటులు రూపొందించిన అనేక స్క్రిప్టెడ్ వీడియోలను మేము కనుగొనవచ్చుగొన్నాం. ఇన్స్టాగ్రామ్ ఖాతాతో లింక్ చేసిన అంకిత కరోటియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు సంబంధించిన ఛానెల్ అని బయోలో పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, ఆమె కంటెంట్ సృష్టికర్త అని, ఢిల్లీకి చెందిన ఆమె ప్రాంక్ వీడియోలను చేస్తూ ఉంటుందని బయోలో ఉంది.