ఫ్యాక్ట్ చెక్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళ హత్యోదంతానికి మతం ముసుగు వేసి ప్రచారం చేస్తున్నారు
సంజయ్ అనే హిందూ వ్యక్తి, గుల్నాజ్ అనే ముస్లిం యువతి పెళ్లి చేసుకున్నారని, వారు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. పోలీసు

Claim :
ఒక హిందూ వ్యక్తి తన ముస్లిం భార్యను హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపరిచాడుFact :
ఇద్దరూ ఒకే మతానికి చెందిన వారు
ఇటీవలి కాలంలో భర్త నే భార్య ను చంపి పారిపోతున్న ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.అయితే, వీటిలో కొన్నిటికి మతాల రంగు పులిమి వైరల్ గా మారుస్తున్నారు. కొన్ని లవ్ జిహాద్ పేరు మీద ప్రచారం అవుతుంటే, కొన్ని భగవా లవ్ అంటూ షేర్ అవుతున్నాయి.
అయితే, పోలీసు అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా కనపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అధికారులు ఒక ఇంటి రూములో సోదాలు చేసి, ఫ్రిజ్‌లో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారనీ, ఆ రూములో సంజయ్ అనే హిందూ వ్యక్తి, గుల్నాజ్ అనే ముస్లిం యువతి పెళ్లి చేసుకుని నివసించేవారనీ, ఆమెను అతను చంపేసాడనీ ఈ వాదన సారాశం. భగవా లవ్ ట్రాప్ అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన కథనాలను వెతకగా "ఇద్దరూ 5 ఏళ్ల లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నట్టూ, 9 నెలల పాటు శరీరాన్ని ఫ్రిజ్‌లో ఉంచాడు, అయితే విద్యుత్ అంతరాయం కారణంగా ఈ ఘటన బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని బృందావన్ ధామ్ కాలనీలో తాళం వేసి ఉన్న గదిలో ఫ్రిజ్‌లో ఓ యువతి మృతదేహం కనిపించింది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో మృతదేహం కొన్ని నెలల నాటిదని పోలీసులు గుర్తించారు. తర్వాత సంజయ్ పాటిదార్, వినోద్ దావే అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మరణించిన పింకీ ప్రజాపతి అనే మహిళతో సంజయ్ 5 సంవత్సరాలుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నాడు. పింకీ పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో సంజయ్ తన సహచరుడు వినోద్‌తో కలిసి మార్చి 2024లో ఆమెను గొంతుపిసికి చంపి, ఆపై ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. విద్యుత్తు అంతరాయం కారణంగా ఫ్లాట్ నుండి దుర్వాసన రాగా ఈ ఘటన బయటపడింది." X లో షేర్ అవుతున్న కొన్ని పోస్టులు మాకు కనపడ్డాయి.