Tue Dec 24 2024 17:41:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మధ్యయుగ కాలం నుంచి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీలు తగ్గాయన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
భారతదేశంలో రోజు రోజుకీ ఉష్ణోగ్రతల్లో ఊహించని మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఈ సంవత్సరం జూన్
Claim :
భూమి వాతావరణం చల్లగానే ఉంది. మధ్యయుగ కాలం నుండి వేడెక్కలేదుFact :
నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యయుగ కాలం నుండి భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి
భారతదేశంలో రోజు రోజుకీ ఉష్ణోగ్రతల్లో ఊహించని మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఈ సంవత్సరం జూన్ నుండి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1970 నుండి ఈ స్థాయిలో ఈ సమయంలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం రెండవ సారి. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మంది కనీసం 7 రోజుల పాటు మండే వేడిని ఎదుర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2024 భూమిపై అత్యంత వేడిగా ఉండే ఆగస్టుగా నమోదైంది. ఈ పరిణామాలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అనడానికి అనేక సాక్ష్యాలు కనిపిస్తాయి.
ఇంతలో, మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్, ప్రొఫెసర్ ఎమెరిటస్ ఇయాన్ ప్లైమర్ ఉష్ణోగ్రతలు తగ్గాయని చెప్పినట్లుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. గ్లోబల్ గా ఉష్ణోగ్రతలు పెరగడం లేదని, అయితే మధ్యయుగ కాలం నుండి దాదాపు 4 డిగ్రీలు తగ్గాయని ఆయన పేర్కొన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
ఇయాన్ ప్లైమర్ భూగ్రహం వేడెక్కుతున్నదా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మీరు ఎప్పటి నుండి ఉష్ణోగ్రతను కొలవడం ప్రారంభించారు అనే విషయంపై కూడా పూర్తిగా ఆధారపడి ఉంటుందని తెలిపారు. “మీరు 1850ల నుండి కొలవడం ప్రారంభించినట్లయితే, దాదాపు 0.7 డిగ్రీల సెల్సియస్ వేడెక్కినట్లు మీకు అనిపిస్తుంది.మీరు మధ్యయుగ కాలం నుండి కొలవడం ప్రారంభించినట్లయితే దాదాపు నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గినట్లు భావించాలి. కాబట్టి మీరు భూగ్రహం వేడెక్కుతోందని అంటున్నారు. నా ప్రశ్న మాత్రం ఎప్పటి నుండి?" అని సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మధ్యయుగ కాలం నుండి భూమి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు తగ్గలేదు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) 1850 నుండి గ్లోబల్ ఉష్ణోగ్రత రికార్డులలో 2023 అత్యంత ఉష్ణోగ్రత కలిగిన సంవత్సరం అని ధృవీకరించింది. సగటు చూస్తే 2023లో భూ గ్రహం1850-1900 ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ కంటే 1.48 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంది. 1850-1900 కాలంలో మానవులు భారీ స్థాయిలో శిలాజ ఇంధనాలను కాల్చడం ప్రారంభించారు, కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి పంపడం ప్రారంభించారు.
2023 సంవత్సరానికి సంబంధించిన కోపర్నికస్ డేటాను మీరు చూడొచ్చు.
NASA నివేదిక ప్రకారం 1951 నుండి 1980 వరకు ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పును చూపించే గ్రాఫ్‌ను చూడొచ్చు. 1880లో వాతావరణ మార్పులను రికార్డును చేయడం ప్రారంభమైనప్పటి నుండి 2023లో భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత రికార్డులో అత్యంత వేడిగా ఉంది. 19వ శతాబ్దం చివరిలో (1850 -1900) నమోదైన ఉష్ణోగ్రత సగటు కంటే 2023లో భూమి ఉష్ణోగ్రత దాదాపు 2.45 డిగ్రీల ఫారెన్‌హీట్, 1.36 డిగ్రీల సెల్సియస్ వేడిగా ఉంది.
నేచర్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం గత 24,000 సంవత్సరాల నుండి వాతావరణ మార్పులను పరిశీలిస్తే, హోలోసిన్ నుండి ప్రపంచ ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రొ. ప్లైమర్, భూగర్భ శాస్త్రవేత్త, ఆయన వాతావరణ మార్పుల గురించి ఎన్నో తప్పుడు విషయాలను షేర్ చేసారు. కొన్ని ఇటువంటి వాదనలను ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు డిబంక్ చేసాయి.

ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో భూ, సముద్ర వాతావరణ శాస్త్రాల ప్రొఫెసర్ అలాన్ మిక్స్ తో ఏఏపి ఫ్యాక్ట్ చెక్ సంస్థ మాట్లాడినప్పుడు, ఆయన ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని స్పష్టం చేసారు. ప్లైమర్ వాదనలు తప్పుడువి అని తేల్చి చెప్పారు.
మధ్యయుగ కాలం నుంచి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీలు తగ్గాయన్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : భూమి వాతావరణం చల్లగానే ఉంది. మధ్యయుగ కాలం నుండి వేడెక్కలేదు
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story