Mon Dec 23 2024 14:52:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది వివేకానందుడు కాదు.. పరమహంస యోగానంద
ఎత్తైన భవనాలు ఉన్న వీధిలో ఒక హిందూ స్వామీజీ నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది స్వామి వివేకానందకు చెందిన అరుదైన వీడియో అని పేర్కొంటూ వైరల్ చేస్తున్నారు.
ఎత్తైన భవనాలు ఉన్న వీధిలో ఒక హిందూ స్వామీజీ నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది స్వామి వివేకానందకు చెందిన అరుదైన వీడియో అని పేర్కొంటూ వైరల్ చేస్తున్నారు.“శ్రీ వివేకానంద స్వామి ని చూసి నందుకు ధన్యునయ్యాను. భారతదేశ ఖ్యాతిని హిందూ ధర్మం యొక్క విశిష్టతను ఖండ ఖండంతరాలు తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్వామి వివేకానంద కి నా పాడాభి వందనాలు. ఆయన నిజ రూప దర్శనము మీరు చూసి మీ పిల్లలకు చూపించండి.. rare video.. భారత్ మాతాకు జై జై హింద్” అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ఈ వీడియో వాట్సాప్ లో కూడా వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పరమహంస యోగానంద.. స్వామి వివేకానంద కాదు.వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను Google లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించి శోధించగా.. మేము అనేక రిజల్ట్స్ ను కనుగొన్నాము. యూనివర్సల్ యోగాడాన్స్ అనే యూట్యూబ్ ఛానెల్ శ్రీ శ్రీ పరమహంస యోగానంద జీ అమెరికాలో ఉన్న సందర్భంలో అనే పేరుతో ఒక వీడియోను ప్రచురించింది. ఈ వీడియో నవంబర్ 2016లో ప్రచురించారు."Sri Sri Paramahansa Yogananda ji – During his early years in America" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.స్వామి యోగానంద 1923లో న్యూయార్క్‌ను సందర్శించిన ఈ ఒరిజినల్ వీడియో ఫుటేజీని (సౌత్ కరోలినా యూనివర్సిటీ సహకారంతో) మీకు అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని అందులో తెలిపారు.వైరల్ వీడియోలో కనిపిస్తున్నది స్వామి వివేకానంద కాదు, క్రియా యోగా, ధ్యానం ప్రయోజనాల గురించి మిలియన్ల మందికి బోధించిన యోగి, ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద. ఆయన 1920 లలో పశ్చిమ దేశాలకు యోగా, ధ్యానాన్ని పరిచయం చేసినందున అతన్ని "ఫాదర్ ఆఫ్ యోగా ఇన్ ది వెస్ట్" అని కూడా పిలుస్తారు.వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Rare video of Swami Vivekananda
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story