ఫ్యాక్ట్ చెక్: పైనాపిల్ ను మరిగించిన నీటిని తాగడం వలన క్యాన్సర్ నయం అవుతుందనేది నిజం కాదు
క్యాన్సర్ అన్నది శరీరంలోని కొన్ని కణాలు అనియంత్రితంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. మానవ శరీరంలోని కణాలు
Claim :
పైనాపిల్ ను ఉంచి మరగబెట్టిన నీటిని ప్రతిరోజూ తీసుకుంటే క్యాన్సర్ నయం అవుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందిFact :
డైట్ లో భాగంగా పైనాపిల్ ను తీసుకోవడం మంచిది. అంతేకానీ ఇది క్యాన్సర్‌ను నయం చేయదు
క్యాన్సర్ శరీరంలోని కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. మానవ శరీరంలోని కణాలు పాతవి అయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు అవి చనిపోతాయి. కొత్త కణాలు వాటి స్థానంలో వస్తాయి. కానీ, కొన్నిసార్లు ఈ ప్రక్రియ సరిగా సాగకపోతే, అసాధారణమైన లేదా దెబ్బతిన్న కణాలు పెరుగుతాయి. ఈ కణాలే క్యాన్సర్ లేదా కణితులను తయారు చేస్తాయి.
ఏ రకమైన క్యాన్సర్‌కైనా నిర్దిష్ట వైద్యం లేదు, కానీ దానిని నయం చేసే చికిత్సలు ఉన్నాయి. సాధారణ క్యాన్సర్ చికిత్సలలో కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, హార్మోన్ థెరపీ మొదలైనవి ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని బట్టి వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రక్రియలను ఉపయోగిస్తారు.
ఇదిలా ఉండగా పైనాపిల్, వేడి నీళ్లను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను ఓడించవచ్చంటూ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ వివరాలను 10 మందితో పంచుకోవాలని ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ క్వాక్ చెప్పినట్లు ఆ మెసేజీలో ఉంది. పైనాపిల్ ను ఉంచిన నీరు క్యాన్సర్ కణాలను పూర్తిగా తొలగిస్తుందని అందులో ఉంది. పైనాపిల్ ముక్కలను వేడి నీటిలో వేసి, ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల క్యాన్సర్ వ్యాధితో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచవచ్చని సందేశం పేర్కొంది.
ఈ పోస్ట్ వాట్సాప్ లో కూడా వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
మొదటిగా, మేము ప్రొఫెసర్ డాక్టర్ గిల్బర్ట్ ఎ క్వాక్ కోసం వెతికినప్పుడు, ఏ ఆసుపత్రిలోనూ అటువంటి వైద్యుడు ఉన్న దాఖలాలు కనుగొనలేకపోయాం. అతని పేరు మీద ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. Dr Gilbert A Kwok అసలు లేరంటూ కొన్ని X పోస్ట్‌లను కూడా మేము కనుగొన్నాము.