ఫ్యాక్ట్ చెక్: మహిళలకు రాత్రిపూట ఉచిత ప్రయాణం హెల్ప్‌లైన్ నంబర్ లూథియానాకు పరిమితం
మహిళలపై నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. కలకత్తాలో ఓ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తించింది. ఆర్జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ కోల్‌కతా నగరంలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
Claim :
హెల్ప్‌లైన్ నంబర్ 7837018555 కు మహిళలు రాత్రిపూట కాల్ చేస్తే భారతదేశంలో ఎక్కడైనా ఉచితంగా, సురక్షితమైన రైడ్‌ని పొందవచ్చుFact :
ఈ హెల్ప్‌లైన్ నంబర్ 7837018555 లుథియానా పోలీసుల ద్వారా ప్రారంభించారు. భారతదేశం మొత్తం పని చేయదు, లుధియానాలో మాత్రమే పని చేస్తుంది
మహిళలపై నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. కలకత్తాలో ఓ వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో మహిళల భద్రతపై ఆందోళన రేకెత్తించింది. ఆర్జి కర్ ఆసుపత్రిలో డాక్టర్‌పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ కోల్‌కతా నగరంలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోల్‌కతాలో 100 కంటే ఎక్కువ ప్రదేశాలలో నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చుట్టుపక్కల పట్టణాలకు, అనేక ఇతర భారతీయ నగరాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి.
వీటన్నింటి తర్వాత.. చాలా మంది వినియోగదారులు ‘రాత్రిపూట మహిళల భద్రత కోసం, పోలీసులు ఉచిత, సురక్షితమైన రైడ్ సౌకర్యానికి సంబంధించిన హెల్ప్‌లైన్ ను 7837018555 నంబర్‌తో ప్రారంభించారని పేర్కొంటూ తెలుగులో సందేశాలను పంచుకోవడం ప్రారంభించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము ట్రూకాలర్‌లో 7837018555 నంబర్‌ను సెర్చ్ చేసినప్పుడు, ఆ నంబర్ లూథియానా పోలీసులకు చెందినదని మేము కనుగొన్నాము.
డిసెంబర్ 2019లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. లూథియానా, పంజాబ్ వెలుపల ఉన్న అనేక మందితో సహా రాత్రిపూట ఇంటికి డ్రాప్ చేసే సౌకర్యాల గురించి నగరవాసులు ఆరా తీస్తూ లూథియానా పోలీసుల మహిళా హెల్ప్‌లైన్ నంబర్లకు 3000 కంటే ఎక్కువ కాల్లు వచ్చాయి. కొందరు UP, బీహార్, మహారాష్ట్ర, కేరళ వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా కాల్ చేశారు. లూథియానా పోలీసుల రెండు హెల్ప్‌లైన్ నంబర్లు - 1091, 7832018555 ట్విట్టర్, ఫేస్బుక్లో వైరల్ అయ్యాయి. పలు కుటుంబాలు కూడా తమ ఇంటి మహిళలు సాయంత్రం వరకు పని చేస్తున్నారని, వారికి సరైన రక్షణ కల్పించాలంటూ కూడా హెల్ప్‌లైన్‌కు కాల్ చేస్తున్నారు. అయితే ఈ నంబర్ లూథియానాలోని మహిళలకు మాత్రమేనని కాల్ చేసిన వారికి పోలీసులు చెప్పారు.
వైరల్ నంబర్ లూథియానా పోలీసులకు చెందినది అయినప్పటికీ, అనేక రాష్ట్రాల్లోని రాష్ట్ర పోలీసులు సంవత్సరాలుగా మహిళల కోసం భద్రతా విభాగాన్ని ప్రారంభించారు. ఉదాహరణకు, తెలంగాణ పోలీసులు వివిధ పద్ధతులను ఉపయోగించి సంప్రదించగలిగే మహిళా భద్రతా విభాగాన్ని ప్రారంభించారు. వారి వెబ్సైట్లో కాంటాక్ట్ నంబర్‌ను కూడా ప్రచురించారు – 8712656858 నెంబర్ కు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని కోరారు. ఇక ప్రాంతాల వారీగా సంప్రదించడానికి ఇతర అధికారుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి.
జాతీయ మహిళా కమిషన్ వెబ్సైట్లో దేశవ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలకు సంబంధించితిన్ కొన్ని ఇతర హెల్ప్‌లైన్ నంబర్లు ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ పోలిస్ ఈ ప్రచారం తప్పు దారి పట్టించేది అని తెలిపారు.